తనిఖీలు లేకుండానే మేడిగడ్డకి సబ్‌స్టాన్షియల్‌ ‌పత్రం

కాళేశ్వరం కమిషన్‌ ‌ముందు  సిఈ సుధాకర్‌ ‌రెడ్డి
హైదరాబాద్‌,అక్టోబర్‌26 : ‌కాళేశ్వరం కమిషన్‌ ‌ముందు చీఫ్‌ ఇం‌జినీర్‌ (‌సీఈ) సుధాకర్‌రెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌ ఆయన్ను విచారించింది. డీపీఆర్‌ ‌తయారీ పనులను నామినేషన్‌ ‌పద్ధతిన వ్యాప్కోస్‌కు అప్పగించినట్లు సుధాకర్‌రెడ్డి కమిషన్‌కు తెలిపారు. తనిఖీలు లేకుండానే మేడిగడ్డ బ్యారేజీకి సబ్‌స్టాన్షియల్‌ ‌పత్రం ఇచ్చినట్లు అంగీకరించారు.

డీపీఆర్‌ ‌ప్రకారం కాఫర్‌ ‌డ్యామ్‌కు డబ్బులు ఇచ్చినట్లు సుధాకర్‌రెడ్డి తెలిపారు.మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌ ‌ఖరారు వేళ ఎల్‌అం‌డ్‌టీ సంస్థని సంప్రదించినట్లు వివరించారు. విచారణ సందర్భంగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరని కమిషన్‌ ‌ప్రశ్నించింది. దీనికి సుధాకర్‌రెడ్డి.. హరీశ్‌రావు అని సమాధానమిచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఎలాంటి ఆదాయం లేదని సుధాకర్‌రెడ్డి చెప్పారు. వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయని కమిషన్‌కు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *