తెలంగాణ పోరాటంలో శ్రీకాంత్‌చారి సేవలు ఎనలేనివి :బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 3 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని చెప్పారు. కేసీఆర్ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న…