అంతు లేని ఆవేదనలకు తుది రూపం ఆత్మహత్యలు
‘‘ ప్రతీ జీవి కడవరకూ జీవించాలనే కోరుకుంటుంది. అర్ధవంతమైన జీవితాలను అర్థాంతరంగా ముగించాలని ఏ వ్యక్తి కోరుకోడు.బ్రతుకు బరువై,భద్రత కరువై, జీవించడానికి కడవరకూ పోరాటం చేసి,గత్యంతరం లేని పరిస్థితుల్లో తనువు చాలించాలని నిర్ణయించుకునే నిస్సహాయ వ్యక్తుల గురించి కూలంకుషంగా తెలుసు కోవాలి. వారి అంతరంగం లో చెలరేగిన అల్లకల్లోల పరిస్థితులను అర్థం చేసుకుని, అండగా నిలబడితే…