‘సుప్రీమ్‌’‌లో కెటిఆర్‌కు చుక్కెదురు

  • క్వాష్‌ ‌పిటిషన్‌ అత్యవసర విచారణకు నో
  • 15న విచారిస్తామన్న చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ఖన్నా

న్యూదిల్లీ, జనవరి 9 (ఆర్‌ఎన్‌ఎ):  ‌సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్‌ ‌పిటిషన్‌ను శుక్రవారం విచారణకు తీసుకునేందుకు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌నిరాకరించారు. ఈనెల 15న సుప్రీంలో కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌పై విచారణ జరగనుంది. 15న విచారణకు లిస్ట్ ‌చేసినందున అదే రోజు విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అప్పటి దాకా కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఫార్ములా ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు.. కేటీఆర్‌ ‌వేసిన క్వాష్‌ ‌పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ ‌చేస్తూ సుప్రీం కోర్టులో కేటీఆర్‌ ‌పిటిషన్‌ను దాఖలు చేశారు.

అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్‌ ‌తరపు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీం కోర్టు సీజేఐ నిరాకరించారు. హైకోర్టులో క్వాష్‌ ‌పిటిషన్‌ను కొట్టేసిన వెంటనే సుప్రీం కోర్టులో కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే దాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ 15 విచారణ జరుపుతామంటూ ఆరోజు లిస్ట్ ‌చేశారు.

అయితే ఈరోజు కేటీఆర్‌ ‌తరపు న్యాయవాదులు సీజేఐ ధర్మాసనం ముందు హాజరై.. ఇది చాలా సున్నితమైన అంశమని.. కేటీఆర్‌ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నందున్న ఈరోజు లేదా రేపు విచారణ జరపాలని కేటీఆర్‌ ‌న్యాయవాదు కోరారు. అయితే ఇది అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతూ ఈనెల 15న విచారణకు లిస్ట్ ‌చేసినందున ఇక ఆరోజే విచారస్తామని సంజీవ్‌ ‌కన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *