తల్లిదండ్రులు విలువలు నేర్పిరి
గురువులు జ్ఞానం నేర్పిరి
కాలం క్రమశిక్షణ నేర్పింది

ఊరు పాట నేర్పింది
నగరం మాట నేర్పింది
సమాజం సాహిత్యం నేర్పింది విలువలతో కూడిన సాహిత్యానికి
పద్మభూషణ్‌ ‌వరించింది

నీవు ఒక మేరు పర్వతం
మంది మార్బలం శిష్యగణం
లక్షలాది ప్రజల బలం
నీ పాటలు అజరామరం
నీ మాటలు నిత్య దరహాసం
నీ సాహిత్య సౌరభం జ్ఞానపీఠం

మట్టి మనిషి ఆకాశంలో
వెలిసిన సినారే
పాట ఉన్నంతకాలం
ప్రజల హృదయాలలో అమరం ….

ఏది పట్టిన
ఏది ముట్టినా
ఏ అడుగైనా
రాజసమే
అది బంగారమే
చివరికి మరణమైన.,.,

మరణం చివరి అంచులో కూడా
సాహిత్యాన్ని రాస్తూ
భువికెగిసిన సినారే…..

– డా. సుధాకర్‌ ‌భట్టు ,9441695938..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *