ధ్వంసమైపోతున్న జీవ వైవిధ్యం!

మన దేశంలోని జీవ వైవిధ్య సంపద మనకు గర్వకారణం. జీవ వైవిధ్యం ప్రకృతి స్వరూపం, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం నిహితమై ఉండడం ప్రకృతి స్వభావం! స్వరూపం ఛిన్నాభిన్నం అవుతుండడం శతాబ్దాల వైపరీత్యం, ఫలితంగా ప్రకృతిలో నిహితమైఉన్న స్వభావ సమన్వయం కూడ నశించిపోతోంది! వృక్షజాలం, జంతుజాలం పరస్పరం పరిపోషకాలు కావడం ప్రకృతి సతత హరిత…
