శ్రీబాగ్ ఒప్పందం మరచిపోవాలా ..?

“1953లో కర్నూలును రాజధానిగా, గుంటూరును హైకోర్టు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా, 1956లో తెలంగాణ విలీనంతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ కు మారాయి. ఈ పరిణామాలు రాయలసీమకు హామీలు కొనసాగుతాయా అన్న సందేహాలు మరింత పెంచాయి.ప్రస్తుత పరిస్థితి: అసంతృప్తి, వెనుకబాటుతనం విభజన (2014) తరువాత జిల్లా పునర్‌వ్యవస్థీకరణ, నీటి కేటాయింపులు, పరిశ్రమల స్థాపనలో రాయలసీమకు అంచనాలకు తగ్గ గుర్తింపు రాలేదన్న అభిప్రాయం బలపడింది. నీటి కొరత , ఎండబారిన వ్యవసాయం, అనంతపురం దేశంలోనే తీవ్రమైన కరువు ప్రభావిత జిల్లాల్లో ఒకటి. హంద్రీ–నీవా, గలేరు–నాగరి ప్రాజెక్టులు పూర్తిగా ఫలించాలని ప్రజలు ఇంకా ఎదురుచూస్తున్నారు.”

రాయలసీమ వాగ్దానాలు నెరవేరేది ఎలా ?
తీరాంధ్ర–రాయలసీమ ప్రాంతాల మధ్య సమన్వయంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన 1937 శ్రీబాగ్ ఒప్పందం మరోసారి రాజకీయ చర్చల కేంద్రంగా మారింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రాంతీయ సమానాభివృద్ధి, నీటి ప్రాధాన్యం, విద్యా-పరిపాలన వికేంద్రీకరణ వంటి హామీలు పూర్తిగా అమలు కాలేదన్న భావన రాయలసీమలో మళ్లీ బలపడుతోంది. చారిత్రక నేపథ్యంతో ఘనమైన పాత్ర పోషించిన ఒప్పందం, ఈ మధ్యకాలంలో మరుగున పడిపోతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కేంద్రం ఎక్కడ ఉండాలని విషయంపై తీరాంధ్ర–రాయలసీమ మధ్య విభేదాలు ఉద్భవించాయి. రాయలసీమ విద్యా వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయం తమ ప్రాంతంలో ఉండాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. అయితే విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం వాల్టేర్ (విశాఖపట్నం) కు మార్చడం, రాయలసీమ కళాశాలలను తిరిగి మద్రాస్ విశ్వవిద్యాలయం పరిధిలో ఉంచడం అక్కడ అసంతృప్తి పెంచింది.

ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రయోజనాలు కాపాడేందుకు రాయలసీమ మహాసభ (1934) వెలుగులోకి వచ్చింది. ఈ ఉద్రిక్తతల నడుమ 1937 నవంబర్ 16న చెన్నైలోని కాశీనాధుని నాగేశ్వర రావు నివాసంలో రెండు ప్రాంతాల నాయకుల సమావేశం జరిగింది. శ్రీబాగ్ ఒప్పందం పేరుతో ఆమోదించిన ప్రధాన అంశాలు, రాయలసీమలో ఉన్నత విద్యా కేంద్రాల ఏర్పాటు, తుంగభద్ర, కృష్ణ, పెన్నా నదుల నీటి వినియోగంలో రాయలసీమ అవసరాలకు మొదటి ప్రాధాన్యం, శాసనసభ స్థానాలలో జిల్లాల వారీగా సమాన హోదా, రాజధాని, విశ్వవిద్యాలయం, హైకోర్టు వంటి ప్రధాన కేంద్రాలను ప్రాంతాల మధ్య విభజనరాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తరువాత మార్పులు.

1953లో కర్నూలును రాజధానిగా, గుంటూరును హైకోర్టు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా, 1956లో తెలంగాణ విలీనంతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ కు మారాయి. ఈ పరిణామాలు రాయలసీమకు హామీలు కొనసాగుతాయా అన్న సందేహాలు మరింత పెంచాయి.ప్రస్తుత పరిస్థితి: అసంతృప్తి, వెనుకబాటుతనం విభజన (2014) తరువాత జిల్లా పునర్‌వ్యవస్థీకరణ, నీటి కేటాయింపులు, పరిశ్రమల స్థాపనలో రాయలసీమకు అంచనాలకు తగ్గ గుర్తింపు రాలేదన్న అభిప్రాయం బలపడింది. నీటి కొరత , ఎండబారిన వ్యవసాయం, అనంతపురం దేశంలోనే తీవ్రమైన కరువు ప్రభావిత జిల్లాల్లో ఒకటి.

హంద్రీ–నీవా, గలేరు–నాగరి ప్రాజెక్టులు పూర్తిగా ఫలించాలని ప్రజలు ఇంకా ఎదురుచూస్తున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల కలయికగల రాయలసీమలో దాదాపు 13 ఏళ్లుగా తీవ్ర కరువు, తాగునీటి కొరత, పరిశ్రమల లేమి, నిరుద్యోగం తీవ్రమైన సమస్యలుగా కొనసాగుతున్నాయి. కడప స్టీల్ ప్లాంట్ వాయిదా పడటం ప్రాంత అభివృద్ధిని నిలిపివేసాయి. ఉద్యోగాల లేమితో పెద్దఎత్తున యువత బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు వలస వెళ్తోంది. కొండచరియల గ్రామాలు జనాభా తగ్గుదలని చూస్తున్నాయి. బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ప్రకటించిన ₹24,350 కోట్లలో ₹1,050 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. కడప స్టీల్ ప్లాంట్‌ను వెంటనే ప్రారంభించాలి. రాయలసీమలో గ్రామీణ బ్యాంకు రాష్ట్ర కార్యాలయం, హైకోర్టు బెంచ్ పనులు త్వరిత గతిన ప్రారంభించాలి.

పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించిన 45 టీఎంసీల నీటిని రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించాలి. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ద్వారా నీటి పొందికకు కేంద్రం దగ్గర రాష్ట్రం బలంగా పట్టుబట్టాలి. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని కర్నూలు లేదా నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయాలి.ఒకప్పుడు రతనాలసీమ గా పేరుపొందిన ఈ నేల, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రాళ్ళసీమగా మారింది. పరిశ్రమలు , ఉపాధి కొరత తీవ్రంగా నిరాశపరచింది. కియా మోటార్స్, తప్ప పెద్ద పరిశ్రమలు ఒక్కటీ రాలేదు, ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. చిన్నపాటి పరిశ్రమలు ప్రభుత్వ ప్రోత్సాహం లేక మూతపడుతున్నాయి. మౌలిక వసతుల లోపం ఎక్కువగా కనిపిస్తుంది. శీతల గిడ్డంగులు ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఆశించినంత లేకపోవడం. రహదారులు, నీటి నిల్వలు, కోల్డ్ స్టోరేజ్, మార్కెట్ లింకులు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. రాయలసీమ వెనుకబాటుతనానికి చారిత్రక పెట్టుబడి లోపం, నీటి కొరత, పరిశ్రమ అభివృద్ధి మందగమనమే ప్రధాన కారణాలు. శ్రీబాగ్ ఒప్పందం ఆత్మ ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి అని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాంతం నిజంగా అభివృద్ధి చెందాలంటే నీటి నిర్వహణ, పారిశ్రామీకరణ, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలపై దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *