కన్నతల్లికి కారం ముద్దలు.. పినతల్లికి పంచభక్ష్య పరమాన్నాలా.?

“సంక్రాంతి పండుగకు ఆంధ్రా సెటిలర్లు నూటికి 99 శాతం ఏపీకి వెళతారు. వారంతా తమ సొంత వాహనాల్లో, లేదా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సొంతుర్లకు వెళతారు. కార్లులో లగ్జరీ వాహనాల్లో వెళ్ళే వారు ఆర్థికంగా కొంత స్థిరపడిన వారే ఉంటారు. వారికి ఎందుకు టోల్ ఫ్రీ ఇవ్వాలి.?. ఆ భారాన్ని ప్రభుత్వం భరించి తెలంగాణా  ప్రజల పై ఎందుకు మోపాలి.?.నిజాంగా ప్రజల పై ప్రేమ ఉంటే ఆర్టీసీ బస్సులకు ఇవ్వండి. అప్పుడు ఆర్టీసీ బాగుపడుతుంది. ప్రజలపై భారం తగ్గుతుంది.. .?”
రాష్ట్రంలో రెండేళ్లుగా తెలంగాణ వ్యతిరేక.. ఆత్మ, అస్థిత్వం, ఆత్మ గౌరవాలకు పూర్తి భిన్నంగా పాలన నడుస్తోంది. ప్రజల అంచనాలకు, ఆశించిన పాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తెలంగాణ సీఎంగా ఉంటూ ఆంధ్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు… ఆంధ్ర వాయిస్‌ వినిపిస్తున్నారు.ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టుతున్నారు.
సీఎం అయ్యాక కూడా చంద్రబాబు కు దగ్గరగా ఉంటూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాలనలో రేవంత్  ప్రభుత్వం నిర్ణయాలు కూడా అలాగే ఉంటున్నాయి. నీళ్ళ నుంచి నిధులు, ఉద్యోగాలు వరకూ ఏపీ దోపిడీకి చంద్రబాబు అదేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నిర్ణయాలు తీసుకోవడమే కాదు, సచివాలయంలో, సీఎంవో, సలహాదారులుగా ప్రతి చోటా ప్రతి కీలక పదవి సమైక్యవాదులతో నింపేశారు.విగ్రహాల నుంచి తెలంగాణ అస్థిత్వ చిహ్నాల వరకూ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలే.దీంతో రేవంత్ తెలంగాణ వ్యతిరేకి అనే వాదన ప్రజల్లో బలంగా స్థిరపడిపోయింది.
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రయోజనాల కోసం, ఏపీ ప్రజల కోసం తెలంగాణ ప్రజల మనోభావాలను విరుద్ధంగా సంక్రాంతి పండుగకు వెళ్ళే వారికి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై ఉన్న టోల్ ఫ్రీ ఇవ్వాలి, ఆ నష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందంటూ ఏకంగా రాష్ట్ర మంత్రి కేంద్రానికి లేఖ రాశారు.సీఎం ఆదేశాలు లేకుండా సదరు మంత్రి అలాంటి చర్యలకు పాల్పడరు. పండుగ పూట హైవే మీద ట్రాఫిక్ జామ్ అవుతుందని అందుకే టోల్ ఫ్రీ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
సంక్రాంతి పండుగకు ప్రజలు అందులో ఏపీ హైవేపై ట్రాఫిక్ జామ్ అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎందుకు..?జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులుండవు. ట్రాఫిక్‌ జామ్ అయితే టోల్‌ కంపెనీకి ఇబ్బంది.జాతీయ రహదారులపై టోల్‌ నిర్వహణ చట్టం ప్రకారం ట్రాఫిక్‌ జామ్ అయితే ఫ్రీగా వదిలేయాలి. నష్టం సదరు కంపెనీ భరించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం.?.టోల్‌ నిర్వహణ కంపెనీలో కాంగ్రెస్‌ ఏం చీకటి ఒప్పందాలు జరిగాయి.?.ఒక వేళ ఆ కంపెనీకి వచ్చే నష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎందుకు భరించాలని చూస్తుంది.?.ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏపీతో లాలూచి పడింది.
ఒకవైపు రెండేళ్లుగా ఏపీ జల దోపిడీకి పాల్పడుతోంది. రేవంత్‌ను ముందుపెట్టి తెలంగాణ ప్రాజెక్ట్‌లను పండబెట్టి.ఏపీకి నీళ్లలను తోడుకుపోతుంది. కృష్ణా గోదావరి బేసిన్‌లో జల దోపిడీ విస్తృతంగా చేస్తుంది. నీళ్ళు ఖతం , నిధులు ఖతం , నియామకాల ఎప్పుడో ఖతం .ఇప్పుడు ఆర్థిక దోపిడీ. దిల్లీకి ముల్లేలు. ఏపీకీ నిధులు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఏపీ టీడీపి కాంగ్రెస్సా.?.తెలంగాణలో పెద్ద పండుగలైన దసరా, బతుకమ్మ, రాఖీ లకు టోల్ ఫ్రీ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడేందుకు సంక్రాంతికి టోల్ ఫ్రీ కుట్రలు చేస్తుంది.?.
తెలంగాణలోనే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ పండుగకు ప్రభుత్వం ఎందుకు టోల్ ఫ్రీ ఇవ్వరు.?. ఒకవైపు తెలంగాణ పండగలప్పుడు స్పెషల్ బస్సులు, టికెట్ రేట్లు పెంచి తెలంగాణ ప్రజల నడ్డి విరిచి ఇప్పుడు సంక్రాంతికి టోల్ ఫ్రీ అంటూ సొంత ప్రజలను దోచుకుంటూ పక్క రాష్ట్రానికి పంచడానికి కాంగ్రెస్‌కు సిగ్గుండాలి. ఇంతకంటే బానిస బతుకు బాహుబలి సినిమాలో కట్టప్ప కూడా బతకలేదు.
తెలంగాణ ప్రజల సొమ్మును  ఏపీ రోడ్లకు, వాళ్ళ రవాణా సౌకర్యాల కోసం టోల్ ఫ్రీ చేసి ఆ భారాన్ని తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో కట్టాలని చూడటం సిగ్గుచేటు. సొమ్ము తెలంగాణ ప్రజలది, బాధలు ఇక్కడి ప్రజలవి. సోకులు మాత్రం ఆంధ్రకా.?.తెలంగాణ ప్రజలకు టికెట్ల భారం పెంపు ఏపీ కోసం మినహాయింపులా..?. .ముందు తెలంగాణలో గ్రామీణ రాష్ట్ర రోడ్డులను బాగు చేయి. తెలంగాణ ప్రజల పై ఆర్టీసీ మోపుతున్న టోల్ భారం తగ్గించు. పండుగలకు ప్రత్యేక బస్సులు అదనపు వసూళ్ళు ఆపు. సమ్మక్క సారలమ్మ జాతరకు టోల్ ఫ్రీ ఇవ్వు.జాతర స్పెషల్ బస్సులు అంటూ దోపిడీ ఆపు. పురుషుల టికెట్లపై అదను భారం రద్దుచేయి. ఎలక్ట్రికల్ సబ్బుల్లో గ్రీన్ టాక్సీ రద్దు చేయి. ఇవన్నీ చేయకుండా సంక్రాంతికి టోల్ ఫ్రీ ఇచ్చి ఆ నష్టాన్ని ప్రభుత్వం కడుతుందని తెలంగాణ ప్రజలపై రుద్దాలను కోవడం తుగ్లక్ నిర్ణయం అవుతుంది.
తెలంగాణ పండుగలప్పుడు స్పెషల్ బస్సులు టికెట్ రేట్లు పెంపుతో తెలంగాణ ప్రజలపై భారం మోపడమే కాకుండా, ఏపీ కోసం అదనపు భారం మోపలనుకోవడం సిగ్గుమాలినతనం. నిజాంగా తెలంగాణ ప్రజలకు ఏపీ వెళ్ళే పేదలకు టికెట్ల భారం తగ్గించాలంటే. ముందు ఆర్టీసీ బస్సులకు టోల్ ఫ్రీ ఇవ్వండి. ఆర్టీసీ బస్సుల్లో అధిక టికెట్ రేట్లు తగ్గించండి. అంతేకానీ సంక్రాంతి కోసం వేళ్ళే ప్రైవేటు ట్రావెల్స్ కోసం, ప్రైవేటు వాహనాల కోసం టోల్ ఫ్రీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి.?.ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ కోసం తెలంగాణ ప్రజలి సొమ్ము ఎందుకు పప్పు బెల్లం లా వారికి దోచి పెట్టాలి.?.
సంక్రాంతి పండుగకు ఆంధ్రా సెటిలర్లు  నూటికి 99 శాతం  ఏపీకి వెళతారు .వారంతా తమ సొంత వాహనాల్లో, లేదా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సొంతుర్లకు వెళతారు. కార్లులో లగ్జరీ వాహనాల్లో వెళ్ళే వారు ఆర్థికంగా కొంత స్థిరపడిన వారే ఉంటారు. వారికి ఎందుకు టోల్ ఫ్రీ ఇవ్వాలి.?. ఆ భారాన్ని ప్రభుత్వం భరించి పేదలపై ఎందుకు మోపాలి.?.నిజాంగా పేదలపై ప్రేమ ఉంటే ఆర్టీసీ బస్సులకు ఇవ్వండి. అప్పుడు ఆర్టీసీ బాగుపడుతుంది. ప్రజలపై భారం తగ్గుతుంది.
 సంక్రాంతికి ఏపీకి వెళ్ళేది ఆర్టీసీ బస్సుల కంటే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులే 99 శాతం ఉంటాయి.ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు ఎందుకు టోల్ ఫ్రీ ఇచ్చి భారాన్ని తెలంగాణ ప్రజలపై రుద్ధాలి.ఎందుకు తెలంగాణ ఆ ఆర్థిక భారాన్ని మోయాలి.ప్రైవేటు ట్రావెల్స్ కు కాంగ్రెస్ ప్రభుత్వానికి జరిగిన లోపాయికారీ ఒప్పందం ఏంటి.?  ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీలో ప్రభుత్వం పాత్ర ఏంటీ.? ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం దాదాపు 90 శాతం ఏపీకి చెందిన వారు ఉంటారు. ఎందుకు వాళ్ళ కోసం తెలంగాణ భారం మోయాలి.?.సంక్రాంతికి ప్రైవేటు ట్రావెల్స్ ప్రభుత్వం ఏమైనా అదనపు పన్ను వసూలు చేస్తుందా.?.ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై స్పెషల్ పండుగా పన్ను లేయకుండా, స్పెషల్ గ్రీన్ టాక్స్, రోడ్ టాక్స్ వేయకుండా ఎందుకు టోల్ ఫ్రీ ఇవ్వాలి. ఆ నష్టాన్ని ప్రభుత్వం అంటే తెలంగాణ  ప్రజలు ఎందుకు భరించాలి. .?
పోనీ టోల్ ఫ్రీ ఇస్తే ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ కు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఏమైనా పెరుగుతుందా.?.పోనీ తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశాలు ఉన్నాయా.? కనీసం అలా వచ్చిన కూడా టూరిజం ఆదాయం పెరుగుతుంది. అలా కూడా కాదే. వెరసి సంక్రాంతి అంటే తెలంగాణ నుంచి ఏపీ కి టూరిస్టులు పెరుగుతారు.  .ప్రజలు తెలంగాణ నుంచి ఏపీకి వెళతారు . అప్పుడు ఏపీ రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.ఏపీలో కొనుగోలు శక్తి పెరుగుతుంది.. పండుగ వ్యాపారం పెరుగుతుంది. అన్నింటికీ మించి ఏపీ టూరిజం ఆదాయం పెరుగుతుంది. అలాంటప్పుడు తమ రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు టోల్ ఫ్రీ ఇస్తే గిస్తే ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి. ఏపీ టూరిజం ఆదాయం పెంచుకునేందుకు ప్రజలను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు టోల్ ఫ్రీ ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి ఆ భారాన్ని తెలంగాణ ప్రజలపై ఎందుకు మోపాలి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో టూరిజం పెంచేందుకు ఏపీ ఆదాయం పెంచుకునేందుకు పని చేస్తాందా.?. తెలంగాణ ప్రజలపై టోల్ బాదుడు తో ఆర్టీసీ బస్సుల్లో రకరకాల సర్ చార్జీల పేరుతో నడ్డి విరుస్తూ. ఏదో స్టాక్ మార్కెట్లో డిమాండ్ ను బట్టి రేట్లు పెంచినట్టు. పండుగలప్పుడు అప్ కు ఒక రేటు డౌన్ కు మరో రేటు అంటూ భారం మోపుతుంది.
ఇప్పుడేమో సంక్రాంతి కోసం టోల్ ఫ్రీ ఇస్తారట. మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు తెలంగాణ ముఖ్యమంత్రా.?.ఆంధ్రప్రదేశ్ సీఎమ్మా.?.ఇందిరమ్మ పాలన అంటే తెలంగాణ ప్రజలపై భారం మోపీ, ఆంధ్రప్రదేశ్ కు దోచిపెట్టడమా.?.తెలంగాణ ప్రజలపై ఎందుకంత కక్ష్య.? ఏపీ అంటే ఎందుకంత ప్రేమ..?తెలంగాణ ప్రయోజనాలకు విరుద్దంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు.?.మీకు  తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పండి. ఏం చేయాలో ప్రజలనే నిర్ణయించుకుంటారు..?
-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *