యూట్యూబ్ వీడియో ప్లే అవుతోంది!
“…బిస్కెట్ అనేది కాబ్స్ అండ్ షుగర్… సో పొద్దున్నే లేదా ఆకలేసినప్పుడల్లా తినకూడదు…”
‘నువ్వు బిస్కెటెయ్యకుండానే ఆ సీట్లో కూర్చున్నావా?’ కామెంటుకు లైకులే కాదు, లవ్వులూ విసిరారు!
“సెకండ్, సాఫ్ట్ డ్రింక్స్ వద్దండి…”
“బిర్యానీతో వొక్క కోక్ లాగిస్తే?”
“ఒక్క చిన్న కోక్‌లో ఆల్మోస్ట్ సెవెన్ టు నైన్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వుంటుంది…”
వీడియోలో సంభాషణ ప్లే అవుతూ వుండగా కామెంట్స్ వస్తూవున్నాయ్!
‘మామూలు నీళ్ళలో తొమ్మిది స్పూన్ల షుగర్ వేసి కోకూ అదీ తాగండి తేడా మీకే తెలుస్తుంది, బోకు మాటలూ బోకు మొకాలూ…’
‘కేజీ షుగర్ నలభైయైదు రూపాయలు, కంపెనీ మూసేస్తాడేమో?!’
‘కోక్ కూడా తాగకుండా యెందుకు? దీనెమ్మా జీవితం,’
‘మావా, నీనయితే కూల్ డ్రింక్స్‌తాగి కూల్‌గా చచ్చిపోతా మావా… నన్నొదులు మావా…’
‘మిమ్మల్నందర్నీ కోక్ కంపనీవాడు ప్రమోటర్స్‌గా జాబ్స్ యివ్వాలని డిమాండ్ చేస్తున్నా అధ్యక్షా!’
‘కోక్ యేమైనా పర్లేదు, హెల్త్ యేమైనా పర్లేదు, దేశం నాశనమైపోతోంది చూశారా?’
‘ఏమైంది అంకుల్?’
‘బోకులిద్దరూ బొట్టు పెట్టుకోలేదు,’
‘ఆ యాంకర్ ముంజ యెప్పుడూ పెట్టుకోదు!’
‘మొగుడు పోయాడేమో?’
‘ఒక్క మొగుడు కాదు…’
‘డ్రెస్‌ని బట్టి బొట్టు కొన్నిసార్లు పెట్టుకుంటారు, కొన్నిసార్లు తీసేస్తారు…’
‘డ్రెస్ తీసేసినా ఫరవాలేదు, బొట్టు తీస్తే మాత్రం వొప్పుకోము!’
ఆ చివరి కామెంటుకు వందల కొద్దీ లైకులూ లవ్వులూ లాఫులూ వావ్‌లూ వచ్చాయి! ఆ వైరలయిన కామెంటుతో షార్ట్ వీడియోలూ వచ్చాయి!!

-బమ్మిడి జగదీశ్వరరావు