రుణభార అభివృద్ధి నమూనా: దొందూ దొందే!
తెలంగాణ రాష్ట్రం దేశీ విదేశీ రుణాల విషవలయంలో చిక్కుకుని అప్పుల కుప్పగా మారిపోతున్నదని, ఇవాళ్టి “అభివృద్ధి అవసరాల” పేరుతో భవిష్యత్ తరాల జీవితాలను తాకట్టు పెట్టి, రాజకీయ నాయకుల, అధికారుల బొక్కసాలు నింపుకునే పాలక అవినీతి వ్యూహాలు కొనసాగుతున్నాయని గత పదకొండు సంవత్సరాలుగా వేరువేరు వేదికల మీద రాస్తూ, మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటకొస్తే ఇది తెలంగాణ రాష్ట్రపు కొత్త జాడ్యం…