101 కిలోల గంజాయి స్వాధీనం: ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని కొల్లూరులో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని శేర్లింగంపల్లి డిసిపి సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. అక్రమంగా గంజాయిని నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కొల్లూరు పోలీసులు, మాదాపూర్ ఎస్‌ఓటీ సిబ్బంది సంయుక్తంగా అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్వ జగన్నాథం (37), పల్లపు లక్ష్మీనారాయణ (52)…
