అంతా దగుల్బాజీ- కౌటిల్యం కాక ఇంకేమిటి?

“తెలంగాణా ప్రాంతానికి “వరప్రసాది.” అయిన ఈ ప్రాజెక్టు కుదించి వేస్తే వేశారు. పోనీ సత్వరం నిర్మించుతారా అంటే అదీ లేదు. నాలుగో ప్రణాళికాంతం వరకు పూర్తవుతుందని డబ్బా వాయిస్తున్నారు ఎందుకు ఆలస్యం అంటె డబ్బులేదంటారు. మిగులు నిధులు కోట్లు మావి ఉన్నవి కదా వాటిని ఖర్పు పెట్టండీ అంటే “పాత కోట్లా కొత్త కోట్లా” అంటాడు ముఖ్యమంత్రి. (శాసన సభ్యుడడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా) హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన పోచంపాడు గతినిట్లా చేశారు.” 

పోచంపాడు తలమొదలు సర్వావయవాలు ఖండించారు

జనధర్మ తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సంకలనం సంపాదకుడు యం యస్ ఆచార్య రచనలో తెలంగాణ కు ఎంత దారుణంగా దోచుకున్నారో అర్థమవుతుంది.  నీటి పారుదల  వనరుల అభివృద్ధి వ్యవహారం కూడా అంతే. తెలంగాణా ఆరు జిల్లాలలో 26 లక్షల ఎకరాల పైగా భూమిని సాగుకుతెచ్చే 117 కోట్ల వ్యయం కాగల పోచంపాడు భారీ ప్రాజెక్టును తలమొదలు సర్వావయవాలు ఖండించి 5 లేక 6 లక్షల ఎకరాల సాగు చేసే మధ్యతరహా ప్రాజెక్టుగా మార్చారు. తెలంగాణా ప్రాంతానికి “వరప్రసాది.” అయిన ఈ ప్రాజెక్టు కుదించి వేస్తే వేశారు. పోనీ సత్వరం నిర్మించుతారా అంటే అదీ లేదు. నాలుగో ప్రణాళికాంతం వరకు పూర్తవుతుందని డబ్బా వాయిస్తున్నారు ఎందుకు ఆలస్యం అంటె డబ్బులేదంటారు. మిగులు నిధులు కోట్లు మావి ఉన్నవి కదా వాటిని ఖర్పు పెట్టండీ అంటే “పాత కోట్లా కొత్త కోట్లా” అంటాడు ముఖ్యమంత్రి.

(శాసన సభ్యుడడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా) హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన పోచంపాడు గతినిట్లా చేశారు. మద్రాసు – హైద్రాబాద్ ప్రభుత్వాలు రూపొందించిన నాగార్జునసాగర్ పాజెక్ట్ కూడా నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలలో లక్షల ఎకరాల సాగుకు అనువుగా ఉండేది. దాన్ని వంచన చేసి వేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం తాలూకాలో భూమిని మాత్రమే నాగార్జునసాగర్ తడుపుతుంది. అటులనే గుంటూరు జిల్లానే సస్యశ్యామలం చేస్తున్నది. తెలంగాణా ప్రాంతంలో ప్రవహించే ఉప నదులెన్ని ఉన్నా వాటన్నిటి ప్రయోజనం మాత్రం తెలంగాణాకు లభ్యం కాకపోవటం సాంకేతికమట. కేంద్రంలో శ్రీ కె.ఎల్.రావు ఉన్నాడు కదా? ఇలాంటి సాంకేతిక పరిజానం ఎవరికీ అందనంత ఉన్నతస్థాయిలో ఆయనలో ఉన్నదనటానికి సంవత్సరాల కొద్ది ఆయన ఈ శాఖకు కేంద్ర మంత్రిగా ఉండటమే నిదర్శనం అనుకోవాల్సిందే?

రెండో ప్రణాళికలో ఖర్చయిన 552- 2 కోట్లలో ప్రణాళికా పధకాలకు 188.60 కోట్లు మాత్రమే వెచ్చించి మిగితా ప్రణాళికేతర పధకాలకు ఖర్చుచేశారు. మూడవ ప్రణాళికల్లో 1004-00 కోట్లు ప్రణాళికా పదకాల క్రింద. 352-41 కోట్లు ప్రణాళికేతర పథకాలకూ ఖర్చు  చేశారు. ఏ పధకం ప్రణాళిక పథకం, ఏదీకాదు అనేది నిర్దిష్టంగా కనిపించదు. పాలకుల ఇష్టం. బిసిజీ మలేరియా నిర్మూలనలు ఆంధ్రలో ప్లాను కింద. తెలంగాణాలో ప్రణాళికేతర పధం కింద చేపట్టబడ్డాయి. రెండో ప్రణాళిక మధ్యలో ఆంధ్రప్రదేశ్ అవతరించింది కనుక ఇది ఇట్లా జరిగి ఉండవచ్చుననుకుంటే మూడో ప్రణాళికా కాలంలో రోడ్ల సర్వె డివిజన్ మద్దు ప్రణాళికేతరంగా ఆంధ్రలోనూ. తెలంగాణాలో ప్రణాళికగాను చూపారు.

ఇలాగే ప్రభుత్వ భవనాలూ, అధికార్ల ఉద్యోగుల గృహాలు, గ్రామీణ గృహ నిర్మాణం స్థానిక సంస్థలకు ఋణాలు వగైరా కూడా. ఇందువల్ల తేడా ఏమిటంటె ప్లాను క్రింద అన్నప్పుడు రాష్ట్రం ఎంత డబ్బు ఇస్తె కేంద్రం కూడా అప్పుగానో, గ్రాంటుగానో సమాన మొత్తం ఇస్తుంది.. ఇక తేలిందేమిటి? తెలంగాణాలోని ప్లాను పధకాలన్నీ కేంద్ర బుణం గ్రాంటుల మీద ఆధారపడగా, ఆంధ్రవన్నీ ఖజానాలో డబ్బు వల్ల జరిగాయనే కదా? అంటే తెలంగాణాకు పెట్టామనే పప్పన్నం ఏ మాత్రం అయినా అప్పు కూడన్న మాట కాదా?ఒప్పందం ప్రకారం  సచివాలయం, శాసనసభలు, హైకోర్టు, వివిధశాఖల కార్యాలయాలు (రాజధానిలో ఉన్నవీ. తెలంగాణా ప్రాంతంలో ఉన్నవి) రాష్ట్రం అంతటికీ చెందినవే అయినా వ్యయం మూడో వంతు తెలంగాణా ఖాతాకు వ్రాయవలసిందిపోయి మొత్తం ఖర్చు రాసేశారు.

 తెలంగాణ ఉద్యోగులు అసమర్థులని అపనిందా?  

ఒప్పందం, రక్షణలు ఉల్లంఘించడంలో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలు మరీ ఘోరం. ముల్కీ రూల్స్ బుట్టదాఖల్ చేశారు. రిటైర్ అయ్యే వయఃపరిమితి తగ్గించారు. ఆంధ్ర విషయంలో ఉద్యోగుల విరమణ గడువు పొడిగింపు. వీలుకాని చోట్ల పెద్ద జీతాలతో కొత్త ఉద్యోగాలు ఇచ్చారు.. అనర్హులకు ఉద్యోగాలు. జూనియర్లకు ప్రమోషనులు (తెలంగాణా సీనియర్ల తలపైకి) చేశారు. తెలంగాణ ఉద్యోగులు అసమర్ధులు అనే అపనిందతో ఇంత పాక్షికత. ఈ విధంగా ఆంధ్ర తెలంగాణా ఉద్యోగుల మధ్య ఆధిక్యతా నిర్లక్ష్యతాభావం, ప్రాంతీయతత్వం, అసూయ ద్వేషాలు కలిగేట్లు చేయబడింది.

కామన్ గ్రేడెషన్ లీస్టు తయారు చేయమన్న 27-3- 57 నాటి భారత ప్రభుత్వ సర్క్యులర్కు విలువ ఇవ్వబడలేదు. ఈ సర్క్యులర్ లో ఎసార్సీ వివేదికలో సూచించిన సూత్రాలు ఆధారంగా ఆంధ్ర హైదాబాద్ ల ప్రధాన కార్యదర్శులు రూపొందించిన విస్తృత ప్రాతిపదికను ప్రస్తావించి 12 సంవత్సరాలు గడిచినా ఈ జాబితా పూర్తి కానేలేదు. డిప్యూటి కలెక్టర్లు, తహసీల్దార్లు, ఇంజనీరింగ్ ఎలక్ట్రిసిటీ విభాగాల్లో పని చేసేవారు. పిడబ్ల్యుడి. అటవిక శాఖ గెజిటెడ్ ఉద్యోగుల, ఎండోమెంటులో జీవో ఎన్.జి.వోలు పి.డబ్ల్యు డి. విద్యుత్ శాఖలలోని సూపర్వైజర్లు యుడీసీలు వగైరాలకు సంబంధించి జాబితా తయారు కావాలి ఇంకా. 1963లో కొన్ని  విభాగాలకు సంబంధించిన ఇటువంటి జాబితాను హైకోర్టు రద్దు చేసింది. ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టుకు సంబంధించి ఫిబ్రవరి 1968లో హైకోర్టు తీర్పును అమలు చేయలేదు.

అంతా దగుల్బాజీ– కౌటిల్యం కాక ఇంకేమిటి?

రాష్ట్రం అవతరించిన తర్వాత 38 మంది ఆంధ్ర నుండి 38 మంది తెలంగాణా నుండి సూపరింటెండింగ్ ఇంజనీర్లుగా ప్రమోట్ చేయబడ్డారు,  298 మంది ఆంధ్ర నుండి నలుగురైదుగురు తెలంగాణా నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ప్రమోట్ అయినారు. పబ్లిక్ వర్క్స్,  పబ్లిక్ హెల్త్ పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ వగైరా శాఖలలో క్రింద ఉద్యోగులేగాక, ఉన్నతోద్యోగులు కూడా ఇష్టం వచ్చిన రీతిన ప్రమోట్ అయ్యారు కె. వెంకటేశ్వరరావు అనే అతనిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా ప్రమోట్ చేయటం మీద దాఖలైన రిట్ విచారణలో హైకోర్టు తాజా తీర్పు ఆంధ్ర ప్రభుత్వ పెద్దల గతి, ముఖ్యమంత్రిగారి సంగతిని వెల్లడిస్తుంది. 1956 నవంబర్ 1 తరువాత సహకార శాఖలో డి.ఆర్.లను 396 మందిని ఆంధ్ర నుండి 19 తెలంగాణా నుండి, NGO లను GOగా ప్రమోట్ చేశారు. ప్రత్యేక తరగతి డిఆర్ లుగా ఆంధ్ర నుండి 32 ను తెలంగాణ నుండి 5 గురిని చేశారు. తెలంగాణలోని 70 డిఆర్ స్థానాలలో 69 ఆంధ్రులను నియమించారు.

ఇలాగే అనేకం ఈ శాఖలో, రిజిస్ట్రార్ ఆఫీసులో డి.ఆర్ లు 28 మందిలో 4 తెలంగాణా వారు సబ్ రిజిస్ట్రార్ల తరహాకు చెందిన మేనేజర్ 23 స్థానాలు ఆంధ్రులే. మొత్తంగా చూస్తే 136 డిఆర్ పోస్టులకు గాను 120 మంది ఆంధ్రులు. రాజధానిలోని రెండు విశ్వవిద్యాలయాలలో 80 శాతం ఆంధ్ర సిబ్బంది ఉన్నా, వెంకటేశ్వర, ఆంధ్ర యూనివర్సిటీల సిబ్బందిలో తెలంగాణా వాడెవడూ లేడు. ఉస్మానియా ఉపాధ్యక్షుడు డి. ఎన్. రెడ్డి. వచ్చిన తర్వాత కామర్స్- తెలుగు విభాగాలలో జరిగిన తంతు చూడవచ్చు. వ్యవసాయి విశ్వవిద్యాలయంలోని 90 శాతం అధ్యాపకులు సిబ్బంది. ఆంధ్రులే యూనివర్సీటీలు స్వయం సత్తాధికారం కలవి కనక ముల్కీ రూల్సు వర్తించవనుకోవాలి. అనుకుందాం కాని జరుగుతున్న సంఘటనల వెనక ఉన్నతత్వం ఎటువంటిది అనేదే ప్రధానంగా గ్రహించాలి. అంతా దగుల్బాజీ- కౌటిల్యం కాక ఇంకేమీ గోచరించదు, మరి ఇదెంత అన్యాయం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *