ఆకాశంలో సంబరం
ఆకాశమంతా ఉల్కాపాతం మిలమిలా మెరిసిపోతూ గగనం నుండి వెండితళుకుల హిమపాతం ధారగా కురిసిపోతూ! రోదశి యుద్ధంలో ఓడిన గ్రహాశకలాలన్నీ రాలిపోతూ చీకటి రాత్రిలో నింగినుండి భూగోళంపై క్షిపణుల్లా జారిపోతూ! శకునం చెప్పే తోకచుక్క కధనాలు, మబ్బులయుద్ధపు మెరుపు విశేషాలు, సిగపట్లకు రేగే ఉరుము ద్వానాలు అలసి సొలసి రాలిపోయే నక్షత్రాలు! కదిలి తరలిపోతున్న పాలపుంతలు, నీడభూతాలకు…