సిఎం రేవంత్‌కు పోలీసుల విరాళం అందచేత
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్11:తెలంగాణలో వరద భాదితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ.11.06 కోట్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్ అందజేశారు. తెలంగాణ పోలీసు అకాడలో పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎంకు చెక్కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిజిపి తదితరులు పాల్గొన్నారు.