అయితే ఇండి కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్‌ను డిమాండ్ చేస్తుంది.తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే బీజేపీ మద్దతు ఇచ్చినట్లే అని ప్రకటిస్తుంది..బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యార్థి కాబట్టి, ప్రతి పక్షాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్ అలాంటి వ్యూహాన్ని ఎంచుకుందంటే అర్థం ఉంది.కానీ ప్రజాస్వామ్యవాదులు కూడా బీఆర్ఎస్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి మద్దతు ఇచ్చినట్లే అని గుడ్డిగా ప్రకటిస్తున్నారు..ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్‌గా ఉండే అవకాశం పార్టీలకు లేదా..?.
దేశంలో, తెలంగాణలో ఒక భిన్నమైన రాజకీయం నడుస్తోంది.సామ్రాజ్యవాదం, అమెరికా-రష్యా మధ్య ద్వి ధృవ ప్రభుత్వాలు, ఆధిపత్యాలు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదాలు ఇప్పటి వరకూ మాట్లాడుతున్నారు,చర్చిస్తున్నా రు.అయితే ప్రపంచ వ్యాప్తంగానే స్వయంగా భారత దేశంలోనే ద్వి ధృవ పార్టీల వ్యవస్థ నడుస్తుంది.ఇండియా కూటమి, ఎన్డీయే కూటముల పేరుతో దేశంలో కేవలం రెండు పార్టీల అధిపత్య కూటములు మాత్రమే ఉండేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి.కాంగ్రెస్-బీజేపీ లు పరస్పరం శత్రువులుగా నటిస్తూ దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి.
నా వైపు లేదా శత్రువు వైపు అనే సిద్దాంతాన్ని భారత్‌లో కాంగ్రెస్- బీజేపీలు తీసుకువచ్చాయి..జాతీయ పార్టీలు అధికార యావలో ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను పట్టించుకునే పరిస్థితి లేదు.మేము నిర్ణయం తీసుకుంటాం.మీరు మద్దతు ఇవ్వాలని డిక్టెక్ట్ చేస్తున్నాయి…మేము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించండి లేదా వ్యతిరేకించండి.మా నిర్ణయానికి మద్దతు తెలుపుతే మా ఫ్రెండ్..వ్యతిరేకిస్తే మా శత్రువుగానే పరిగణించాల్సి ఉంటుందని కాంగ్రెస్ బీజేపీ కూటములు అంటున్నాయి.
ఉంటే ఇండి కూటమిలో ఉండాలి.లేదా ఎన్డీయే కూటమిలో ఉండాలి..కానీ తటస్థంగా ఉంటే దేశ ద్రోహుల పార్టీలంటూ ముద్రవేయడం రెండు కూటములకు కామనైంది. ప్రాంతీయ పార్టీలను కూటములు పేర బానిసలుగా మార్చుతున్నారు. ఏదో ఒక కూటమిలో ఉండే పరిస్థితులను కల్పిస్తున్నాయి. ఏ కూటమిలో ఉండం..రెండు కూటములకు సమ దూరంలో ఉంటామన్న పార్టీలను కాంగ్రెస్-బీజేపీలు ఉమ్మడి శత్రువుగా చిత్రీకరిస్తున్నాయి.ఇండి-ఎన్డీ యే కూటమిలో లేని పార్టీలను బలహీనపర్చేందుకు ఇండి కూటమి తొత్తులు ఎన్డీయే కూటమి.ఎన్డీయే తొత్తులనీ ఇండి కూటమి విమర్శలు చేస్తున్నాయి.
ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం.దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి అధ్యక్ష తరహ పాలన తీసుకువచ్చేందుకు ఇది తొలి అడుగుగా చూడాల్సి ఉంటుంది. 78 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు,సంకీర్ణ కూటమలు అనేక వచ్చాయి పోయాయి.కానీ ఏనాడు కూడా ద్వి ధృవ శక్తులుగా ఇంతలా బలపడింది లేదు. ఏ కూటమిలో ఉండాలో డిక్టెటర్ షిప్ సంకీర్ణ కూటముల్లో కనిపించలేదు. దేశంలో ప్రజలకు, పార్టీలకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కుంది.ఎవరు ఎవరికైనా రాజకీయ మద్దతు ప్రకటించవచ్చు..అంతే కానీ నా వైపు లేదంటే శత్రువు వైపు ఉన్నట్లే అన్న అమెరికా తరహ రాజకీయాలు భారత దేశ రాజకీయాలకు సరిపోవు.అలాంటి రాజకీయాలు దేశ ప్రజలు ఒప్పుకోరు..ఇండి-ఎన్డీయే కూటములు దేశంలో భిన్నాభిప్రాయాలు గౌరవించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి చెప్పే బుద్ది జీవులు, మేధావులు రాజకీయ పార్టీలో ట్రాప్‌లో తెలియకుండానే పడుతున్నారు..పలనా కూటమికి నువ్వు మద్దతు ఇవ్వడం లేదు కాబట్టి ఇంకో పార్టీకి అండగ నిలబడుతున్నారని గుడ్డిగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.వారి ఆలోచనలు అభ్యుదవాదంతో ముందుకు కాకుండా తిరోగమనంలో పయనిస్తున్నట్లు అనిపిస్తుంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి-ఎన్డీయే కూటములు తమ అభ్యర్థులను పోటీలో పెట్టాయి..రాజ్యాంగ బద్దమైన పదవులకు జరిగే ఎన్నికల్లో కూటములుగా పోటీ చేసే హక్కే కాదు.ఇండివిజయల్‌గా కూడా పోటీ చేయవచ్చు.కానీ ఆర్ధిక, రాజకీయాంశాలతో ముడిపడి ఉండటంతో ఇండివిజువల్ పోటీ చేసే అవకాశమే లేకుండా జాతీయ పార్టీలు మార్చేశాయి. ప్రాంతీయ పార్టీలను పావులుగా మార్చుకుని తమ ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నాలు ఇండి-ఎన్డీయే కూటములు చేస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీలు ఏ కూటముల్లో లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే తప్పుబట్టే పరిస్థితి రాజకీయా పార్టీలకు వచ్చిందే ఒకే.కానీ ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ స్పూర్తికి కోరుకునే మేధావులకు ఏం అయింది.?.ఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలో మనమే నిర్ణయిస్తామా.?.పార్టీలుగా వారు నిర్ణయం తీసుకునే హక్కులు లేవా.?.రెండు కూటములకు కూడా వారి పక్షాన వాయిస్ వినిపించే మేధావులున్నారు. అయితే ఇండి కూటమి తెలంగాణకు చెందిన వ్యక్తి మాజీ సుప్రీం కోర్ట్ జడ్జి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేస్తే, ఎన్డీయే కూటమి CP రాధాకృష్ణన్ ప్రకటించింది.రెండు జాతీయ కూటములు తమకు నచ్చిన, తాము మెచ్చిన అభ్యర్ధులను ఎంపిక చేసాయి ..తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమదైన స్టైల్‌లో పార్టీలు ప్రచారం చేస్తున్నాయి..సుదర్శన్ రెడ్డి అర్బన్ నక్సలైట్ అని బీజేపీంటే, CP రాధాకృష్ణన్ రాజ్యాంగ వ్యతిరేకని కాంగ్రెస్ ఎవరి స్టైల్లో వారు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సాధారణ ఎన్నికలను మించిన హీట్ పెంచుతున్నాయి.
తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటించడంపై రాష్ట్రంలో చర్చనీయంశంగా మారింది. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అందుకే న్యాయకోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిందని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. అయితే ఇక్కడే ప్రజల నుంచి అనేక మౌలిక ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకు వస్తుందా..?.అధికారంలో ఉన్నప్పుడు ఇవేమి గుర్తుకురావా..? అన్న ప్రశ్న ఇమిడెట్‌గా ప్రజలు ప్రత్యార్థి నుంచి వస్తుంది.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ పదవుల్లో ప్రజాస్వామ్య వాదులు, న్యాయకోవిదులు,పార్టీతో సంబంధం లేని వారిని ఎందుకు నిలబెట్టలేదన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
అయితే ఇండి కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్‌ను డిమాండ్ చేస్తుంది.తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే బీజేపీ మద్దతు ఇచ్చినట్లే అని ప్రకటిస్తుంది..బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యార్థి కాబట్టి, ప్రతి పక్షాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్ అలాంటి వ్యూహాన్ని ఎంచుకుందంటే అర్థం ఉంది.కానీ ప్రజాస్వామ్యవాదులు కూడా బీఆర్ఎస్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి మద్దతు ఇచ్చినట్లే అని గుడ్డిగా ప్రకటిస్తున్నారు..ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్‌గా ఉండే అవకాశం పార్టీలకు లేదా..?.ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏమీ పార్లమెంట్‌లో బిల్లు కాదు కద.వాకౌట్ చేస్తే పరోక్షంగా అధికార పార్టీకి మద్దతు ఇచ్చినట్లు..ఇండి-ఎన్డీయే కూటములకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సరాసరి బాలాలున్నాయి.
నిజానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై తెలంగాణలో ఎవ్వరీకి భిన్నాభిప్రాయాలు లేవు..తెలంగాణకు, పౌర హక్కులకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన కృషి చాలా ఉంది.తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక్షంగా ఉన్న బీఆర్ఎస్‌కు కూడా సుదర్శన్ రెడ్డి పట్ల ఎలాంటి అనుమానాలు లేవు.కానీ, బీఆర్ఎస్‌పై ఉన్న కోసంతో.కేసీఆర్ కుటుంబంపై ఉన్న అక్కసును అటు కాంగ్రెస్ ఇటు కొందరు ప్రజాస్వామ్యవాదులు సుదర్శన్ రెడ్డికి మద్దుతు ఇవ్వలేదని వెళ్లగక్కుతున్నాయి. రాజ్యాంగ స్పూర్తిని కొనసాగించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడలని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేస్తున్నట్లు ఇండి కూటమిలో ఉన్న పార్టీల అభిప్రాయాలు తీసుకున్నట్లు.బీజేపీని సిద్దాంత పరంగా వ్యతిరేకిస్తున్న ఇతర ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి ఇది ప్రజాస్వామ్య విధానం అని తెలియకపోవడం బాధకరం..అంతేకాదు సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి, అందులోనూ తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇచ్చిన వ్యక్తి..అలాంటి వ్యక్తిని నిలబెట్టినప్పుడు తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న కేసీఆర్ ను సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటించి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేయడం.చేయకపోతే ప్రత్యర్థి శిబిరం అని ప్రచారం చేయడం ఏం ప్రజాస్వామ్య స్ఫూర్తి అవుతుంది.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను, ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ యూరియాతో ముడిపెట్టవచ్చు.యూరియా ఇష్యూ కూడా రాష్ట్రంలో చాలా పెద్దది..ప్రాంతీయ పార్టీగా వాళ్ళకు అది ముఖ్యం కావచ్చు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకన పెట్టడంలో వ్యూహం కావచ్చు. ఆటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అది ఒక స్ట్రాటజీ కావచ్చు.అంతమాత్రనా ఎన్డీయే కూటమి మద్దతు ఇస్తారని ఏలా ప్రకటిస్తారు..?.నిజాంగా ఎన్డీయేను ఓడించే ఉద్దేశ్యమే ఇండి కూటమికి ఉంటే శత్రువు శత్రువు మిత్రుడన్న సూక్తిని ఎందుకు పాటించలేదు..ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏం రాష్ట్రంలో పదవి కాదు కదా..?
అలా కాకుండా,బీఆర్ఎస్‌పై బట్టకాల్చి మీద వేసినట్లు, మేము నిర్ణయం తీసుకుంటాం దానికి మీరు కట్టుబడి మద్దతు ఇవ్వాలని ఆదేశించడం ఏం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తి అవుతుంది. రాజ్యాంగ బద్ధమైన పదవికి ఒక వ్యక్తిని నిలబెట్టినప్పుడు.కనీసం భావసారూప్యత పార్టీలతో చర్చించడం ఒక పద్ధతి. ఆ పని కాంగ్రెస్ చేసిందా..?..పోనీ తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతిగా చేయాలనుకుంటున్నాం మీరేమంటారు..అని ఒక పార్టీ చీఫ్ గా కేసీఆర్ అభిప్రాయం తీసుకున్నారా..? ఇండియా కూటమి ఏమైనా అధికారిక లేటర్ ఏమైనా రాసిందా..?.అలాంటప్పుడు మద్దతు ఇవ్వాలని అడిగే నైతిక హక్కు ఉంటుందా.?.మేము డిసైడ్ చేస్తాం మీరు ఇట్లేయేలంటే అది ప్రజాస్వామ్యం అవుతుందా.?.రాజ్యాంగ పదవి అయితే ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు పాటించవద్దాన్న.రాష్ట్రంలో ప్రత్యార్థులతే..జాతీయ రాజ్యాంగ పదవి విషయంలో రాష్ట్ర పార్టీ అభిప్రాయం తీసుకోవడంలో తప్పులేదు.. అంతేకానీ మీ అభిప్రాయంతో పనేముంది..మేము డిక్టేట్ చేస్తాం..మీరు పాటించాలంటే ఇదేం రాచరిక వ్యవస్థ కాదు.నియంతృత్వ వ్యవస్థ అస్సలే కాదు.నియంతల్లా నిర్ణయాలు..డిక్టేటర్స్‌లా ఆదేశాలు ఇస్తే ప్రజాస్వామ్య ఏలా అవుతుంది..సహజ న్యాయసూత్రలకు విరుద్దంగా వ్యహరిస్తూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగే నైతిక హక్కు కూడా కోల్పోవల్సి వస్తుంది..ఇండి-ఎన్డీయే కూటములు తీరు నియంత శక్తులు గా మారాయి.
-తోటకూర రమేష్