బొగ్గు రంగంలో విప్లవాత్మక సంస్కరణలు

•బొగ్గు నిల్వల్లో భారత్‌ ‌రెండో స్థానం..
•2047 వికసిత భారత లక్ష్యాల్లో బొగ్గు రంగం ఎంతో కీలకం: కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 :  ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ ‌రెండో స్థానంలో ఉందని,  బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని, ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారుగా భారతదేశం నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు గని గెవరా మన దేశంలోనే ఉందని, కోలిండియా బొగ్గు మంత్రిత్వ శాఖ కీలకమైన విభాగం. ఈ ఏడాది కోలిండియా స్వర్ణ జయంత్యుత్సవాలు జరుపుకుంటోందని కోలిండియా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిందన్నారు. పవర్‌, ‌స్టీల్‌, ‌సిమెంట్‌, అల్యూమినియం, ఫెర్టిలైజర్‌, ‌హెవీ ఇండస్ట్రీస్‌ ‌రంగాల్లో బొగ్గు కీల కమైన అంశం. భారతదేశంలో బొగ్గు ద్వారానే 74% విద్యుదుత్పత్తి జరుగుతోంది. రానున్న దశాబ్దాల్లోనూ బొగ్గు ఒక కీలకమైన ఇంధనంగా ప్రత్యేకతను సంతరించుకుంది.

2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. బొగ్గు రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పారదర్శకంగా కోల్‌ ‌బ్లాక్స్ ‌వేలం, కమర్షియల్‌ ‌కోల్‌ ‌మైనింగ్‌, ‌పాలసీ రిఫార్మస్, ‌కోల్‌ ‌గ్యాసిఫికేషన్‌, ‌టెక్నాలజీ వంటి వినియోగం పెరిగింది. దీని కారణంగా.. మన బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. చక్కని నిర్ణయాలు తీసుకుని.. పారదర్శకంగా అమలు చేయడం వల్లే ఉత్పత్తి పెరిగింది. 2023-24లో 998 మిలియన్‌ ‌టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. 2014లో ఇది కేవలం 609 కోట్ల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగేది. బొగ్గు రంగంలో ప్రైవేట్‌ ‌రంగం భాగస్వామ్యం పెరిగిన తర్వాత మరింత పోటీ పెరిగింది. దీని ద్వారా చాలా సానుకూల మార్పులు వొచ్చాయి. ఇప్పటివరకు 10 విడతల పాటు పారదర్శకంగా వేలం పూర్తయింది. 184 బ్లాక్స్ ‌వేలం జరిగింది. 11వ వేలం ఇటీవలే పూర్తయింది. త్వరలోనే 12వ వేలం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గనుల తవ్వకంలోని అడ్డంకులను తొలగించేందుకు అన్ని రకాలుగా పనిచేస్తున్నాం.

పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నాం. 2014లో విద్యుదుత్పత్తి సంస్థల వద్ద కేవలం 4 రోజుల బొగ్గు స్టాక్‌ ‌మాత్రమే ఉండేది. కానీ మా సర్కారు తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా.. ఇవాళ 21 రోజుల స్టాక్స్ అం‌దుబాటులో ఉన్నాయి. స్పాంజ్‌ ఐరన్‌, ‌స్టీల్‌, ‌ఫెర్టిలైజర్‌ ‌వంటి నాన్‌ ‌రెగ్యులేటెడ్‌ ‌రంగాలకు కూడా బొగ్గును నిరంతరం సరఫరా చేస్తున్నాం. ఫస్ట్ ‌మైల్‌ ‌కనెక్టివిటీ ద్వారా.. బొగ్గు రవాణా విషయంలోనూ సంస్కరణలు తీసుకొచ్చాం. బొగ్గు మంత్రిత్వ శాఖ సహాయంతో రైల్‌-‌సీ-రైల్‌ ‌విధానంలోనూ బొగ్గు రవాణా వేగవంతం చేశాం. 2014తో పోలిస్తే రైల్వేల ద్వారా బొగ్గు రవాణా కూడా దాదాపు 50% పెరిగింది. విద్యుత్‌ ‌రంగానికి బొగ్గు కేటాయింపులు విషయంలోనూ.. ఎలాంటి అడ్డంకులు రాకుండా సమగ్రమైన విధానంతో.. ముందుకెళ్లేందుకు ‘శక్తి’ పాలసీని తీసుకొచ్చాం. ప్రైవేటు రంగంలోనూ విద్యుదుత్పత్తి కేంద్రాలు, పీఎస్‌ ‌యూలకు, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. వీరెవ్వరికీ బొగ్గు కొరత లేకుండా పనిచేస్తున్నాం. విద్యుదుత్పత్తి కంపెనీలకు బొగ్గు రవాణా ధరలను తగ్గించేందుకు కోల్‌ ‌రేషనలైజేషన్‌ ‌పథకాన్ని తీసుకొచ్చాం. దీని వల్ల దాదాపు రూ.7వేల కోట్ల ఆదా జరిగింది. ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా.. బొగ్గు దిగుమతులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌ ‌నుంచి నవంబర్‌ ‌వరకు 8 నెలల్లో.. బొగ్గు దిగుమతులు చాలా తగ్గాయి. దీని వల్ల దాదాపు 30వేల కోట్ల విదేశీ మారకం ఆదా అయింది. స్టీల్‌ ‌రంగానికి అవసరమైన కోకింగ్‌ ‌కోల్‌ ‌విషయంలోనూ దాదాపు 1.7 శాతం దిగుమతులు తగ్గాయి. ‘మిషన్‌ ‌కోకింగ్‌ ‌కోల్‌’ ‌లో భాగంగా.. ఈ విషయంపై ప్రత్యేక విధానంతో ముందుకెళ్తున్నాం. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులు తగ్గించేలా పనిచేస్తున్నాం.

మన దేశంలో దొరికే కోకింగ్‌ ‌కోల్‌ ‌లో బూడిద శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాషరీలను అభివృద్ధి చేశాం. వీటితోపాటు కార్మికులు, ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక విధానంతో పనిచేస్తున్నాం. మైనింగ్‌ ‌సర్వే, టోపోగ్రఫీ అనాలసిస్‌ ‌కోసం డ్రోన్స్ ‌వినియోగం పెంచాం. ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్, ‌మెషీన్‌ ‌లర్నింగ్‌ ఆధారిత డ్రిల్స్, ‌బ్లాస్టస్ ‌ను డిజైన్‌ ‌చేస్తున్నాం. ఇంటర్నెట్‌ ఆఫ్‌ ‌థింగ్స్ ‌బేస్డ్ ‌ఫ్లీట్‌ ‌మానిటరింగ్‌, ‌ఫ్యుయల్‌ ‌మానిటరింగ్‌ ‌జరగుతోంది. సీఎంపిడిఐ (సెంట్రల్‌ ‌మైన్‌ ‌ప్లానింగ్‌ అం‌డ్‌ ‌డిజైన్‌ ఇనిస్టిట్యూట్‌) ‌ద్వారా సీ-డాక్‌ (‌సెంటర్‌ ‌ఫర్‌ ‌డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ ‌కంప్యూటింగ్‌) ‌సహాయతతో.. పైలట్‌ ‌ప్రాజెక్ట్ 5‌జి నెట్‌ ‌వర్క్ ఏర్పాటుచేసుకున్నాం. దీంతోపాటుగా 5%+% సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్ ‌టెస్ట్ ‌ల్యాబ్‌ ‌కూడా తీసుకొస్తున్నాం. కోల్‌ ‌మైన్స్ ‌కీ యాక్టివిటీస్‌ ‌ను 5%+% డ్రోన్‌ ఆధారిత రిమోట్‌ ‌మానిటరింగ్‌ ‌ద్వారా సర్వేలెన్స్ ‌సిస్టమ్‌ ‌ను ప్రారంభించాం. దీని ద్వారా.. నిరంతర నిఘా, సెక్యూరిటీ పెరిగింది. అక్రమ మైనింగ్‌ ‌పై నిఘా పెరిగింది. కోల్‌ ‌ప్రొడక్షన్‌ ‌పెంచడం, అడ్వాన్స్‌డ్‌ ‌టెక్నాలజీ ఉపయోగం, పర్యావరణ పరిరక్షణతోపాటుగా ఉద్యోగుల సంరక్షణ కూడా మా ప్రాధాన్యత. ఈ పదేళ్లలో మా మంత్రిత్వ శాఖ ద్వారా తీసుకొచ్చిన మార్పులు, నిఘా, మానిటరింగ్‌, ‌భద్రతా ప్రమాణాలను నిక్కచ్చిగా అమలు చేయడం కారణంగా.. ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. 2013 తో పోలిస్తే. 2023 ప్రమాదకర ఘటను 50 శాతానికి పైగా తగ్గాయి. సీరియస్‌ ‌యాక్సిడెంట్స్ ‌కూడా దాదాపు 80% వరకు తగ్గాయని కేంద్ర మంత్రి తెలిపారు.

2030 నాటికి 100 మిలియన్‌ ‌టన్నుల కోల్‌ ‌గ్యాసిఫికేషన్‌
‌దేశ ఇంధన భద్రత, సుస్థిరతను పెంచే దిశగా కోల్‌ ‌గ్యాసిఫికేషన్‌ ఓ ‌పెద్ద ముందడుగు అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. 2030 వరకు 100 మిలియన్‌ ‌టన్నుల కోల్‌ ‌గ్యాసిఫికేషన్‌ ‌లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దీని ద్వారా కార్బన్‌ ఎమిషన్‌ ‌తగ్గడంతోపాటు.. క్లీనర్‌ ‌కోల్‌ ‌టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసం రూ.8,500 కోట్ల ఆర్థిక ప్రోత్సాహక నిధికి కేబినెట్‌ ‌కమిటీ ఆన్‌ ఎకనామిక్‌ అఫైర్స్  ఆమోదముద్ర వేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ కు సంబంధించిన పీఎస్‌యూలు భిన్నమైన రంగాల్లోనూ ముందడుగు వేస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా పిట్‌ ‌హెడ్‌ ‌థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్స్, ‌సోలార్‌ ‌పవర్‌ ‌ప్లాంట్స్,‌ఫ్లోటింగ్‌ ‌సోలార్‌ ‌పవర్‌ ‌ప్లాంట్స్, ‌క్రిటికల ఎక్స్ ‌ప్లొరేషన్‌ ‌వంటి వివిధ కార్యక్రమాలను కూడా పెద్దపీట వేస్తున్నాయి. నైవేలీ లిగ్నయిట్‌ ‌కార్పొరేషన్‌.. ‌భారతదేశంలోనే 1 గిగావాట్‌ ‌రెన్యూవబుల్‌ ఎనర్జీ ఉత్పత్తి చేసిన మొదటి పిఎస్యూ రికార్డు నెలకొల్పింది.

దేశంలో సోలార్‌ ‌పవర్‌ ‌ప్రొడక్షన్‌ ‌చేసే పీఎస్యూల్లో నైవేలీ లిగ్నయిట్‌ ‌కార్పొరేషన్‌ ‌ముందువరుసలో ఉంది. ఈ పీఎస్యూ ద్వారా.. 2030 వరకు 10 గిగావాట్లు, 2047 30 గిగావాట్ల రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రొడక్షన్‌ ‌లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కోలిండియా, మరో పిఎస్‌ ‌యూ కాబిల్‌ ‌ద్వారా..విదేశాల్లో క్రిటికల్‌ ‌మినలర్స్ ‌బ్లాక్స్ ‌ను చేజిక్కించుకుని వాటిలో తవ్వకాలు కూడా ప్రారంభమయ్యాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ పర్యావవరణ పరిరక్షణ విషయంలోనూ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.  2024 జనవరి నుంచి నవంబర్‌ ‌వరకు మా పీఎస్యూలు 2,372 హెక్టార్లలో 54 లక్షలకు పైగా మొక్కలు నాటారని,  2019-20 నుంచి 2024 వరకు.. 13,233 హెక్టార్లలో 2.9 కోట్ల మొక్కుల నాటామని, ప్రధానమంత్రి మోదీ ‘ఏక్‌ ‌పేడ్‌ ‌మాకే నామ్‌’‌లో భాగంగా.. ఒక్క 25 జులై, 2024 నాడే.. 11 కోల్‌ ‌మైనింగ్‌ ‌యాక్టివిటీ ఉన్న రాష్ట్రాల్లో 332 ప్రాంతాల్లో 10 లక్షల మొక్కలు నాటాము. దాదాపు 4,700 హెక్టార్ల డీ-కోల్డ్ అటవియేతర భూమును గుర్తించి అక్కడ పెద్దమొత్తంలో మొక్కలు నాటుతున్నామని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *