పదవి విరమణ వయసు పెంపు… ఎవరికి లాభం…?

నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాలు
ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచడం పట్ల నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే, పెద్ద ప్రభుత్వ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రభుత్వము ఏర్పడి సంవత్సరమైనా కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనే అటువంటి విషయాన్ని కూడా ఇప్పటివరకు బహిరంగపరచలేదనేటువంటి విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వము తెలపడం లేదని, ఎటువంటి నోటిఫికేషన్లు వేయడం లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఉద్యోగం వస్తే తప్ప మా బతుకులు బాగుపడవని గమనించినటువంటి యువత ఉద్యోగం కోసం కొన్ని ఏళ్ల నుండి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశ నెరవేరడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము అత్యధిక నోటిఫికేషన్లు జారీ చేసి,ఎక్కువ మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 63 సంవత్సరాలకు పెంచడం రాష్ట్ర ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు.దీని వల్ల ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లె ప్రమాదం వుంది.ఉద్యోగ విరమణ వయసును పెంచడమంటే లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినట్టడమే.ప్రభుత్వానికి ఎంత ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ,ఎన్ని డిమాండ్లు వచ్చినప్పటికీ ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని నిరుద్యోగ యువత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.గత ప్రభుత్వం చేసిన తప్పు ను ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని అంటున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో నిరుద్యోగులే కీలకపాత్ర పోషించారు.జాబ్‌ క్యాలెండర్‌ కోసం వారు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లకుండా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతున్నారు.నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని,ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగులు ఏకమై మరొక ఉద్యమానికి సిద్ధపడుతున్నారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 5వ వేతన సవరణ సంఘం,58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసింది.
కానీ, గరిష్ట వయస్సు 60 ఏళ్లకు మించరాదని, వయస్సుకు మించిన సర్వీసు పొడిగింపులపై పూర్తిగా నిషేధం విధించాలని పేర్కొంది. అంతేకాదు 7వ పీఆర్సీ సైతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలని ఎలాంటి సిఫార్సులు చేయలేదు.అయితే, ఏపీ, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.దీని వల్ల నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారనే విమర్శలు ఉన్నాయి.రిటైర్మెంట్ వయసు పెంచడంతో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయి, కొత్త నోటిఫికేషన్ల రావడం ఆలస్యం అవుతుంది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉండేది. కానీ, కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు 60 ఏళ్లకు,ఏపీ, తెలంగాణలోనూ 62 ఏళ్లకు పెంచారు. దీనిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి.
నిరుద్యోగులకు అన్యాయం చేయడమేమిటని నని మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు,టి ఎ లు,పిఆర్సి వంటివి ఇవ్వనవసరం లేకుండా వయస్సు పెంచడం ద్వారా వీటన్నింటి ద్వారా లబ్ధి పొందవచ్చని ప్రభుత్వం యోచిస్తుంది.గత ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 58 నుంచి 61 ఎండ్లకు పెంచడం ద్వారానే అనేకమంది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఆగిపోయాయి. వయసు రిత్యా ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఉద్యోగులే చెబుతున్నటువంటి పరిస్థితి. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వవలసిన వివిధ చెల్లింపుల భారం తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వెంటనే ఇప్పటికే రిటైర్డ్ అయినటువంటి వారికి చెల్లించాల్సినటువంటి వాటిని చెల్లించాలని కోరుతున్నారు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు వచ్చేటువంటి పెన్షన్ కూడా సరైన సమయానికి అందడం లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  – డాక్టర్ మోటె చిరంజీవి
    సామాజిక వేత్త,విశ్లేషకులు.
      సెల్ : 9949194327.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *