వరంగల్ లో మొట్ట మొదటి అపురూప పాఠశాలాలయం.. చందా కాంతయ్య బడి
కాకతీయ కలగూర గంప -8 తెలంగాణ పాత ముచ్చట్లు ప్రతి మనిషికి చదువు బాటలో తొలి అడుగులు ప్రాధమిక పాఠశాలలో పడినా అవి బుడి బుడి అడుగులే! ఐతే అక్కడ బీజాలు పడ్డ మన అక్షర పదాల సముదాయానికి వాక్య నిర్మాణ పద బంధ రూపాన్ని, వ్యాకరణ స్వరూపాన్ని ఇచ్చేది; ఇంకా… అంకెలను సంఖ్యల్లోకి, సమీకరణాలలోకి…