సీఎం రేవంత్ క్రిస్మస్ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24ః క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.…
