అగ్ని కడిగిన అక్షరం…
ముళ్ళడొంకలాంటి బతుకు మీద అక్షరమై పూచి కన్నీటి తెరమీద తడి తపనల్ని అద్ది వెళ్లిపోయిన కవి అలిశెట్టి ప్రభాకర్. హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధికావాలి… భారమవుతున్న ఉచ్చ్వాస నిశ్వాసాల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకింత సహనం కావాలి అన్న సాహసి. గుండె నిండా బాధ, కళ్ళనిండా నీళ్లున్నప్పుడు కూడా జనమైదానంలోకి అక్షర రవ్వల్ని కురిపించి…