ఎడతెగని సంఘర్షణ ఎదుర్కొంటున్న మణిపూర్ ప్రజలు
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ సహా పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకుంటున్న వారిని శిక్షించలేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ పలు వాహనాలకు నిప్పు పెట్టారు. జిరిబామ్‌లో ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన ఆరుగురి…