ప్రజా పాలనలో రణధీర

మాతా శిశువుల ఆరోగ్యమే దేశ పురోభివృద్ధికి మూలం. సమాజ సౌభాగ్యానికి, సంస్కృతికి ప్రజాస్వామ్యానికి ఆరోగ్య సుఖ సంతోష జీవితమే నిదర్శనం. పసిపిల్లల మెదళ్లను శరీరాన్ని పోషించాలి. ఆడించాలి. విజ్ఞానపు పంటలు పండించాలి. ఈ దార్శనికతను అవాహన చేసుకున్న సీతక్క తనకు కేటాయించిన మహిళాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ పరంగా మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధతో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్ వాడీలను పటిష్టం చేస్తూ పిల్లలు సహజ వాతావరణంలో పెరుగుతూ పాఠశాల విద్యకు సంసిద్ధం చేయడం కోసం 15,640 అంగన్ వాడీలను ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలోకి మార్చారు.  

సీతక్క ఆధునిక తెలంగాణ చరిత్రలో ఒక విలక్షణమైన వైతాళికతను కొనసాగిస్తున్న వ్యక్తిత్వం. గత ఏడాది మంత్రుల ప్రమాణ స్వీకార సభ సందర్భంగా సీతక్క ప్రమాణాన్ని వీక్షించిన వారికి ప్రజల నుంచి వొచ్చిన కేరింతలు, తమ మ‌ధ్య నుంచి ఒక సగటు సాధారణ ఆడబిడ్డ మంత్రిగా ఎదిగిన వైనం పట్ల తెలంగాణ సమాజం స్పందించిన తీరు చరిత్ర స‌గర్వంగా నమోదు చేసుకుంది. వాస్తవికంగా మనం చూస్తున్న ప్రజాస్వామ్య రాజాకీయాల్లో ఎన్నికలలో పోటీ చేయడానికి ముందుకు వొస్తున్న అత్యధిక అభ్యర్థులు సాధారణ జన జీవితం కలిగిన వాళ్లు కాదు., దశాబ్దాలుగా రాజకీయాల్లో, ప్రజా సేవలో ఉన్న వాళ్లు కాదు.. వివిధ వ్యాపారాలలో డబ్బులు సంపాదించి, ఆ డబ్బులను ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టి గెలుపు గుర్రాలుగా చలామణిలో ఉన్నవాళ్లు. గెలుపు సాధించడమే తప్ప ఇతర ఏ నైతిక ప్రమాణానికి కట్టుబడని వాళ్లనే ఆయా పార్టీల అభ్యర్థులుగా ఉంటున్న అనవాయితీ కనిపిస్తున్నది. ఈ సంప్రదాయానికి భిన్నంగా ఒక అచ్చమైన మూలవాసి, ఆదివాసీ, నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వొచ్చిన నిబద్ధతతో, త్యాగాలను కోరుకునే ప్రజా విప్లవ రాజకీయాలలో నుంచి, ఆ తర్వాత పార్లమెంటరీ రాజాకీయాల్లో చేరి మనగలిగి ప్రతిపక్షం నుంచి పాలనలో భాగస్వామిగా మారి, మంత్రిగా ఎదిగిన ధనసరి సీతక్క ప్రస్థానంపై సాధారణ ప్రజానీకం, పౌర సమాజం, పార్టీ, ప్రతిపక్షం, సామాజిక శాస్రవేత్తలు ప్రత్యేక ఆసక్తిగా గమనిస్తూ వొస్తుంది.
image.png
వివక్షతకు గురవుతున్న ప్రజల కోసం పోరాడిన సీతక్కకు వారి వికాసం కోసం పని చేయడానికి అవకాశాన్ని కల్పించే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమం వంటి కీలక శాఖలను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. దీనికి తోడు పాలన రాజాధానికి దూరంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా బాధ్య‌తలు, తనపై అపార నమ్మకంతో, విశ్వాసంతో తనను గెలిపించి నిలబెట్టిన అరణ్య ఆదివాసీ ములుగు నియోజకవర్గం ప్రజల బాగోగులు, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ కొనసాగుతున్న తీరు సామాజిక కార్యకర్తలకు, రాజకీయ పరిశీలకులకు ఒక అధ్యయన అంశంగా, అబ్బురపరిచేదిగా ఉంది. అధికారం లేనప్పుడు, ఉన్నప్పుడు వ్యత్యాసం లేని పనితీరుతో విమర్శకులను సైతం ఔరా అని అనిపిస్తున్నది. దీనికి తోడు పాలకపక్షంపై ప్రతిపక్షాలు చేసే దాడికి సరైన జవాబును అధ్యయనంతో, ఖ‌చ్చిత‌మైన‌ గణాంకాలతో సీఎం తర్వాత సీతక్క ఇస్తున్నది.
మాతా శిశువుల ఆరోగ్యమే దేశ పురోభివృద్ధికి మూలం. సమాజ సౌభాగ్యానికి, సంస్కృతికి ప్రజాస్వామ్యానికి ఆరోగ్య సుఖ సంతోష జీవితమే నిదర్శనం. పసిపిల్లల మెదళ్లను శరీరాన్ని పోషించాలి. ఆడించాలి. విజ్ఞానపు పంటలు పండించాలి. ఈ దార్శనికతను అవాహన చేసుకున్న సీతక్క తనకు కేటాయించిన మహిళాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ పరంగా మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధతో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్ వాడీలను పటిష్టం చేస్తూ పిల్లలు సహజ వాతావరణంలో పెరుగుతూ పాఠశాల విద్యకు సంసిద్ధం చేయడం కోసం 15,640 అంగన్ వాడీలను ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలోకి మార్చారు. ఏక రూప దుస్తులు అందజేశారు. అన్ని అంగన్ వాడీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది శానిటేషన్ ప‌నులు చేప‌ట్టి పసి పిల్లలు ఆడుకుంటూ జ్ఞానం పొందే సంతోష చంద్రశాలలుగా మార్చారు. క్రేష్ కేంద్రాలను డే కేర్ కేంద్రాలుగా మార్చారు. దీనితో పని చేసుకునే మహిళలకు వెసులుబాటు దొరికి వారి ఆదాయ వనరులు పెరగడానికి దోహదం చేసింది.
image.png
మహాలక్ష్మి గ్యారంటీ పథక రూపకల్పనలో సీతక్క ఉన్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా భావించి సీఎం రేవంత్ రెడ్డి 9 డిసెంబర్ 2023 రోజున ప్రారంభించారు. ఉచిత బస్ ప్రయాణంతో శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెరిగి వ్యవసాయ, చిన్న తరహా చేతి వృత్తుల,పారిశ్రామిక ఉత్పాదకత పెరిగింది. టెంపుల్ టూరిజం గణనీయంగా పెరిగి పరోక్షంగా ఇతర పని వారి ఉపాధి పెరిగింది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌తో కుటుంబ నిర్వహణలో ఆర్థిక వెసులుబాటు కలిగింది. దానిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు.ఒక సంవత్సర చిన్న ప్రామాణిక కాలంలో అత్యధిక సానుకూల ఫలితాలను తీసుకవచ్చారు.మహిళా స్వయం సహాయక గ్రూప్ లను గొప్ప ముందంజ వేయించే పనులను చేపట్టారు.వారితో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయించారు. కమ్మనైన స్వచ్ఛమైన వంటకాలు ప్రజల ఆదరణ పొందాయి.శిల్పారామము లో మహిళా గ్రూప్ ల ఉత్పత్తుల స్టాల్స్ ను ఏర్పాటు చేసారు.63 లక్షల మంది సభ్యులు ఉన్న గ్రూప్ లను కోటి కి చేర్చి వారిని కోటీశ్వరులుగా మార్చడానికి లక్ష్యం పెట్టుకున్నారు.సోలార్ ప్లాంట్ ,అద్దె బస్ లు,చేపల విక్రయ వాహనాలు ఇంకా 17 రకాల ఉత్పాదక రంగాలలో భాగస్వామ్యం చేస్తున్నారు.
తన ఆత్మ హృదయం ములుగు నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు,అంది వొచ్చిన ప్రతి అవకాశాన్ని తన ప్రజల బాగు కోసం కృషి చేస్తున్నారు.అరణ్య ములుగును విద్యా వైద్య హబ్ గా మార్చే కృషిలో కేంద్రీయ విశ్వ విద్యాలయం,వైద్య కళాశాల ,వైద్యశాలలలో అవస్థాపన సౌకర్యాలు కల్పించడంలో సఫలీకృతం అయ్యారు.వైద్య అవసరాల కోసం వరంగల్.హైదరాబాద్ కోసం వెళ్లడం గణనీయంగా తగ్గించారు.రవాణా సౌకర్యాలు మరింత అందుబాటులో తేవడం కోసం ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ ఏటూరునాగారం బస్ డిపో ను సాధించారు.రహదారులను మరింత సుందరీకరించి టెంపుల్ ,ఎకో టూరిజం కు ప్రజలు పెద్ద ఎత్తున రావడానికి దోహదం చేశారు.లక్నవరం లో మూడవ ద్వీపం.పస్రా తాడ్వాయి మధ్యలో బ్లాక్ బెర్రీ ద్వీపంను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు.సమ్మక్క సారక్క మేడారం ,రామప్ప ,మల్లూరు,వాజేడు ,గణపురం,వంటి పర్యాటక ప్రాంతాలకు ఇవి అదనపు ఆకర్షణగా మార్చి స్థానిక ప్రజల ఉపాధికి ఊతమిస్తున్నారు.అటవీ చట్టాలు ఆమోదించని చోట ఎవరు నడవని దారిలో కొత్త అడుగులు వేస్తూ కంటైనర్ బడులను,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసారు.తన ప్రజలకు విద్యా వైద్యం అందించడంలో సీతక్క నిబద్ధతకు ఇది అత్యున్నత రూపం.ప్రభుత్వ పథకాలలో.బడ్జెట్ కేటాయింపులలో తన ప్రజల ప్రత్యేక అవసరాల రీత్యా ఎక్కువగా ఆమోదింప చేసుకుని అందిస్తున్నారు.అంగన్ వాడి ,పంచాయతీ భవనాలను,కలెక్టర్ భవన సముదాయాలను వేగంగా పూర్తి చేయిస్తున్నారు.
ఆదివాసీ, మహిళా, విప్లవోద్యమ అస్థిత్వాలను తనను నడిపించే చోదకశక్తులుగా ఉన్న సీతక్క వారి ఇతోధిక వికాసం కోసం ప్రభుత్వం పరంగా, కార్పొరేట్ సామాజిక బాధ్య‌త గల సంస్థలను కూడా పాల్గొనేలా చేశారు. నిర్మాణ్ సంస్థ సారథ్యంలో పలుమార్లు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, నాస్కామ్ నిర్వహించిన ఇంపాక్ట్ కాంక్లేవ్ లో పాల్గొని అభివృద్ధి అంతరాలు తగ్గించడంలో కార్పొరేట్లు కృషి చేయాలని కోరారు. అన్ని రకాల సామాజిక సూచికలలో వెనుకబడి ఉన్న దీర్ఘకాలికంగా నిర్లక్ష్యం చేయబడిన .తిరుగుబాట్లు, అణచివేతతో జీవన సంక్షోభం నెలకొన్న తన ములుగుతో పాటు ఆదివాసీల నిలయాలైన అదిలాబాద్, ఖమ్మం, పాలమూరు నల్లమల చెంచు ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో కార్పొరేట్ పెద్దలను ఆహ్వానించి వారితో పలు గ్రామాలను దత్తత తీసుకునేలా కృషి చేశారు. వీటిలో మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఇవి శిక్షణ, ఉపాధి కల్పనతో పాటు పలు గిరిజన గురుకులాలలో ఆధునిక డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. వ‌న్ కార్పొరేట్ వ‌న్ విలేజ్ అడాప్ష‌న్‌ నినాదాన్ని ఆయా సంస్థలు అంగీకరించేలా తన సమూహాల పట్ల  అసమాన ఆర్తి, తపనతో కృషి చేశారు. తన ములుగు ప్రాంతంలో 10 గ్రామాలను కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకున్నాయి.
image.png
సీతక్క తన పాఠశాల విద్య ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ పూర్తి చేసుకుంది. హాస్టల్స్, గురుకులాల్లో గత 15 ఏళ్లుగా డైట్, కాస్మోటిక్ చార్జెస్ లో ఎలాంటి పెంపు లేదు. ఉన్నత మధ్యతరగతి వర్గాల పిల్లల అనుభవంలో ఉన్న మెరుగైన సౌకర్యాలు పేద వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, చక్కని పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత కోసం డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలను 200% పెంచి చరిత్ర సృష్టించారు. ఏ మాత్రం సమయం లభించినా ఆమె గురుకులాల్లో రాత్రి బస చేస్తూ వారితో మమేకమ‌వుతూ, విద్యా లక్ష్యాలను వివరిస్తూ, ఆడుతూ, పాడుతూ ఉత్సాహాన్ని నింపి వస్తారు. ఒక అపురూపమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఒక అంచనాలో ప్రజా పాలనలో రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ ప్రయాణాలు చేసిన మంత్రిగా స్థానం పొందారు. శక్తి మేరకు పని చేయడం, అవసరం మేరకు ఉపయోగించడం, మితవ్యయం, దుబారా ఖర్చు తగ్గింపున‌కు ఒక ప్రతీకగా సీతక్క నిలుస్తున్నారు.
సమకాలీన రాజకీయాలలో అరుదైన పనితీరును కొనసాగిస్తున్న సీతక్క పై అసూయతో, ఓర్వలేని తనంతో నిందాపూర్వక మార్ఫింగ్ ప్రచారం ప్రతిఘాతక శక్తులు చేస్తున్నాయి. దాశరథి అన్నట్లు కత్తిరించిన వొత్తులు వెలుగుతాయి అనే వెలుగులో వెరవక తనను నమ్మిన సమూహాల కోసం నిబద్ధత కనబరుస్తున్నారు. రాజ్యంగాన్ని కుట్ర‌పూరితంగా బలహీనం చేస్తూ, అంబేడ్కర్ ను  అవమానిస్తూ, దేశానికి ప్రమాదకరంగా మారుతున్న మనువాద శక్తులను భావజాల యుద్ధంలో ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలను నిర్మాణాత్మకంగా విమర్శిస్తూ, రాజ్యంగబద్ధంగా ప్రతిఘటిస్తూ వొస్తున్నారు. విశ్రాంతి తనకు నచ్చని అంశం. తెలంగాణ జీవితంలో ఒక సంవత్సరం, మహా సముద్రంలో ఒక నీటి బిందువు. ఈ కాలాన్ని ఒడిసిపట్టి ప్రతి క్షణాన్ని వివక్షతకు ,అభివృద్ధికి నోచుకోని ప్రజల కోసం సీత‌క్క పాటు పడిన తీరు అసామాన్యం. సీతక్క పుట్టింది ప్రజల కోసం..పెరిగింది ప్రజల మధ్య , వారి ప్రేమ విశ్వాసాలకు మాత్రమే విధేయత.. అనేక అగాధాలు ఆమెను గొంతెత్తి పిలుస్తాయి. సుదూరాలు ఆమెను చెయ్యెత్తి ఆహ్వానిస్తాయి. తన ధీరోదాత్తతకు సవాల్ విసురుతాయి. తనను అయోమయానికి గురిచేసిన, అసాధ్యమ‌ని వెక్కిరించినా కూడా..  తను చేరవలసిన గమ్యం కోసం నిరంతర పదికురాలిగా అడుగులు వేస్తున్నారు. సీతక్క పార్లమెంటరీ రాజకీయాలలో పోలిక లేని మేధో శ్రమి. సీతక్కను అభినందించడమంటే ఆమె ఆదర్శానికి మన సహాకారం అందించడమే..  ప్రజల బాగోగుల కోసం ఆమె చూపిస్తున్న దారికి మన సహకారాన్ని అందించడం ..అంటే మన ప్రియమైన అమ్మకు, బిడ్డకు, సోదరికి సహకారాన్ని అందించడమే అవుతుంది. ఎవ్వరూ నడవని దారిలో మొట్ట మొదట నడిచిన వారు, కల్లోల సముద్రంలో చుక్కాని పట్టడానికి సాహసికి నీరాజనాలు పడుదాం. సీతక్కకు తన అస్తిత్వ మూలాలు, ఎదిగి వొచ్చిన వైనం పట్ల ఎరుకతోనే ఉన్నారు. సీతక్కకి సమస్తం తెలుసు ,ఇంకా తెలుసుకుంటూనే అడుగులు వేస్తుంది.. సమస్తం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అరణ్యాన్ని వెలిగించే జాబిలి గా కొనసాగుతూ ఉంటుంది.

 -అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
 9652275560

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *