School Safety and Child Protection: పాఠశాల భద్రత–పిల్లల రక్షణ: ప్రభుత్వాల అత్యవసర కర్తవ్యం

“మన పాఠశాలల్లో ప్రతి బిడ్డ భద్రత, రక్షణ, మరియు గౌరవంతో ఎదగాలని కోరుకుంటున్నాం. ప్రతి రోజు పాఠశాలకు వచ్చే ప్రతి మొదటి భరోసా. పాఠశాల సిబ్బంది ప్రవర్తన, సహనం, మాట ఇవన్నీ పిల్లల అంతర్గత ప్రపంచాన్ని తీర్చి దిద్దుతాయి. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి: పిల్లలు ఒకే రకమైన సమూహం కాదు. వారి నేపథ్యాలు వేర్వేరు. సామాజిక-ఆర్థిక అసమానతలు, అస్తవ్యస్తమైన కుటుంబాలు, వలస కుటుంబాలు ఈ అన్నింటి నుంచి పిల్లలు పాఠశాలకు వస్తారు. వారి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. అందుకే మన స్పందన కూడా పిల్లల భిన్నతను గౌరవించేదిగా ఉండాలి.అలాగే మన పాఠశాల వ్యవస్థలు కూడా వివధ స్థాయిలలో ఉండడడం వివిధ వయసుల వారి పిల్లలు ఉండడం కూడా సిబ్బందికి ఒక పెద్ద సవాలే.”

పిల్లల భద్రత మరియు రక్షణ అనేది కేవలం పరిపాలనా విషయమే కాదు ఇది నైతిక బాధ్యత, చట్టబద్ధ కర్తవ్యము, మరియు పిల్లల హక్కు లకు సంబందించిన అంశం. అందుకు పాఠశాలలు అతి ముఖ్య ప్రదేశాలు. పాఠశాలలో పిల్లల బద్రత మరియు రక్షణ విషయాలను ప్రత్యేక చర్చ చేయవలసిన అవసరం ఉన్నది. ప్రతి బిడ్డ ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్, డేస్కూల్ పాఠశాలలోకి అడుగుపెడితే భద్రతగా, గౌరవించబదుతున్నట్లు, రక్షణ లో ఉన్నట్లు అనిపించాలి. భద్రత విఫలమైతే హాజరు, అభ్యాసం, నమ్మకం, గౌరవం అన్నీ విఫలమవుతాయి. ఇటీవలి కాలంలో పాఠశాలలో పిల్లల రక్షణ మరియు బద్రత వైఫల్యాలను ఎక్కువగానే వినిపిస్తున్నాయి.పర్యవసానంగా విద్యార్థులు బలన్మరణాల కు పాలుపడుతున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితులను ఎదురుకోవడానికి పాఠశాల సిబ్బందికి అటు తల్లిదండ్రులకు తగిన నైపుణ్యతలు లేవన్న విషయాలు కూడా బహిర్గతం అవుతున్నాయి. పై అధికారుల వత్తిడికి తట్టుకోలేక అనేక సార్లు బయటికి పొక్కనీయకుండా చూడడం లేదా వైఫల్యాలకు పిల్లల ప్రవర్తనల మీద తల్లిదండ్రుల మీద నెపం నెట్టివేయడం కూడా గమనిస్తున్నాము.

ఈ మద్య కాలంలో ఉపాధ్యాయుల సమావేశాలలో పిల్లలను దండించకుండా క్రమశిక్షణ రావడం లేదని, ఏమైనా అంటే తల్లిదండ్రులు నిరసనకు వస్తున్నారని, తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ద వహించడం లేదని, పిల్లల ప్రవర్తన మీద వేశ బాషల మీద చాలా సెటైర్లతో కూడిన ఒక చులకన భావంతో అక్క అక్కడ జరిగిన కొన్ని సంఘటనలను ఉదహారిస్తూ తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. లేదా ఒక టీచర్ ఈ విషయాలను పిల్లల పట్ల వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఆ టీచరకు మద్దతుగా చప్పట్లతో ఆమోదం వేయడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తమ పై నమ్మకం ఉంచి తమ బడులకు వస్తున్న పిల్లల గురించి వారి తల్లిదండ్రుల గురించి బహిరంగా ప్రదేశాలలో కించ పరిచినట్లు మాట్లాడడం అభ్యంతకరం.పిల్లల రక్షకులే ఈ విధమైన అభిప్రాయాలతో ఉండడడం బాధాకరం.

వేగంగా మారుతున్నా సమాజం లో ఈ తరం పిల్లలతో సంభాషించడం, అర్ధం చేసుకోవడం లేదా వాళ్ళ మనోభావాలను తెలుసుకునే నైపుణ్యతలు లేవని పెద్దలుగా ముఖ్యంగా ఉపాధ్యాయులుగా ముందుగా గుర్తించాలి. అలాగే తాము ఉపాధ్యాయ శిక్షణలో పిల్లల పట్ల చూపించాల్సిన అంశాలను కానీ పిల్లల రక్షణ కోసం పొందు పరిచిన రాజ్యాంగ హక్కుల గురుంచి పునశ్చరణం చేసుకోవాలి. అదనంగా నేటి జెన్ జి తరం గురుంచి అధ్యయనం చేయాలి. ప్రతి తరం ఒక తరానికి ఒక సవాలులు విసరుతుంటారు. వేశ భాషలలో కానీ ప్రవర్తనలో కానీ ఇది చాలా సహజం. యుక్త వయసు పిల్లలపై సినిమా నటుల ప్రభావం ఆటలలో ఆరితేరిన ఆట గాళ్ల వేశ ధారణలను అనుకరించడం పరి పాటి. ఈ కోణం లో ఈ పిల్లలను అర్ధం చేసుకోవాలి. దండించడం తో పిల్లల ప్రవర్తన మారుతుంది అని చెప్పే అధ్యయనాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. పైగా బాలలకు పెద్దల పట్ల అగౌరవ భావం కలుగుతుందని గుర్తించాలి.

మన పాఠశాలల్లో ప్రతి బిడ్డ భద్రత, రక్షణ, మరియు గౌరవంతో ఎదగాలని కోరుకుంటున్నాం. ప్రతి రోజు పాఠశాలకు వచ్చే ప్రతి మొదటి భరోసా. పాఠశాల సిబ్బంది ప్రవర్తన, సహనం, మాట ఇవన్నీ పిల్లల అంతర్గత ప్రపంచాన్ని తీర్చిదిద్దుతాయి. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి: పిల్లలు ఒకే రకమైన సమూహం కాదు. వారి నేపథ్యాలు వేర్వేరు. సామాజిక-ఆర్థిక అసమానతలు, అస్తవ్యస్తమైన కుటుంబాలు, వలస కుటుంబాలు ఈ అన్నింటి నుంచి పిల్లలు పాఠశాలకు వస్తారు. వారి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. అందుకే మన స్పందన కూడా పిల్లల భిన్నతను గౌరవించేదిగా ఉండాలి.అలాగే మన పాఠశాల వ్యవస్థలు కూడా వివధ స్థాయిలలో ఉండడడం వివిధ వయసుల వారి పిల్లలు ఉండడం కూడా సిబ్బందికి ఒక పెద్ద సవాలే.

ప్రభుత్వ పాఠశాలలో 5-14 సంవత్సరాల పిల్లలు రోజుకు 7గంటలు పాఠశాలలో ఉంటారు. పిల్లల్లో చాలా మంది అత్యధిక శాతం అణగారిన వర్గాలు,పేద వర్గాల నుంచి ఉంటారు. గురుకులాలలో దాదాపుగా 10-17 సంవత్సరాల పిల్లలు 24/7 పాఠశాల వాతావరణంలో జీవిస్తారు. తల్లి దండ్రుల నుండి అన్నదమ్ముల అక్క చెల్లల నుండి దూరంగా ఉండడం. ఇంటి మీద జీవి గుంజడం, ఒంటరి తనం, నాసిరక ఆహారం, తాగు నీరు సక్రమం కాని మరుగుదొడ్లు/స్నానాల గదులు, గదుల రద్దీ, అనారోగ్యం, యుక్త వయసు సమస్యలు భావోద్వేగ సహాయం లోపం మానసిక వేదింపులు మొదలగు సవాళ్ళు ఈ పిల్లలు ఎదురుకుంటారు. పిల్లలు ఎదురుక్కుంటున్న మానసిక సమస్యలు చెప్పుకోవడానికి స్థలం లేక ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక ప్రైవేట్ పాఠశాలలు సమాజ అసమానతల ప్రతిబింబం. 3 నుండి 18 సంవత్సరాల పిల్లలు ఈ పాఠశాలలలో చదువుతున్నారు. ఫీజు ఆలస్యానికి పిల్లలకు అవమానం,గదుల రద్దీ, ప్లేగ్రౌండ్స్ లేకపోవడం, రవాణా ప్రమాదాలు, భద్రతా ప్రమాణాలు లేకపోవడం, ప్రైవేట్ హాస్టెల్స్ పారదర్శకత లేకుండా నడపడం మొదలగు అనేక సవాళ్ళతో ఈ పాఠశాలలు నడుస్తున్నాయి. మానసిక వత్తిడులకు ఈ పాఠశాలలు నిలయం. వత్తిడులకు తట్టుకోలేక ఎదిగే వయసులలోనే బలన్మరనాలను చూస్తున్నాము.

వివిధ రకాల వయసు పిల్లలు, వివధ రకాల సిబ్బంది ఉన్నారు కావున ఒకే విధానం ప్రతి పాఠశాలకు సరిపోదు. ఉపాధ్యాయులు పిల్లల సామాజిక నేపథ్యం, భావోద్వేగ అవసరాలు అర్థం చేసుకునేలా ప్రత్యేక శిక్షణ పొందాలి. వివధ రకాల పిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల బద్రత మరియు రక్షణ విషయం లో సిబ్బంది తగు నూతన నైపుణ్యాలను పెంచుకోవడం చాల అవసరం.

పాఠశాలలు అంటే టీచర్లుగా కేవలం సబ్జెక్ట్ బోధించడమే కాదు. మార్గదర్శకులుగా రక్షకులుగా, బాలలోని ఆత్మవిశ్వాసాన్ని రూపుదిద్దేవారు. తరగతి గదులను ప్రజాస్వామ్యవంతం చేయడం రాజీలేని అంశం. ఈ రోజు చాలా తరగతి గదులు హైరార్కీలతో నిండి ఉన్నాయి. సమాజంలో ఉన్న అసమానతలు, అధికార ధోరణులు, వివక్ష ఇవి తరగతి గదుల్లో ప్రతిబింబిస్తాయి. తరగతి గది కూడా వివక్షను ప్రతిబింబిస్తే, పిల్లలు భద్రంగా అనిపించుకోలేరు శిక్షలతో పిల్లలు నేర్చుకోలేరు. పాఠశాల అంటే ఏమిటన్న నిర్వచనాన్ని పునః పరిశీలించాలి. పాఠశాల అనేది కేవలం చదువు చెప్పే చోటు కాదు. పాఠశాల అనేది అవకాశాల సమానత్వాన్ని సృష్టించే స్థలం. మన రాజ్యాంగం చెప్పిన విలువలను పిల్లల జీవితంలో నిలబెట్టే స్థలం. ఇందుకోసం ఉపాధ్యాయులు తమ పాత్రను పాఠశాలల పాత్రను లోతుగా పరిశీలించాలి.. పిల్లలు మాట్లాడే, ప్రశ్నించే, పాల్గొనే, నాయకత్వం వహించే తరగతి గది భద్రతకు, ఆత్మవిశ్వాసానికి పునాది.

ఇటువంటి పద్దతులను పాటించే పాఠశాలలను గుర్తించాలి. మన వ్యవస్థలో ఉన్న మంచి నమూనాల నుంచి నేర్చుకోవాలి. కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాలో పిల్లలతో ప్రజాస్వామ్య పద్ధతిలో, విలువలతో పనిచేస్తున్న అద్భుతమైన పాఠశాలలు ఉన్నాయి. ఇవి ఏ పాఠశాలలో జరుగుతున్నాయో గుర్తించాలి. వారి పద్ధతులను అర్ధం చేసుకోవాలి. వాటిని డాక్యుమెంట్ చేయాలి. పియర్ లర్నింగ్ ద్వారా ఇతర పాఠశాలకు తీసుకెళ్లాలి. టీచర్లు టీచర్ల నుంచి నేర్చుకున్నప్పుడు మార్పు నిజమైనదిగా, నిలకడైనదిగా మారుతుంది. పాఠశాలలు, ఉపాధ్యాయులు తమను తాము పరిశీలించుకునేలా Self-Assessment Tools రూపొందించవచ్చు. ఈ సాధనాలు కొన్నిప్రశ్నలు అడగాలి: పిల్లలు గౌరవింపబడుతున్నారా? పిల్లలను ఉపాధ్యాయులు వినే పద్దతులు ఏమిటి? వారికి అవమానం లేదా భయం అనిపిస్తున్నదా? తరగతి గది భావోద్వేగ పరంగా భద్రమైనదేనా అనే అంశాలను పరిశీలన చేయవచ్చు.

సమాజ సంకల్పం పిల్లల హక్కుల ఉల్లంఘనపై పూర్తిగా ‘Zero Tolerance గా ప్రకటించాలి’. పిల్లలకు భద్రత అంటే కేవలం భవనాలు కాదని తెలుసుకోవాలి. భావోద్వేగం, ప్రవర్తన, పోషకాహార భద్రత, ఆకలి, భావాలు, భయాలు, గౌరవం, నమ్మకం ఆనందంతో నిండిన బాల్యం. అన్నింటికీ భద్రత అవసరం. భద్రత ఉంటే హాజరు పెరుగుతుంది; హాజరు పెరిగితే అభ్యాసం జరుగుతుంది. కావున ప్రభుత్వం జవాబుదారీ తనంతో ప్రతి పాఠశాల పిల్లలకు భద్రతతో కూడిన, నమ్మకమైన, స్థలంగా మారాలి. దేశం లో ఉన్న అన్ని పాఠశాలలలో ఆనందంతో నిండిన బాల్యం అందించినప్పుడే ప్రజా సామ్యం అని గుర్తించూదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *