కడలి
మనలాగే, మనతోపాటు అందరికి బతికేహక్కు, భిన్నత్వం ఒప్పుకోగలుగుతున్నామా, మనందరం మనుషులమనే ఏకత్వాన్ని చాటగలుగుతున్నామా? క్వీర్ ఐడెంటిటీనీ వ్యతిరేకించే పరిస్థితులు ప్రస్తుతానివేనా, పాతవి కూడానా? మనిషిజాతి పరిణామంలో క్వీర్ ఇంటర్సెక్షనాలిటీ ఎప్పటినుండో ఉందని ఆధారాలు ఉండనే ఉన్నాయి.
మరి ఇంక్లూసివ్గా బతకడం ఎలా సాధ్యపడుతుంది? ఇవన్నీ ఎప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన జవాబులు. నేర్చుకోవాల్సిన కొత్త పద్ధతులు. సెన్సిటివ్ గా ఉండాల్సిన అత్యవసరం ఇప్పుడుంది. జెండర్, సెక్సువాలిటీ చుట్టూ ఉన్న స్టిగ్మాని ప్రశ్నించడమే క్వీర్ ఉనికికి మొదటి పుట్టుక. జీవితాన్ని యథార్థంగా రాయడమే ఈ చిన్నచూపుకి పెట్టే మొదటి చెక్.
అవతల మనిషిని మనిషిగా గుర్తించి అర్థంచేసుకోడానికి ప్రయత్నించడం మనిషినిమనిషిగానే నిలబెడుతుంది కానీ అదేం చేయకూడని పనికాదు, వాళ్లకథలు రాయడం చాలా గొప్ప ఆదర్శమూ అయిపోదు. చెయ్యాల్సిన పని. కచ్చితంగా చేస్తూ ఉండాల్సిన పని. అందరి జీవితాలు అంతే ముఖ్యమైనవని స్పృహ కలిపించే పని.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల