ఒట్టులాంటి మాటోకటి
గంటలుకొద్ది తడుస్తూ రోజులకొద్ది మునుగుతూ కలలకొద్ది కొట్టుకుపోయే ఊహ ఉప్పెన తరంగమే. ఆశలెంతగా పెనుగులాడినా జిత్తులమారుల ఎత్తుపల్లాలకు పట్టుదొరక్క పల్టీకొట్టిన సమస్య ఉరికే నదిలా మలుపుకో వేగం. దూరాన పాత రోజు బిగ్గరి కేకను చూపులందుకునేలోపే మనసు సుడితిరిగి చిక్కుపడి బొట్టు బొట్టుగా బాధకు బరువెక్కిన హోరుకు ఒకరిలో ఒకరు తేలిగ్గా తేలే ఒట్టులాంటి మాటోకటి…