ఊహించిన ఫలితం ,,!

బీఆర్ఎస్‌ వోట్ షేర్‌ దాదాపుగా స్థిరంగా ఉంది.. కాంగ్రెస్‌ వోట్‌ షేర్‌ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సారీ ఫలితాలను గమనిస్తే బీజేపీ వోట్‌ షేర్‌ సగానికి పైగా కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగింది. ఎన్నికలు జూదం లాంటిది.. ప్రత్యార్థిని ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రులు అవుతారు..జూబ్లిహిల్స్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి శత్రువు.బీఆర్ఎస్‌ ..అందుకే ఉమ్మడి శత్రువును ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయన్నది స్పష్టం అవుతుంది.

ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. బై పోల్ నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు మొత్తం జూబ్లిహిల్స్‌పైనే ఫోకస్‌ పెట్టాయి. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేశాయి. బీఆర్ఎస్‌ సిట్టింగ్ స్థానం..కాంగ్రెస్‌కు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న అనుకూలతలు ఉప ఎన్నికకు ఎక్కువ హైప్‌ వచ్చింది.
అధికార విపక్షాల మధ్య ప్రచార వ్యూహాలు, రాజకీయ ఎత్తులు ఎలా ఉన్నా, పోల్‌మెనేజ్‌ మెంట్ ఎలా ఉన్నా ప్రజా తీర్పును అందరూ గౌరివించాల్సిందే..ప్రజాస్వామ్య వ్యవస్థలో వోటర్లే అంతిమ న్యాయ నిర్ణయేతలు..వోట్‌ చోరీలు..దొంగ వోట్లు ఇలా ఎన్ని విమర్శలు ఉన్న అవన్ని వ్యవస్థపరమైన వైఫల్యాలే..కానీ అంతిమంగా ఎన్నికల్లో గెలుపును ఎవ్వరూ కాదనలేని సత్యం..సహజంగా న్యాయం జరిగినట్లు కాదు..కనిపించాలనే న్యాయ సూత్రం ఉంటుంది. అదే విధంగా ఎన్నికల్లో గెలవడం కాదు..పోలింగ్ జరిగిన తీరు ఎలా ఉందన్ని కూడా ముఖ్యం.
అయితే గెలిచిన వాడి గురించి వ్యవస్థ పెద్దగా చెప్పుకుంటుంది.ఓడివానిడిని సమాజం పట్టించుకోదు..ఇక్కడ పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థలో గెలిచిన వాడే కింగ్..సహజంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో జూబ్లిహిల్స్‌ గెలుపు అనుకూలత..అదే సమయంలో రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా బూస్ట్‌ ఇచ్చే విజయం  కూడా..ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఈ ఓటమి ఒక గుణపాఠం..ఇంకా ప్రజలకు గులాబీ పార్టీ ఎక్కడో దూరంగా ఉన్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ..అయితే మరో మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న అభిప్రాయం కావచ్చు..బీఆర్ఎస్‌పై అభిమానం ఉన్నా ఉప ఎన్నికలో కారుకు పార్టీకి  వేస్తే అదనంగా  తమకు ప్రయాజనం ఉండదన్న ఆలోచనల కూడా కాంగ్రెస్‌ విజయానికి  కారణమైంది.
మరోవైపు జూబ్లీహిల్స్‌ ఫలితాలు బీఆర్ఎస్‌ను కుంగదీయ వచ్చు..క్యాడర్‌లో అసంతృప్తి పెరగవచ్చు..మానసికంగా కుంగదీయవచ్చు..అయితే గులాబీ ఓటమి ఆ పార్టీకి ఒక గుణపాఠమే కాదు..ఒక హెచ్చరిక కూడా..వాపును చూసి బలుపు అనుకోవడం కూడా కారు పార్టీ ఓటమికి కారణం కావచ్చు. అతివిశ్వాసం, హరీష్‌ రావు పది రోజులు ప్రచారానికి దూరం కావచడం కూడా ఓటమికి మరో కారణమని చెప్పవచ్చు.  అయితే జూబ్లిహిల్స్‌లో బీఆర్ఎస్‌ ఓడిపోయి కాంగ్రెస్‌ గెలిచిన..బీహార్‌లో ఎన్డీయే కూటమి గెలిచి మహాగఠ్ బంధన్‌ ఓడిపోయినా..ఎన్నికల కురుక్షేత్రంలో తెర వెనుక జరిగిన కుట్రలు, వ్యూహాలు గమనించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్‌లో ఎన్నిక ప్రక్రియ ప్రయాదంలో పడుతుంది. జూబ్లీహిల్స్‌లో అధికార కాంగ్రెస్‌ గెలిచిన తెర వెనుక ఒక చర్చ అయితే మొదలైంది. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్‌ మధ్య రహస్య మైత్రి బంధం తాజా ఫలితాలతో మరోసారి బయటపడింది.
బీఆర్ఎస్‌ వోట్ షేర్‌ దాదాపుగా స్థిరంగా ఉంది..కాంగ్రెస్‌ వోట్‌ షేర్‌ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సారీ ఫలితాలను గమనిస్తే బీజేపీ వోట్‌ షేర్‌ సగానికి పైగా కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగింది. ఎన్నికలు జూదం లాంటిది.. ప్రత్యార్థిని ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రులు అవుతారు..జూబ్లిహిల్స్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి శత్రువు.బీఆర్ఎస్‌ ..అందుకే  ఉమ్మడి శత్రువును ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయన్నది స్పష్టం అవుతుంది. రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి, బీజేపీ రహస్య సంబంధం ఫలితాలతో తేట తెల్లమైంది..బీఆర్ఎస్‌ను ఓడించేందుకు రేవంత్‌ రెడ్డి బండి సంజయ్‌ వంటి నేతలను వ్యూహాత్మకంగా రెచ్చగెట్టారు. కిషన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు..అటు మొదటి నుంచి రేవంత్‌ను నీడల కాపాడుతున్న టీబీజేపీ నేతలు పోలింగ్‌లో పూర్తిగా కాంగ్రెస్‌కు సహకరించారు. ముస్లీం-హిందు వోటర్ల పోలరైజేషన్‌ కోసం బండి సంజయ్‌ వంటి నేతలు రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్‌కు ట్రంప్‌ కార్డ్‌గా పని చేశారు.
 జూబ్లిహిల్స్‌లో టీ బీజేపీ రెండు వ్యూహాలతో కాంగ్రెస్‌ గెలుపులో పరోక్షంగా కీలక భాగస్వామ్యం అయ్యారు..మొదట బండి సంజయ్‌ హిందు ముస్లీం మధ్య మత రాజకీయాలు సృష్టించారు..దీంతో అప్పటి వరకూ బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న ముస్లీంలు వన్‌ సైడ్‌గా కాంగ్రెస్‌కు షిఫ్ట్ అయ్యారు..అందుకే బండి సంజయ్‌ ప్రచారంలోకి రావడానికి ముందు తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి.అది ఫలితాల్లో స్పష్టంగా కనిపిచింది. మరో విషయం ఒకవైపు ముస్లీం వోట్లు కాంగ్రెస్‌ వైపు పోలరైజ్‌ చేయడం ఒక ఎత్తైతే..బీజేపీ పార్టీకి సహజంగా ఉన్న వోట్ షేర్‌ను రేవంత్‌ తో ఉన్న చికటి బంధుత్వంతో కాంగ్రెస్‌కు బదలాయింపు చేసినట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్‌ వచ్చిన 20 వేల మేజార్టీ బీజేపీ వోట్‌ బ్యాంకే అన్నది కనిపిస్తుంది.
..జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్‌ వచ్చంది ఎవరూ అవునన్న కాదన్న అది బీజేపీ వోట్‌ షేరే..అయితే బీఆర్ఎస్‌కు ఎప్పటిలాగా స్థిరమైన వోట్ షేర్‌ సాధించింది. అయితే బీజేపీ వోట్ షేర్‌ కాంగ్రెస్‌కు బదలాయింపు కావడం..ఎంఐఎం వోట్‌ షేర్‌ డైరెక్ట్‌గా మళ్లడం అధికార కాంగ్రెస్‌కు తాత్కాలికంగా కాంగ్రెస్‌కు లాభం చేయవచ్చు..కానీ దీర్ఘకాలికంగా నష్టం చేస్తుంది.ఎలా అంటే ఇవాళా బీఆర్ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌,ఎంఐఎం రహస్యంగా బీజేపీ కలిసి పని చేశారు. అయితే రేపు భవిష్యత్‌ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం కలిసి రేవంత్‌తో నడుస్తారా అన్నది ప్రశ్నార్థకమే.
.తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీకి బీ టీంగా పని చేసిందని ఓపెన్‌ సీక్రేట్‌..హస్తానికి బీజేపీ చేయాందించి, రాష్ట్రంలో రాజకీయంగా సమాధి అయ్యింది. అయితే సాధారణ ఎన్నికలు వచ్చే సరికి ఎంఐఎం, బీజేపీలు కాంగ్రెస్‌తో నడుస్తాయా..?..నడవకపోతే కాంగ్రెస్ గెలిచే అవకాశాలుంటాయా..?.అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎంఐఎం, బీజేపీ,కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తేనే ఫలితాలు ఇలా ఉంటే..ఇంకా మూడేళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా ఎలా ఉండాలి..అప్పుడు రాజకీయ పరిణామాలు మారిపోతాయి..బైపోల్‌ లో మద్దతు ఇచ్చినంత ఈజీగా సాధారణ ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్‌తో నడుస్తుందా..?.బీజేపీ కాంగ్రెస్‌కు పరోక్షంగా సపోర్ట్ చేస్తుందా..?.అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టం.
జూబ్లీహిల్స్‌ ఓటమి ప్రతిపక్షానికి గుణపాఠం అయితే, గెలుపు అధికార కాంగ్రెస్‌కు ఒక హెచ్చరికలాంటింది. అదే సమయంలో ఎంఐఎం, బీజేపీ బలోపేతం అయ్యేందుకు అవకాశం..అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ గెలుపు వారి బాధ్యతను మరింత పెంచింది. ఒక రకంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది..జూబ్లిహిల్స్‌ గెలుపుతో కాంగ్రెస్‌ పొంగిపోతుకుండా..హమీలను అమలు చేసి చేయకపోతే నష్టం జరుగుతుంది..అదే సమయంలో ప్రతిపక్షం జూబ్లీహిల్స్‌లో అయినా, బీహార్‌లో ఓటమికి నష్టం ఎక్కడ జరిగిందో రివ్యూ చేసుకోవాలి..తప్పులను సరిదిద్దుకోవాలి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి..వోట్ల రాజకీయంలో పార్టీలు గెలుస్తాయి..వోటర్లు ఓడిపోతారున్న వ్యంగం ఉంది. ఏదీ ఏమైనా ఎన్నికల్లో గెలుపోటములు సహజం..ఫలితాలను బేరూజు వేసుకోవడం, స్పోర్టీవ్‌గా తీసుకోవడం పార్టీలకు అవసరం..అప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిలబడుతుంది.
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page