ఐపీఎల్ లో విజేతలెవరు పరాజితులెవరు ?

బెంగళూరు జట్టు  ఐపీఎల్  విజేత అయినందుకు   కర్ణాటకలో   సెలవు ప్రకటించిన ప్రభుత్వం  సాయంత్రానికి  వారిని  ఘనంగా సత్కరించింది. క్రీడాకారుల కోసం  ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన ఓపెన్  టాప్  మల్టీ ఆక్సిల్ బస్సు లో  హెచ్ఏయల్ నుంచి  విధానసభ వరకు  ఉరేగించింది.  విధానసభ దగ్గర  సన్మానం జరుగుతున్న  సమయంలో  చిన్నస్వామి స్టేడియం వద్ద  తొక్కిసలాటలో  పదుకొండు మంది చనిపోయారు  వందలాది  మంది  గాయపడ్డారు.  అక్కడ  గెలిచింది  ప్రపంచ కప్పు  కాదు,  కనీసం  ఒక దేశం పై  గెలిచిన  సిరీస్ కాదు.  నానాజాతి సమితి లాగా  ఒక జట్టు  మరొక  జట్టు మీద  గెలిచింది.  జట్టు  స్పాన్సరర్ల  కర్ణాటక వారు కాదు, అందులో  ఆటగాళ్లు  కర్ణాటక  వారు  కాదు.  నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో,  ఆర్సీబీ జట్టులో  కర్ణాటక చెందిన వారు అంతే ఉన్నారు.   జట్టులో  కెప్టెన్ మొదలుకొని  ఉన్నవారందరూ  ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల ఆటగాళ్లే.  ఆర్సీబీ  గెలిచింది   పంజాబ్ కింగ్స్ మీద. పంజాబ్ కింగ్స్ లో కూడా  ఇలాంటి  నానాజాతి  సమితి.  ఒకప్పుడు  గతంలో  భారత జట్టు  పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్టుపై గెలిచింది అంటే దానికొక అర్థం ఉండేది.

ఉదయం నుంచి  బెంగళూరు విధుల్లో  ఆర్సీబీ జట్టు టీ షర్ట్ ధరించి  విచిత్రమైన  జెండా పట్టుకొని బండి  సైలెన్సర్ తీసి  ట్యాటోస్ ధరించి  విన్యాసాలు  చేసుకుంటూ  పది రూపాయల పాప్ కార్న్ రెండువందలు, పది రూపాయల టీ  వంద రూపాయలు పెట్టి కొని దారిన వచ్చి పోయే వారికి ఇబ్బంది కలుగజేస్తూ నిత్యం  ట్రాఫిక్ జాం కల్గించే వారిది అభిమానమా లేక  దేశ భక్తా?     ఎందుకింత  అత్యుత్సాహం,   పాకిస్తాన్ లో శత్రు స్థావరాలను నేలమట్టం చేసిన  సోఫియా ఖురేషి, వ్యోమిక సింగ్ కు  ఇంతటి ఆదరణ లేదు. వారిని ట్రోలింగ్ చేయడం  దూషించడం, లేదా  దూషించిన  మౌనంగా ఉండటం  వీరి దేశభక్తి.     ఐపీఎల్   అనేది భారతదేశంలో ఒక ప్రొఫెషనల్ ట్వంటీ 20 క్రికెట్ లీగ్. ఇది 2008లో బిసిసిఐ  స్థాపించబడింది.

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన  లాభదాయకమైన క్రికెట్ లీగ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.  ప్రతి సంవత్సరం  ఉష్ణోగ్రత నలభై  దాటినప్పుడు, విద్యార్థులకు  టర్మ్ ఎండ్ పరీక్షలు  ఉన్నప్పుడు, నీట్, ఎంసెట్, తదితర పోటీ పరీక్షలు ఉన్నప్పుడు   టోర్నమెంట్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చి నుంచి జూన్  వరకు జరుగుతుంది.  ఐపీఎల్   యొక్క ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేదిక అందించడం,  భారతదేశంలో  ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడను ప్రోత్సహించడం. విద్యార్థుల ఏకాగ్రతకు  భంగం కలిగేట్లు షెడ్యూల్ ఉంది. అలాగే ప్రతికూల వాతావరణంలో పోటీలు  పెడుతున్నారు.   నిరంతర విమర్శలు ఉన్నప్పటికీ, ఇది గరిష్ట సంఖ్యలో వీక్షకులను సంపాదించుకో కలిగింది.  భారతదేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ అనేది గుర్రపు పందెం లాంటిది, బెట్టింగ్  చాలా వరకు చట్టవిరుద్ధం.  క్రీడలు బెట్టింగ్ అనేది  రాష్ట్రాల చట్టాలపై ఆధారపడి ఉంటుంది.

అక్కడ  గెలిచింది  ప్రపంచ కప్పు  కాదు,  కనీసం  ఒక దేశం పై  గెలిచిన  సిరీస్ కాదు.  నానాజాతి సమితి లాగా  ఒక జట్టు  మరొక  జట్టు మీద  గెలిచింది.  జట్టు  స్పాన్సరర్ల  కర్ణాటక వారు కాదు, అందులో  ఆటగాళ్లు  కర్ణాటక  వారు  కాదు.  నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో,  ఆర్సీబీ జట్టులో  కర్ణాటక చెందిన వారు అంతే ఉన్నారు.   జట్టులో  కెప్టెన్ మొదలుకొని  ఉన్నవారందరూ  ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల ఆటగాళ్లే.  ఆర్సీబీ  గెలిచింది   పంజాబ్ కింగ్స్ మీద. పంజాబ్ కింగ్స్ లో కూడా  ఇలాంటి  నానాజాతి  సమితి.  ఒకప్పుడు  గతంలో  భారత జట్టు  పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్టుపై గెలిచింది అంటే దానికొక అర్థం ఉండేది.

భారతదేశం క్రికెట్‌తో మరే ఇతర దేశంతో పోల్చలేని ప్రేమను కలిగి ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై బెట్టింగ్ అన్నింటినీ మించిపోయింది. ఐపీఎల్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట . చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ చర్చించుకుంటున్న ఆట క్రికెట్. క్రికెట్ పిచ్చి ఉన్న ఆటగాళ్లు, ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో టీవీలకే అతుక్కుపోతున్నారు. మరోవైపు పందెం రాయుళ్లు సందట్లో సడేమియా అనే చందంగా ఒకవైపు క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే మరోవైపు తమదైన శైలిలో బెట్టింగ్ కాస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ బెట్టింగ్‌లో కోట్లాది  రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది  యువకులు  ఈ బెట్టింగ్ బారినపడి నష్టపోయి ఆర్థికంగా చితికిపోయి చివరికి  ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇరవై శాతం  కాలేజీ  పిల్లలు, యువత   బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ పాల్పడుతున్నారు.

గత పది పదిహేనేళ్ల క్రితం మొదలైన ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం, మొదట్లో కేవలం ఇండియా టీమ్ ఆడే మ్యాచ్ లకు మాత్రమే ఉండేది. రాను రాను ఇది మరింత ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా టి-20 మ్యాచ్ లు ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్ జాఢ్యం ఊపందుకుంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఐపిఎల్ యువతను మరింత కట్టి పడేసింది.  ఒకే సీజన్ లో వరసగా సుమారు 80 కి పైగా మ్యాచ్ లు జరుగుతుండటంతో బెట్టింగ్ ల జోరుకు అడ్డుకట్ట అనేది లేకుండా పోయింది.  బెట్టింగ్ లకు బానిసలుగా మారిన చాలా మంది అమాయకులు ఆర్థికంగా నష్టపోవడం కాకుండా,  తమ కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌ మనీతో క్రికెట్‌లో గెలుపోటములపై వారు పందాలు కాస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో యువతకు అధునాతన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉండడంతో గుట్టచప్పుడు కాకుండా యువత ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్నారు.

క్రికెట్‌ బుకీలను పరిచయం చేసుకుంటున్న యువత వారి ప్రోత్సాహంతో బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. డబ్బు దొరకనప్పుడు  దొంగతనాలకు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.  క్రికెట్‌ బెట్టింగ్‌లో భాగంగా పందేలు కాసేవారు బుకీల వద్ద కోడ్‌ భాష వినియోగిస్తూ అనుమానం రాకుండా కొనసాగిస్తున్నారు. బుకీల దగ్గర రిజిస్టర్‌ అయిన నెంబర్‌ నుంచి ఫోన్‌ రాగానే స్పందిస్తున్న యువత బెట్టింగుకు మొగ్గు చూపుతున్నారు. బెట్టింగ్‌ రాయుళ్లు వాడే భాషలో ‘లెగ్‌ ’అనే పదం కీలకమైంది. ఎన్ని లెగ్గులు తీసుకుంటే లెక్క ప్రకారం అంత మొత్తం చెల్లించాలనేది దాని అంతరార్థం. అలాగే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుపై పందెం కాసేందుకు ‘ప్లేయింగ్‌ ’ అని, తక్కువ అవకాశాలున్న జట్టుపై పందెం కాసేందుకు ‘ఈటింగ్‌ ’ అనే పదాలను ఉపయోగిస్తారని సమాచారం. మ్యాచ్‌ జరిగే రోజున అప్పటికప్పుడే ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరుపుతూ యువత బెట్టింగ్ లో పాల్గొంటున్నారు.

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయినా కొంతమంది మాత్రం బెట్టింగ్లనే వృత్తిగా సాగిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకోవాల. దేశంలో పందెం వేయడానికి ఇతర ప్రసిద్ధ క్రీడలు బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్  ఫుట్‌బాల్ వంటి అంతర్జాతీయ క్రీడలు. ఫలితం  అనిశ్చితి క్రీడ యొక్క ఆకర్షణలో ముఖ్యమైన భాగం. ఫలితం ముందుగా నిర్ణయించబడితే, క్రీడల సమగ్రత పోతుంది,  దానితో ఎక్కువ భాగం అర్థం అభిమానులను ఆకర్షిస్తుంది.  మ్యాచ్ ఫిక్సింగ్ అనేది క్రీడకు పెద్ద ముప్పుగా ఉంది.   ఆన్‌లైన్ జూదం యొక్క ఆగమనం ఆర్థిక లాభం కోసం మ్యాచ్ ఫిక్సింగ్ ప్రమాదాన్ని పెంచింది. ప్రపంచ జూదం పరిశ్రమ  భారీ స్థాయి వ్యవస్థీకృత నేరాలకు ఆకర్షణీయంగా ఉంది అలాగే  పందెం రకాల పరిధి పెరిగింది. లోపల తప్పుడు సమాచారం. అటువంటి జూదం  ఫిక్సింగ్ కారణంగా అవినీతి కూడా పెరిగింది,  ఇది వృత్తిపరమైన క్రీడ  భవిష్యత్తుకు ప్రాథమిక ప్రపంచవ్యాప్త ముప్పు. స్పోర్ట్స్ బెట్టింగ్ చట్టం అనేది గందరగోళంగా  సంక్లిష్టమైన అంశం ఎందుకంటే ప్రతి దేశానికి స్పోర్ట్స్ బెట్టింగ్‌కు సంబంధించి దాని స్వంత చట్టాలు ఉన్నాయి.

ఈ చట్టంలో ఎక్కువ భాగం కచ్చితంగా ఏది చట్టబద్ధమైనది,  ఏదికాదో  స్పష్టం చేయడంలో విఫలమైంది. గుర్రపు పందాలపై బెట్టింగ్‌లు మినహా భారతదేశంలో క్రీడలు బెట్టింగ్‌లు ప్రధానంగా చట్టవిరుద్ధం. ఇతర క్రీడలు వ్యక్తిగత రాష్ట్రాల చట్టాలు లేదా భారతదేశం సాధారణ చట్టాల పై ఆధారపడి ఉంటాయి. భారతదేశంలో ఎక్కువ భాగం పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867,  టెక్నాలజీ యాక్ట్ 2000 కి లోబడి ఉంది. ఆ చట్టాల ప్రకారం స్పోర్ట్స్ బెట్టింగ్ అనుమతించబడదు కానీ ఒక్కో రాష్ట్రానికి వారి స్వంత చట్టాలు రూపొందించుకునే హక్కు ఉంటుంది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ (1867) ప్రకారం, భారతదేశంలో అన్ని రకాల జూదాలు చట్టవిరుద్ధం. ఇప్పుడు    బెట్టింగ్  అనేది సర్వాంతర్యామి గా మారింది.  ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా దేశంలో  క్రికెట్‌ బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇది చాలదన్నట్లు  పలు  నిషేధ బెట్టింగ్ యాప్స్ ను  ప్రమోట్ చేస్తూ అగ్రతారల ప్రచారం మరోవైపు.  జిల్లా కేంద్రాలతో పాటు మండల గ్రామీణ  ప్రాంతాల్లో అక్రమ దందా ఊపందుకుంది. ఐపీఎల్‌ బెట్టింగ్‌ ఇంతకు ముందు నగరాలకే పరిమితం కాగా ప్రస్తుతం పల్లెలకు కూడా పాకింది.  జిల్లా కేంద్రంలో  లాడ్జ్ లో అద్దెకు తీసుకుని  బెట్టింగ్ ఆడుతున్నారు. గూగుల్ టేక్ ద్వారా ఎక్కువగా డబ్బు మార్పిడి జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తే ప్రధాన విద్యా సంస్థలు, అసంఘటితంగా ఉన్న డ్రైవర్లు, కూలి పనులు చేసుకునేవారు, కార్మికులు డబ్బు సులభంగా సంపాదించాలని కోరిక బెట్టింగ్ బారిన పడుతున్నారు.
డా. యం. సురేష్ బాబు,
అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *