సంగెం మూసీనది ఒడ్డున శివలింగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

మూసీ పునరుజ్జీవన పాదయాత్రకు శ్రీకారం
ముఖ్య‌మంత్రి వెంట నడిచిన మంత్రులు

మూసీ పునరుజ్జీవన పాదయాత్రను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సంగెంలోని మూసీనది ఒడ్డున ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను మొదలుపెట్టారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి భీమలింగం వరకు సుమారు 2.5 కిలోమీట‌ర్ల మేర పాదయాత్ర కొనసాగింది. మూసీ పునరుజ్జీవ యాత్రలో కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ , కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు సీఎం వెంట న‌డిచారు. వలిగొండ మండలం సంగెం నుంచి సీఎం రేవంత్‌ పాదయాత్ర చేపట్టారు. సంగెం నుంచి భీమలింగం వరకు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. స్థానిక రైతుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. భీమలింగం నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్‌ కట్ట వెంబడి ఈ పాదయాత్ర సాగింది. వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వాలో భీమలింగానికి అభిషేకం చేసి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. బోట్‌లోకి దిగి మూసీ కాలుష్య జలాలను సీఎం రేవంత్‌ రెడ్డి పరిశీలించారు.
మూసీ పునరుజ్జీవం యాత్రతో మూసీ పరీవాహక ప్రజల వద్దకు సీఎం వెళ్లనున్నారు. తన జన్మదినం నవంబర్‌ 8 నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం రేవంత్‌ శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలు చేయనున్నారు. యాదాద్రి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన మొదలైంది. ఇందులో భాగంగా కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనార సింహుడిని దర్శించుకుని సీఎం రేవంత్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర సాగనుంది. మల్లన్న సాగర్‌ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌ లైన్‌ ప్రాజెక్ట్‌ పనులకు శంకుస్థాపన చేశారు.
ఇటీవల మూసీకి సంబంధించి బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడే బీఆర్‌ఎస్‌ నేతలు మూసీ పునరుజ్జీవనం కోసం యత్నాలు చేయడం, మూసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ప్రాజెక్టు కోసం డిజైన్‌ కూడా చేశారు.  మూసీ సుందరీకరణపై సూచనలు ఇవ్వాలని.. అంతేకానీ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. మూసీ మురికిలో ఉండేందుకు ప్రజలు ఎవరూ సుముఖంగా లేరన్నారు. అక్కడున్న వారికి న్యాయం చేసేందుకు సూచనలు ఇవ్వాలని.. అంతే కానీ ఆందోళనలు చేయడం తగదన్నారు. ప్రజలంతా మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారని తెలిపారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాడపల్లి నుంచి తాను చేస్తున్న పాదయాత్రకు కలిసి రావాలని.. నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా లేదా అని వారినే అడిగి తెలుసుకుందామని సవాల్‌ విసిరారు. అనట్లుగానే ఈనెల 8 నుంచి మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్రను సీఎం రేవంత్ ప్రారంభించారు.
ప‌టిష్ట బందోబ‌స్తు
సిద్ధమయ్యారు. అయితే మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. వలిగొండ మండలంలో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగుకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీశ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగానూ పలువురు ప్రముఖులు అభినందనల తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *