“తెలంగాణ ప్రగతికి ట్రిబుల్ షూటర్ రేవంత్ త్రిముఖ వ్యూహం క్యూర్,ప్యూర్,రేర్ అనే మూడు రకాల వ్యవస్థలను ,ప్రణాళికలను క్రోడికరించి విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి ,అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు తెలంగాణ రైజింగ్ -విజన్ 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రపంచ దేశాలు క్యూ కట్టే విధంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, హైదరాబాద్ లాంటి మహానగరంలో రెండు ఉప ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ మొత్తంగా తిష్ట వేసినా ఘోరంగా ఓటమి పాలైన సంగతి విదితమే.”
ఈ ఏడాది రాష్ట్ర రాజకీయం పురపోరుతో వేడెక్కింది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు,116 పురపాలక సంస్థలకు ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీతో బీజేపీ,బీఆర్ఎస్ పోటా,పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు రెండంకెల సంఖ్యను కూడా చేరుకుంటాయా? అనే మీమాంస లేకపోలేదు, ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అన్న సామెతగా గతంలో కాంగ్రెస్ సాధించిన స్థానంలోకి బీఆర్ఎస్, భాజపా పోతాయని, మజ్లిస్ ఒకటి ,రెండుతో సరిపెట్టుకుంటాయనే ప్రచారం ఊపందుకుంది. వందశాతం మేయర్ పీఠాలను, 90శాతానికి పైగా మున్సిపల్ ఛైర్పర్సన్ పీఠాలను దక్కించుకున్న బీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ను ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కుటుంబం కు ఎదురుగాలి వీచడం కేసీఆర్ తనయ నిప్పులో ఉప్పులాగా మారడం కాంగ్రెస్ సరికొత్త రికార్డు సృష్టించనుంది.
2015లో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకున్న గులాబీ పార్టీ 2020లో 56 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.గత ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో విజయం సాధించిన భాజపా అభ్యర్థులు ఈసారి ఏకంగా 48 డివిజన్లలో గెలుపొందారు.వోట్ల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకొంది. మజ్లిస్ గత బల్దియా ఎన్నికల తరహాలోనే ఈ మారు కూడా 44 స్థానాలను గెల్చుకొంది.కాంగ్రెస్ పార్టీ 2015, 2020లలో రెండు స్థానాలకు పరిమితమై వోట్ల శాతాన్ని పాతాళం లోకి కోల్పోయింది. కానీ రేవంత్ నాయకత్వంలో ఉప ఎన్నికల ఫలితాలతో తిరుగులేని పార్టీగా దూసుకుపోతున్నది. తెలంగాణ ఆవిర్భావం నుండి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ రెండు ఏళ్లుగా ప్రతికూల పరిస్థితులను మూట గట్టుకుంటుంది. ఒక వైపు ఎన్నికల్లో సమర్థంగా ఎదుర్కొంటూనే ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు.
తొమ్మిదిన్నర సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి ఆధిపత్యం కొనసాగినప్పటికీ లిక్కర దందాలో పీకలదాకా ఇరుక్కుపోయి ,కాళేశ్వరం పియర్స్ కుంగిపోవడం వల్ల అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో అధికారం చేజిక్కింది. రాష్ట్ర రాజకీయం 2023 నుండే మలుపు తిరిగింది. అయితే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ 2020 తరహాలో బస్తీమే సవాల్ అంటూ రంకెలేస్తుంది. నాడు అధికారంలో ఉన్నందుకు పార్టీకి పురపోరులో అండగా నిలిచిందనే విషయాన్నీ మర్చిపోయి, 2026 పురపోరులో గెలవాలనే తాపత్రయం అడుగడుగునా కన్పిస్తున్నది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎంతో శ్రమించాలి, ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయాలి, ప్రజల ఆదరణ చూరగొనాలి.
ఒకసారి విజయానికి ఏంటో కష్టపడాలి, అలాంటిది వరుసగా విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ , జూబ్లీ హిల్స్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. నాడు మహానగరంలో కోల్పోయిన పట్టు, వోట్ షేరింగ్ పెంచడంలో రేవంత్ అన్ని తానై కాలుకు బట్ట కట్టుకొని తిరిగి పూర్వ వైభవం తేవడంలో సఫలీకృతులైనారు. మహానగరంలో చతికలపడ్డ కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో విజయ బావుటా ఎగరవేయడమంటే సాధారణ విషయం కాదు, ఈ రెండేళ్ల పాలనలో సంచలన ఫలితాలను సాధించింది. ఇలాంటి ప్రతికూలతను అధిగమిస్తూ తమ పట్టు నిలబెట్టుకోవడం ట్రబుల్ షూటర్ రేవంత్ వల్లనే సాధ్యమైంది. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ అనూహ్యంగా ముందుకు వచ్చినా, రెండు శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి చతికిలపడింది. మున్సిపోల్స్ లో అన్ని తానై దూసుకుపోతున్న రేవంత్ పై రాష్ట్ర వ్యాప్తంగా బీజీపీ, బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది
కామారెడ్డి డిక్లరేషన్ 42శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఇచ్చిన హామీతో సంచలన ఫలితాలు సాధించింది. రేవంత్ దూకుడుకు ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు, గ్రేటర్ హైదరాబాద్ లో బోని కొట్టని కాంగ్రెస్ పార్టీకి వలసలు బాగా పెరిగాయి. 2015లో గెలిచి మేయర్ అయినా బొంతు రామ్మోహన్, 2020లో గెలిచిన మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీకి రాం రాం అనడం అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకత్వం చేజిక్కడంతో గతంతో పోలిస్తే బీసీ వాదం ఎత్తుకున్నందుకు కాంగ్రెస్ వోట్ల శాతం గణననీయంగా పెరిగింది.ఎన్నిక ఏదైనా గెలిచే విధంగా పార్టీ జోరు రెట్టింపయింది. నాడు రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి దుబ్బాకలో సంచలన విజయం సాధించిన కమలదళం… గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలను రాబట్టింది. బీసీ వాదాన్ని బొందపెట్టి అధ్యక్షున్ని మార్చి దింపుడు కళ్లెం ఆశతో కాకి లెక్కలు వేసుకుంటే కర్రుకాల్చి వాత పెట్టింది. 90 కోట్లు ఉన్న ఓబిసిలకు 2026-27 కేంద్ర బడ్జెట్ లో సామాజిక న్యాయం ,సాధికారిత పేరుతో 15,357 కోట్లు కేటాయించినా నిర్దిష్ట కేటాయింపులను స్పష్టంగా ప్రస్తావించలేదనే విమర్శ ఉంది. ఇక గుర్తులు లేని పంచాయతీ ఎన్నికల్లో వ్యక్తుల వ్యక్తిత్వం పై గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయి, అయితే సుమారు 30 శాతం గెలిచామని ఆ పార్టీ చంకలు గుద్దుకుంది. ఇక బీసీ రిజర్వేషన్లకు అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బుట్టేంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి మరోమారు తప్పుచేసింది, బీసీలకు మేమేం వ్యతిరేకమని చెప్పకనే చెప్పింది. రెండు ఏళ్లుగా గడ్డుకాలంగానే గడిచింది.
తెలంగాణ ప్రగతికి ట్రిబుల్ షూటర్ రేవంత్ త్రిముఖ వ్యూహం క్యూర్,ప్యూర్,రేర్ అనే మూడు రకాల వ్యవస్థలను ,ప్రణాళికలను క్రోడికరించి విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి ,అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు తెలంగాణ రైజింగ్ -విజన్ 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రపంచ దేశాలు క్యూ కట్టే విధంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, హైదరాబాద్ లాంటి మహానగరంలో రెండు ఉప ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ మొత్తంగా తిష్ట వేసినా ఘోరంగా ఓటమి పాలైన సంగతి విదితమే.అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దూసుకుపోతున్నది.
కాంగ్రెస్ కు కలసి వచ్చిన అంశం ఏమిటంటే పురపోరులో హైడ్రా, ఫ్రీ బస్ ,ఉచిత విద్యుత్, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు,నెల మొదటి తారీఖు జీతాలు, ఇందిరమ్మ ఇండ్లు, కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా ,వ్యాపారులుగా తీర్చిదిద్దెందుకు వడ్డీ లేని రుణాలు లాంటి అనేక అంశాలు అనుకూలంగా ఉండడం 80 శాతం కాంగ్రెస్ మున్సిపాలిటీలు, 90 శాతం కార్పొరేషన్లు గెలుచుకుంటాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా, కాంగ్రెస్ విజయబావుటా నల్లేరు మీద నడకేనని ప్రత్యర్థులు సైతం చెవులు కోరుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో పోయిన పరువు ,పంచాయతీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు కొంత ఊపిరి ఇవ్వడంతో గుర్తులు ఉన్న ‘పురపోరు’లో పరువు దక్కించుకోకపోతే గుర్తులు లేని బీఆర్ఎస్ పంచాయతీలు ఖాలీ అవుతాయనే భయంతో ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబరేటరీలో జరిగిన అగ్నిప్రమాదాన్ని కూడా లబ్ది కోసం వాడుకుంటున్నారనే విమర్శ సర్వత్రా వినబడుతుంది.





