మెరుపు తీగెలు

“నువ్వు తాగున్నావ్, తెలుసా?”

“తెలుసు…”

“తప్పు కదా?”

“తప్పా? నేనేమీ రోడ్డుమీద బండి నడపడంలేదు కదా?”

“తాగి యిలా వస్తారా యెవరైనా?”

“రావడానికే తాగించారు, లేకపోతే నేనెందుకు వస్తాను”

“హు…”

“ఎంకరేజ్‌మెంటు… ప్రోత్సాహం…”

“లేదు, వెళ్ళు…”

“అలాగని రాసివ్వండి”

“వాట్?”

“తాగి వోటు వెయ్యకూడదని రాజ్యాంగంలో యెక్కడ రాసుందో చెప్పండి”

“………”

“మందుకొట్టే కదా ప్రభుత్వం నడుస్తోంది?”

“ఆ?”

“అదే… మందు అమ్మే కదా ప్రభుత్వం నడుస్తోంది?”

“ఊ…”

“మరి మందు కొట్టి వోటెందుకు వెయ్యకూడదూ?”

“అది కాదు…”

“మందుకొట్టి వోటెయ్యకూడదని రూలుందా?”

“లేదు, అరరే… పడిపోయేలా వున్నావ్…”

“పర్లేదు, దేశాన్ని పడిపోకుండా నడిపిస్తాను!”

 – బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *