మానవ తాత్వికతకు దర్పణం బాలగోపాల్
ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు దానికి తిరుగుబాటుగా వొచ్చే ప్రతిహింస సైతం మానవత్వానికి జవాబుదారీగా ఉండాలని , అలాకాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అనుకరణ మాత్రమే కాగలవని నిస్సందేహంగా వివరించిన వాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు సామాజిక ధోరణులలో సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు…