అలసట

అలసిపోయావా నేస్తం సోలిపోయావా నేస్తం ఆలోచనలు తక్కువైపోయి ఆవేశాలు ఎక్కువైపోయి ఊహలు మిగిలిపోయి వాస్తవాలు తేలిపోయి కలలు కరిగిపోయి కోరికలు పెరిగిపోయి కన్నీళ్లు ఇంకిపోయి భావాలు పెగలక నిర్లిప్తత చేరాక శూన్య మస్తిష్కంలో అనాశక్తి మేఘం అవరించిందా? నిరాశక్త తాపం దాపురించిందా? అయితే అది ప్రశాంతత కాదు అది స్వాంతత కాదు వచ్చే తుఫానుకు సంకేతం!…