అగ్నిపద్యం అలిశెట్టి కవిత

దోపిడి వటవృక్షాలను దహించే అగ్నిపద్యంలా అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని సృష్టించిన అక్షరయోధుడు అలిశెట్టి ప్రభాకర్. తుపాకీ తూటాలా తన భావాలను సూటిగా గుండెలను తాకించగల శక్తి అలిశెట్టి అక్షరానిది. కరెన్సీ స్పర్శ కంటే కవిత్వంలోనే సేదతీరిన రచనా పిపాసి. రాతకు చేతకు లేశమాత్రం తేడా లేని నిండైన నిఖార్సయిన ఆచరణశీలి. నాలుగు పదులు కూడా దాటని అలిశెట్టి…
