ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి
:ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ
ఆందోల్, ప్రజాతంత్ర, నవంబర్ 14: విద్యా ర్థులే దేశ భవిష్యత్ నిర్మాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సి ంహ అన్నారు. అమ్మాయిలు అభద్రతకు గురికావొద్దని, ధైర్యంగా అన్నిరంగాల్లో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరూ స్వేచ్చగా, స్వతంత్రంగా జీవించాలని ఆకాంక్షించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆం దోల్ ప్రభుత్వ గురుకుల పాఠశాల, గర్లస్ జూనియర్ కాలేజీలో జరిగిన పదవ జోనల్ లెవల్ గేమ్స్ అండ్ స్పోర్టస్ మీట్ బహు మతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజ నర్సింహ పాల్గొన్నారు. క్రీడల్లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. విద్యార్థినులతో కబడ్డీ ఆడి వారిని మంత్రి ఉత్సాహపరిచారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆటల్లోనైనా, జీవితంలోనైనా గెలుపోటములు సహజమని, స్పోర్టీవ్‌గా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. మరోసారి ఆడి గెలిచేందుకు శక్తిని కూడదీ సుకుని సాధన చేయాలని సూచించారు.
ఇప్పుడు చదువుల్లో పడి క్రీడలను నిర్లక్షం చేస్తున్నారని, కానీ, విద్యతో పాటు కల్చర్, స్పోర్టస్ కూడా చాలా ముఖ్యమని చెప్పారు. . ప్రతీ విద్యార్థి తమకు నచ్చిన ఆటలు ఆడాలని, క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారని . పోటీతత్వాన్ని అలవర్చుకుంటారు. ఒత్తిడిని తట్టుకునే శక్తిని, లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను సంపాదించుకుంటారనితెలిపారు.
జీవి తంలో ఎదగటానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అమ్మాయిలు చదువుల్లో, ఆటల్లో రాణించడంతో పాటు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, సమకాలిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అకడమిక్ బుక్స్‌తో పాటు, చరి త్రకు సంబంధించిన పుస్తకాలు కూడా చద వాలని, స్కూల్‌లో లైబ్రరీ ఏర్పాటు చేసి అన్ని బుక్స్ అందజేస్తామని, ప్రతి స్టూడెంట్ లైబ్ర రీకి వెళ్లాలని మీకు నచ్చిన పుస్తకం చద వాలని సూచించారు.. తల్లిని, తండ్రిని, గురు వులను జీవితాంతం మరవొద్దనే మన సంస్కృ తిని విద్యార్థులంతా పాటించాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచిం చారు.





