“హిందూ, క్రిస్టియన్, ముస్లిం తదితర మతాల వారికి ప్రభుత్వాలు వారి పండుగలకు సెలవులు మంజూరు చేస్తున్నాయి కానీ ఆదివాసులు స్వతంత్ర భారతదేశ చరిత్రలో తమ పండగలకు, వేల్పుల జాతరలకు సెలవులతో కూడిన ప్రాధాన్య ఇవన్ని సందర్భాన్ని చూస్తున్నాం అని ఆదివాసి సంఘాలు, గిరిజన ప్రజానీకం, యావత్ తెలంగాణ మాట్లాడుకుంటున్న ముఖ్య విషయం.”

సమ్మక్క తల్లి రక్త సంబంధికులు
సెల్ 9502038660.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం ప్రసిద్ధి చెందినది దక్షణ కుంభమేల గా పిలవబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆధిన తెగలు తమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా తమ పండగలను, వేల్పులను, జాతరలను నిర్వహించుకుంటున్న భారత దేశంలో గోదావరి లోయ పరివాహక ప్రాంతం కోయ వేల్పుల ప్రసిద్ధి చెందిన కేంద్రంగా తెలంగాణలో అదిలాబాదు నుండి మొదలుకొని నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రాలోనే పోలవరం సమీపంలో ప్రవేశించి.తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ద్వారా డెల్టాకు చేరుతుంది. ఈ ప్రాంతమంతా కూడా నాగపూర్ణిమకి ప్రకృతి గోదావరి లోయ ప్రతి సంవత్సరం కొత్త శోభను సంతరించుకుంటుంది. కోయల వేల్పులకు, కోయలకు అత్యంత ప్రీతికరమైనది మరియు వారి శ్వాసాలకు నిలువుటద్దమై ఈ మాసం నిలుస్తుంది.
ప్రతి సంవత్సరము గోదావరి లోయ తొలినాళ్ల నుండి కోయవేల్పుల కోలాహలానికి అనేక జాతరలు, వేల్పుల పండుగలకు కారణభూతమై నిలుస్తుంది కానీ ఒక సంవత్సరం అత్యంత భారీ ఉత్సవాలను వేల్పుల ఇంటి రుసుములను వసూలు చేసి చేస్తే మరుసటి ఏడాది నామమాత్రంగా ఆ వేల్పులకు మొక్కులు చెల్లించుకుంటారు ఇలా ప్రతి సంవత్సరం తమ ఆర్థిక స్థితిగతులను గొట్టు గోత్రాల వారీగా సమీక్షించుకుంటూ తమ సంస్కృతి సంప్రదాయాలు జరుపుకుంటూ,కాపాడుకుంటూ రక్షణ చేసుకుంటూ వస్తుంటారు. మైదాన ప్రాంతాల వారు మూడేళ్లకు ఒకసారి అనే భావన ఉంటుంది కానీ నిజానికి ప్రతి సంవత్సరం వేల్పులను జాతరలను నిర్వహిస్తుంది కోయ సమాజం. ఒక గొట్టు గోత్రాలకు సంబంధించిన జాతరలకు ఇతర కొట్టు గోత్రాల వారు తమ వేల్పులను తీసుకొని వెళ్లి జాతరను నిర్వహిస్తారు. ఈ విధంగా తమ ఉమ్మడి సంస్కృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాల వారికి తమ పరంపరను పకృతిలో సజీవంగా ఉంచుకుంటున్నారు.
భారతదేశంలో ఛత్తీస్ గఢ్ , ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల నుండి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి చాలా విరివిరిగా భక్తులు తరలివస్తుంటారు వచ్చి తమ మొక్కులను చెల్లించుకుని చల్లగా దీవించమని కోరుకొని మళ్ళీ జరగబోయే మేడారం జాతరకు వస్తూ ఈ తల్లులతో మేడారంతో ప్రత్యేక అనుబంధాన్ని పెనవేసుకొని కొనసాగిస్తుంటారు ఈ తల్లులను నమ్మిన భక్తులు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేడారం జాతరను నిర్వహిస్తున్న తీరు గత చరిత్రలో ఎన్నడు లేని విధంగా 200 కోట్లు ఖర్చుపెట్టి జాతర గద్దెలను, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ శాశ్వత పద్ధతిలో నిర్మాణం చేస్తున్నారు. ప్రపంచానికి తెలియని కోయల ఉనికిని, వారి మూలాలను ఈ జాతరలో పాలరాళ్లపైన చెక్కిన తీరు చాలా అద్భుతంగా ఉంది మౌఖిక పురాణానికి జీవం పోసే విధంగా శిల్పాలను ఆర్కిటెక్ రూపంలో దర్శనం ఇవ్వడానికి ఈ జాతరల సిద్ధంగా ఉంది. అక్కడ ఉన్న ప్రతి శిల్పానికి లోతైన విశ్లేషణ చేస్తే అద్భుతమైన జ్ఞానాన్ని ఇక్కడ మనం పొందే అవకాశం ఉంది.
ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ జాతర ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నది ఇది వారి జీవన విధానాన్ని మనుగడను అస్తిత్వాన్ని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కాదు కోల్పోవడానికి అవకాశం ఉన్న ఈ ప్రాంతంలోని ప్రజలు ఈ పండగలకు సెలవులు మంజూరు చేయకపోవడం అనేది తమను ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి అనే భావన కలిగిఉన్నారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం తదితర మతాల వారికి ప్రభుత్వాలు వారి పండుగలకు సెలవులు మంజూరు చేస్తున్నాయి కానీ ఆదివాసులు స్వతంత్ర భారతదేశ చరిత్రలో తమ పండగలకు, వేల్పుల జాతరలకు సెలవులతో కూడిన ప్రాధాన్య ఇవన్ని సందర్భాన్ని చూస్తున్నాం అని ఆదివాసి సంఘాలు, గిరిజన ప్రజానీకం, యావత్ తెలంగాణ మాట్లాడుకుంటున్న ముఖ్య విషయం.
ఈ మాఘ మాస దక్షిణ కుంభమేలా ఆదివాసులకే కాక యావత్ తెలంగాణ మొత్తం ఈ జాతరలో భాగస్వామ్యం అవుతున్న సందర్భంలో ఒకటి రెండు రోజులు సెలవులు అనేవి ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది. ఆర్టికల్ 244 (1) ప్రకారం 5త్ షెడ్యూల్ ప్రాంతంలో ట్రైబల్ సంస్కృతి సాంప్రదాయాలు, భాషా,పండగలు రక్షించడానికి ఈ షెడ్యూల్ ద్వారా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి ఈ నియమ నిబంధన దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి సంవత్సరం మాఘమాసంలో కోయాల విశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ మేడారం ఎండోమెంట్ వారి సహకారంతో ఒకటి లేదా రెండు రోజులు సెలవులను ప్రభుత్వాలు డిక్లేర్ చేయవలసిన అవసరం ఉంది పబ్లిక్ హాలిడేస్ గా లేదా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలోని పీసా యాక్ట్ 1996 ఆర్టికల్ 243 (4)(బి) క్రింద గ్రామ సభలకు ఆచారాలు సాంస్కృతిక గుర్తింపు రక్షించే అధికారం ఇస్తుంది దీని ద్వారా ప్రత్యేక తీర్మానం చేసి ఈ ప్రాంత పండుగలకు సెలవులను ఇవ్వవలసిన బాధ్యత పంచాయతీల మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు టిఏసి గవర్నర్ ట్రైబ్స్ అడ్వైజరి కౌన్సిల్ ద్వారా దక్షిణ కుంభమేలా సాంస్కృతి గీతిక మేడారంకు ప్రత్యేక సెలవు ఇప్పించే ప్రయత్నం చేయాలి అని ఆదివాసి సమాజం, ఆదోని సంఘాలు కోరుతున్నాయి మా సాంప్రదాయాలకు అనుగుణంగా సెలవులు మంజూరు చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలు తమ విశ్వాసాలను ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయని భావన తెలంగాణ ప్రజలలో ఉంటుంది.





