‘జరూర్ ఆనా’  స్నేహమా, ఆదేశమా, ప్రాధేయమా? 

 

‘ప్రజలకు రొట్టె ఇవ్వలేకపోతే, సర్కస్ ఇవ్వండి’ అనేది రోమన్ చక్రవర్తులు అనుసరించిన రాజనీతి అని చరిత్ర పుస్తకాలు చెపుతాయి. ఆరుగాలం కష్టం చేసే, మనుషులుగానే గుర్తింపు లేని బానిసలకు కనీసమైన తిండి కూడా ఇవ్వకపోయినా, వారికి వినోదం కల్పించి దృష్టి మళ్లించడానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. వినోదమంటే ఎంపిక చేసిన బానిసలను మల్లయోధులుగా మార్చి, వారిలో ఎవరో ఒకరు చనిపోయేదాకా వేదిక మీద రక్తాలు కారుకుంటూ కొట్టుకుంటుంటే చుట్టూ పోగైన బానిస యజమానులు ఆనందించే సంస్కృతి అది. తమ సోదరులు కొట్టుకు చస్తుంటే అదే వినోదం అనుకొమ్మని బానిసల మానసిక స్థితిని దిగజార్చిన సంస్కృతి అది.

     అన్ని పాలకవర్గాలకూ ఇంత పెద్దవో చిన్నవో దారి మళ్లింపు వ్యూహాలు అలవాటే గాని, సంక్షోభంలో ఉన్న సమాజంలో వాటి అవసరం మరింత పెరుగుతుంది, పాలకులు అంతకంతకూ ఎక్కువగా వాటి మీద ఆధారపడతారు. నిజానికి ఆధునిక భారత చరిత్రలో పాలకవర్గాలన్నీ ఈ కళలో నైపుణ్యం సంపాదించాయి. వలస పాలనా కాలం నాటి ఏ ఒక్క సమస్యనూ సంపూర్ణంగా పరిష్కరించ లేకపోయినా, ఈ ఏడున్నర దశాబ్దాలలో కొత్త సమస్యలెన్నో సృష్టించినా, ప్రజల దృష్టి మళ్లించే, దారి మళ్లించే చర్యలు, ప్రజలు తమ మధ్య తాము ఘర్షించుకుని అసలు ప్రత్యర్థులను మరిచిపోయేలా చేసిన చర్యలు ఎన్నో తయారు చేసిన ఘన చరిత్ర మన పాలకులది.

     ఈ సువిశాల, సుదీర్ఘ, అసంఖ్యాక దృష్టి మళ్లింపుల చరిత్రలో ఒకానొక అధ్యాయం అందం అనే భావనను వక్రీకరించి, దాని చుట్టూ కోట్లాది మేధలనూ, సమయాన్నీ, శక్తినీ, సంపదనూ దుర్వినియోగం చేసి, అసలు విషయాల నుంచి ప్రజలను దారి మళ్లించడానికి సంబంధించినది. దాన్ని అందాల పోటీ అంటారు. ఇంకా కావాలంటే విశ్వ సుందరి పోటీ అని కూడా అంటారు. ఇవి నడిపేది అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు. వాటిని ప్రోత్సహించేది స్థానిక పాలకులు. ఆ ఇద్దరికీ తమ సొంత రాజకీయార్థిక ప్రయోజనాలున్నాయి గాని, నిత్య జీవిత సమస్యలతో అల్లాడుతున్న ప్రజానీకానికి, ముఖ్యంగా మధ్య తరగతికి ఇది ఒక కుహనా ఆడంబరం, కుహనా వినోదం, కుహనా ఆటవిడుపు.

ప్రపంచ సుందరి అందాల పోటీలకు వేదిక అయినందుకు హైదరాబాద్ గర్వపడుతున్నదట. తెలంగాణ పొంగిపోయి, ఉబ్బి తబ్బిబ్బై ‘జరూర్ ఆనా’ అని పిలుస్తున్నదట. జరూర్ ఆనా అని స్నేహితులు ప్రియమారా మరొక కలయిక కోసం పిలుచుకుంటారు. ఈ అందాల పోటీల నిర్వాహకులకూ, ఆ పోటీలలో భాగస్వాములకూ తెలంగాణతో అటువంటి ఆత్మీయ స్నేహ బంధమేదీ లేదు. లేదా జరూర్ ఆనా అని యజమానులు సేవకులను ఆదేశిస్తుంటారు. ఆ బహుళ జాతి సంస్థలకుగాని, దేశదేశాల నుంచి వచ్చిన ఆ పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి తప్పుడు చైతన్యపు యువతులకు ఏదైనా ఆదేశం ఇవ్వగల స్థితిలో తెలంగాణ ఎట్లాగూ లేదు. అలా స్నేహమూ కాక, ఆదేశమూ కాక, మిగిలినది ఒక్కటే – ప్రాధేయ పడడం, దేబిరించడం. జరూర్ ఆనా అని తెలంగాణ ఆ సౌందర్య సాధనాల పరిశ్రమల బహుళ జాతి సంస్థల ముందర, “సుందరీమణుల” ముందర సాగిలపడుతున్నదన్నమాట!

      దేశంలో సరళీకరణ – ప్రైవేటీకరణ – ప్రపంచీకరణ పేరుతో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాక నాలుగు సంవత్సరాలకే 1996లో తొలిసారిగా బెంగళూరులో విశ్వసుందరి పోటీలు జరిగాయి. అంతకు ముందు కూడా దేశంలో ఇటువంటి అందాన్ని ప్రదర్శనకు పెట్టే తంతులు ఉన్నాయి గాని, భారత మార్కెట్ మీద బహుళ జాతి సంస్థల పట్టు బిగియడం మొదలైన తర్వాత స్త్రీ శారీరక సౌందర్యం అనేది వేల కోట్ల రూపాయల మార్కెట్ కు ముడిసరుకు అని, ఆ మార్కెట్ భారతదేశంలో పుష్కలంగా ఉన్నదని బహుళజాతి సంస్థలకు తెలిసి వచ్చింది. తర్వాత గడిచిన ముప్పై ఏళ్లలో ఆ మార్కెట్ విస్తరణా, దానికోసం అందాల పోటీలూ చెట్టాపట్టాలు వేసుకుని సాగుతున్నాయి. బెంగళూరు విశ్వసుందరి పోటీల తర్వాత ఇరవై తొమ్మిది సంవత్సరాలకు మళ్లీ ఇప్పుడు ఆ విశ్వసుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక అవుతున్నదని, తామే ఏదో గొప్ప విజయం సాధించామని రాష్ట్ర పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నారు.

      అసలు అందమంటే ఏమిటి? అది ఒక ప్రదర్శనా వస్తువా? అమ్మకపు సరుకా? ‘ఒక అందమైన వస్తువు ఎల్లకాలానికీ సంతోష హేతువు’ అని ఇంగ్లిష్ కవి అన్నా, ‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం’ అని తెలుగు కవి అన్నా, అందం గురించి రాయని కవులు లేరు. అందం గురించి ఆలోచించని మనుషులూ ఉండరు. కాకపోతే లైలా కో మజ్నూ కె ఆంఖోం సే దేఖో అన్నట్టుగా ఎవరి అందపు నిర్వచనం వారికి ఉండవచ్చు. ఒకరికి అందంగా కనిపించినది మరొకరికి అందంగా కనిపించకపోవచ్చు. ఒకరికే ఒక మానసిక స్థితిలో అందంగా కనిపించినది మరొక మానసిక స్థితిలో అందంగా కనిపించకపోవచ్చు. అందవికారంగా కూడా కనిపించవచ్చు. అందానికి ఒక సార్వత్రిక నిర్వచనం తయారు చేయడమే ఒక ఎత్తుగడ. అందమనేది భౌతిక, శారీరక ఆకృతిలో, రూపంలో, అవయవాల పొందికలో, వస్తుగతంగా లోపల ఉండేది అనేదే ఎంత సరైన నిర్వచనమో తెలియదు. అది చూసేవారి కనులకు మాత్రమే కనిపించే మానసిక సౌందర్యం కావచ్చుననీ, రూపంలో అందంగా కనిపించినవారు, వారి అభిప్రాయాలలో, భావాలలో, ఆచరణలో భయానక అందవికారంతో ఉండగలరనీ కూడా ఎందరో సాహిత్య కారులు ఎన్నెన్నో రచనలు చేశారు.

     అందం అనే భావనే ఇంతగా వివాదాస్పదమైనదీ, సంక్లిష్టమైనదీ అయినప్పుడు, దాన్ని అందరూ అంగీకరించే ఒక విలువగా ఎట్లా మార్చగలిగారు, దాన్ని ప్రదర్శనకు పెట్టే వస్తువుగా, ఏది ఎక్కువ అందమైనదో పోటీ పెట్టి తులనాత్మక పరిశీలన చేసే అవకాశం ఎట్లా సాధించారు, ఎవరు సాధించారు అనే ప్రశ్నలు సహజంగా రావచ్చు. సమాజంలో ప్రతిదాన్నీ అమ్మడానికీ, కొనడానికీ వీలైన సరుకుగా మార్చిన పెట్టుబడిదారీ సంస్కృతి, సరుకుల సంస్కృతి ఈ అందాల ప్రదర్శనకు మూల కారణం అని చెప్పవచ్చు. నిజానికి స్త్రీని భోగవస్తువుగా మాత్రమే భావించే భూస్వామ్య విలువలకూ, కేవలం అమ్మకపు-కొనుగోలు సరుకుగా భావించే పెట్టుబడిదారీ విలువలకూ భారతదేశంలో లంకె కుదిరింది. పెట్టుబడిదారీ సంస్కృతి మహా వృక్షాన్ని భారత భూస్వామ్య ఆలోచనల కుండీలో అంటుకట్టగా పుట్టి పెరిగిన అర్ధ వలస, అర్ధ భూస్వామ్య మరుగుజ్జు మహావృక్షం పూసిన పూసిన గుంటపూలకూ, కాసిన కుక్కమూతి పిందెలకూ నిదర్శనం భారతదేశపు అందాల పోటీలు.

    అందానికి శరీర సౌష్టవాన్నే ఏకైక నిర్వచనంగా మార్చారు. అదీ కేవలం మూడు కొలతలను (రొమ్ములు 34 అంగుళాలు, నడుము 24 అంగుళాలు, పిరుదులు 35 అంగుళాలు) ప్రత్యేకంగా నిర్దేశించారు. ముఖ సౌందర్యానికి కూడా స్వర్ణ ప్రమాణం అనే పేరుతో కొలతలు నిర్ణయించారు. కనుబొమల మధ్య దూరం 1 అయితే కనుబొమల పొడవు 1.618 గా, పెదాల మధ్యకూ చుబుకం చివరికీ దూరం 1 అయితే, ముక్కు కొసకు, పెదాల మధ్యకు దూరం 1.618 గా ఉంటే అదే ముఖ సౌందర్యం అన్నారు. ఈ కొలతలను రక్షించుకోవడానికి, జీవితం పొడవునా, కనీసం యవ్వనం పొడవునా, ఏయే సౌందర్య పోషకాలు వాడాలో నిర్దేశించారు. ఒక్కొక్క అందం భావన ప్రజల మధ్యకు, స్త్రీల మధ్యకు వెళితే, వారి మెదళ్లలో నింపితే ఎన్నెన్ని వేల, లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం సాగుతుందో లెక్కలు కట్టారు. మొటిమలు రాకుండా చూసుకోవడం, జుట్టు రాలకుండా చూసుకోవడం, కొలతలకు తగినట్టుగా జుట్టు, కనుబొమలు, గోళ్లు కత్తిరించుకోవడం, క్లిప్పులు పెట్టుకోవడం, శరీరంలోని సహజమైన భాగాల్ని అనవసరమైనవిగా లెక్కించి శస్త్రచికిత్సలతో తొలగించుకోవడం, నడుం లావెక్కకుండా చూసుకోవడం, వ్యక్తిగత మేధా అభివృద్ధినీ, ఆత్మవిశ్వాసాన్నీ, వ్యక్తిత్వాన్నీ కూడా పక్కన పెట్టి అనుక్షణమూ శరీరపు కొలతల స్పృహలో మునిగి ఉండేలా స్త్రీలను మార్చడం ఆ స్త్రీల సౌందర్యం మీద శ్రద్ధతో కాదు, అందుకు అవసరమైన సరుకులుగా తాము ప్రచారం చేస్తున్న సరుకులకు మార్కెట్ కల్పించుకోవడానికి. ప్రతి స్త్రీ తనకూ, తన వ్యక్తిత్వానికీ, తన సమాజానికీ సంబంధం లేని ఒక రాజకీయార్థిక, భావజాల వ్యవస్థ నిర్వచించిన పరిధిలోనే తన శరీరాన్ని కుదించుకుని, మలచుకుని జీవించేలా చేయాలని ఈ వ్యూహపు అసలు ప్రయత్నం. ఇటువంటి అందం కోసం ప్రయత్నించడమే స్త్రీ సహజ లక్షణమని, ఆ ప్రయత్నం చేయకపోతే తనలో స్త్రీత్వం లేనట్టేనని ఒక మానసిక ప్రవృత్తిని సృష్టించి పోషించడం ఈ వ్యూహం సాధించదలచిన స్థితి. ఒక తెలుగు కవి అన్నట్టు ఇది సౌందర్యాత్మక హింస.

 దేశంలో సరళీకరణ – ప్రైవేటీకరణ – ప్రపంచీకరణ పేరుతో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాక నాలుగు సంవత్సరాలకే 1996లో తొలిసారిగా బెంగళూరులో విశ్వసుందరి పోటీలు జరిగాయి. అంతకు ముందు కూడా దేశంలో ఇటువంటి అందాన్ని ప్రదర్శనకు పెట్టే తంతులు ఉన్నాయి గాని, భారత మార్కెట్ మీద బహుళ జాతి సంస్థల పట్టు బిగియడం మొదలైన తర్వాత స్త్రీ శారీరక సౌందర్యం అనేది వేల కోట్ల రూపాయల మార్కెట్ కు ముడిసరుకు అని, ఆ మార్కెట్ భారతదేశంలో పుష్కలంగా ఉన్నదని బహుళజాతి సంస్థలకు తెలిసి వచ్చింది. తర్వాత గడిచిన ముప్పై ఏళ్లలో ఆ మార్కెట్ విస్తరణా, దానికోసం అందాల పోటీలూ చెట్టాపట్టాలు వేసుకుని సాగుతున్నాయి. బెంగళూరు విశ్వసుందరి పోటీల తర్వాత ఇరవై తొమ్మిది సంవత్సరాలకు మళ్లీ ఇప్పుడు ఆ విశ్వసుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక అవుతున్నదని, తామే ఏదో గొప్ప విజయం సాధించామని రాష్ట్ర పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నారు.

      అందానికి ఇచ్చిన ఈ నిర్వచనం మీద ఆధారపడి భారీ మార్కెట్ ఉంది. 2024 లెక్కల ప్రకారం అంతర్జాతీయంగా ఈ మార్కెట్ 336 బిలియన్ డాలర్లు (29 లక్షల కోట్ల రూపాయలు). భారతదేశంలో ఇది 8 బిలియన్ డాలర్లు (68 వేల కోట్ల రూపాయలు) గా అతి తక్కువగా ఉన్నదని, ఉండవలసినంత లేదని బహుళ జాతి సంస్థల అంచనా. ప్రపంచ మహిళా జనాభాలో భారత మహిళలు 17 శాతంగా ఉన్నప్పటికీ, ప్రపంచ సౌందర్య సాధనాల మార్కెట్లో మాత్రం భారత్ 2.3 శాతం మాత్రమే ఆకర్షిస్తున్నదనీ, అందువల్ల ఇక్కడ మార్కెట్ ఇంకా ఎన్నో రెట్లు పెంచుకోవడానికి అవకాశం ఉన్నదనీ సౌందర్య సాధనాల బహుళ జాతి సంస్థలు లెక్కలు వేస్తున్నాయి. తమ మార్కెట్ ను పెంచుకోవాలంటే, తమ సరుకులను మరింత ఎక్కువగా అమ్మి, లాభాలను మరింత ఎక్కువగా రాబట్టుకోవాలంటే భారతీయ మహిళల మెదళ్లలో, మొత్తంగా భారత సమాజం మెదళ్లలో సౌందర్య భావనలను మార్చాలి. సౌందర్యం అనేది ఈ సాధనాల  ద్వారా మాత్రమే వస్తుందని నమ్మించాలి. సౌందర్యాన్ని మానవ సహజ అంశంగా కాక, కృత్రిమ సాధనాల ద్వారా వచ్చే సరుకుగా నిర్వచించాలి. అందుకోసం అత్యంత సాధారణ మానవుల దగ్గరికి, కుటుంబాలలోకి, మహిళల దగ్గరికి ఈ అందం భావనలను తీసుకుపోవాలి. ఇదీ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ సంస్థల కోరిక. తమ దేశపు, తమ రాష్ట్రపు ప్రజలు నిత్య జీవిత సమస్యలను మరిచిపోయి ఏవో భ్రమల్లో, ఆకర్షణల్లో, సరుకుల ఆరాధనలో, తప్పుడు లక్ష్యాల కోసం పరుగులో మునిగిపోవాలని పాలకుల కోరిక. ఆ రెండు కోరికల కలయికే మన విశ్వసుందరి పోటీలు.

     ఇలా అందం అనే భావనే వక్రీకరణకు గురవుతున్నదని, దాన్ని కేవలం శరీరానికి కుదించి, స్త్రీ దేహాన్ని సరుకుగా మారుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తిన తర్వాత, శరీర కొలతల ప్రకారమే అందగత్తెలుగా ఎంపికైన వారిని కొన్ని చొప్పదంటు ప్రశ్నలు వేసి, జవాబులు రాబట్టి, తెలివిని కూడా, ఆత్మవిశ్వాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం అని ఒక కొత్త ఎత్తుగడను కూడా బహుళజాతి సంస్థలు ప్రారంభించాయి. కాని అది నిజమైన తెలివీ కాదు, ఆత్మవిశ్వాసమూ కాదు.

      ఇటువంటి పోటీల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తామనీ, ఆర్థికాభివృద్ధి సాధిస్తామనీ, పర్యాటక రంగం అభివృద్ధి జరుగుతుందనీ, హైదరాబాద్ పేరు ప్రపంచ పటంలో చేరుతుందనీ (ఇప్పుడు లేనట్టు!!) పాలకులు నమ్మబలుకుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పడానికి చరిత్ర పొడవునా ఎన్నో రుజువులున్నాయి. ప్రపంచీకరణ రాజకీయాలు మొదలైనప్పటి నుంచీ అటువంటి అబద్ధపు మాటలతో ప్రజలను మోసగించడానికి అన్ని ప్రభుత్వాలూ, అందరు ఏలికలూ ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాటిలో ఏ ఒక్కటీ నిజం కాలేదని గత మూడు దశాబ్దాల అనుభవాలే చూపుతున్నాయి. 

ఈ కొలతలను రక్షించుకోవడానికి, జీవితం పొడవునా, కనీసం యవ్వనం పొడవునా, ఏయే సౌందర్య పోషకాలు వాడాలో నిర్దేశించారు. ఒక్కొక్క అందం భావన ప్రజల మధ్యకు, స్త్రీల మధ్యకు వెళితే, వారి మెదళ్లలో నింపితే ఎన్నెన్ని వేల, లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం సాగుతుందో లెక్కలు కట్టారు. మొటిమలు రాకుండా చూసుకోవడం, జుట్టు రాలకుండా చూసుకోవడం, కొలతలకు తగినట్టుగా జుట్టు, కనుబొమలు, గోళ్లు కత్తిరించుకోవడం, క్లిప్పులు పెట్టుకోవడం, శరీరంలోని సహజమైన భాగాల్ని అనవసరమైనవిగా లెక్కించి శస్త్రచికిత్సలతో తొలగించుకోవడం,  నడుం లావెక్కకుండా చూసుకోవడం, వ్యక్తిగత మేధా అభివృద్ధినీ, ఆత్మవిశ్వాసాన్నీ, వ్యక్తిత్వాన్నీ కూడా పక్కన పెట్టి అనుక్షణమూ శరీరపు కొలతల స్పృహలో మునిగి ఉండేలా స్త్రీలను మార్చడం ఆ స్త్రీల సౌందర్యం మీద శ్రద్ధతో కాదు, అందుకు అవసరమైన సరుకులుగా తాము ప్రచారం చేస్తున్న సరుకులకు మార్కెట్ కల్పించుకోవడానికి.

     ప్రపంచ సుందరి అందాల పోటీలకు వేదిక అయినందుకు హైదరాబాద్ గర్వపడుతున్నదట. తెలంగాణ పొంగిపోయి, ఉబ్బి తబ్బిబ్బై ‘జరూర్ ఆనా’ అని పిలుస్తున్నదట. జరూర్ ఆనా అని స్నేహితులు ప్రియమారా మరొక కలయిక కోసం పిలుచుకుంటారు. ఈ అందాల పోటీల నిర్వాహకులకూ, ఆ పోటీలలో భాగస్వాములకూ తెలంగాణతో అటువంటి ఆత్మీయ స్నేహ బంధమేదీ లేదు. లేదా జరూర్ ఆనా అని యజమానులు సేవకులను ఆదేశిస్తుంటారు. ఆ బహుళ జాతి సంస్థలకుగాని, దేశదేశాల నుంచి వచ్చిన ఆ పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి తప్పుడు చైతన్యపు యువతులకు ఏదైనా ఆదేశం ఇవ్వగల స్థితిలో తెలంగాణ ఎట్లాగూ లేదు. అలా స్నేహమూ కాక, ఆదేశమూ కాక, మిగిలినది ఒక్కటే – ప్రాధేయ పడడం, దేబిరించడం. జరూర్ ఆనా అని తెలంగాణ ఆ సౌందర్య సాధనాల పరిశ్రమల బహుళ జాతి సంస్థల ముందర, “సుందరీమణుల” ముందర సాగిలపడుతున్నదన్నమాట!

      ఢిల్లీ సుల్తానుల నుంచి ఆంధ్ర ఆధిపత్యవాదులదాకా, తెలంగాణ ఆధిపత్యవాదుల దాకా ఎందరెందరినో తిప్పి కొట్టిన, ధిక్కరించిన, ఎవరి ముందూ తలవంచని మహత్తరమైన తెలంగాణ సమాజాన్ని ఇలా ప్రాధేయపడే, సాగిలపడే స్థాయికి దిగజార్చారన్నమాట!  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *