ఈ రోజు మనం అనుభ విస్తున్న స్వేచ్చా, స్వాతంత్య్రానికి కార ణం స్వాతంత్య్ర ఉద్య మంలో ఎందరో మహా నుభావుల ప్రాణత్యాగం. ఈ పోరాటంలో అతి వాదుల పాత్ర చెప్పనలవి కానిది. అతివాదుల ఉద్య మానికి ఊపిరి పోయడానికి వారి ప్రాణాలనే బలి పెట్టిన వారిలో ‘‘లాల్ బాల్ పాల్’’ త్రయం పాత్ర కీలకం. వీరిలో లాలా లజపతి రాయ్ జన్మదినం జనవరి 28. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలు స్మరించుకోవడమే ఆయనకు మన మిచ్చే ఘననివాళి !
తూటాల్లాంటి ఆయన సందేశం:
‘‘ మీ మీద మీ సామర్ధ్యం మీద నమ్మకం ఉంచండి. సమాజంలో మార్పు తెచ్చే సత్తా మీలో ఉంది . అన్యాయాన్ని నిర్భయంగా ప్రశ్నించండి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ సంక్షేమం కోసం పాటుపడండి. ‘‘ ‘‘నాపై గురిపెట్టిన ప్రతి దెబ్బ బ్రిటీష్ సామ్రాజ్యవాద శవపేటికలో మేకు. నేను అలాగే ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ మీరు చింతించకండి. నా తర్వాత నా ఆత్మ స్వేచ్ఛ కోసం మరిన్ని త్యాగాలు చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది’’. అని పోరాటాల్లో పాల్గొన్న వారికి ఆయనిచ్చే సందేశం ఎందరినో ప్రేరేపించి పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఆయన ఆదర్శం భారతీయ జాతీయవాదం. దీని కోసం పనిచేశారు, బాధపడ్డారు, చివరికి తన జీవితాన్ని అర్పించారు. జాతీయవాద భావానికి తనదైన ముద్రను, కొత్త అర్థాన్ని, జాతీయోద్యమానికి కొత్త మలుపు ఇచ్చారు. ‘‘దేశభక్తి’’ అంటే స్వేచ్ఛ, న్యాయం పట్ల అపారమైన ప్రేమ, ఆత్మగౌరవం కలిగి ఉండడమే అని చెప్పారు.
పాఠశాల స్థాయిలోనే నాయకుడు:
లాలా లజపతిరాయ్ పంజాబ్ లోని ‘ధుడికే’ గ్రామంలో రాధా కిషన్, గులాబ్ దేవి దంపతులకు 1865 జనవరి 28న జన్మించారు. తండ్రి నుండి కర్తవ్యం, బాధ్యత, నిర్మొహమాటత, నిజాయితీ, త్యాగాలు, స్వాతంత్య్ర స్ఫూర్తి తన తల్లి నుండి దానం, విశాల హృదయం, సున్నితత్వం, భక్తి వంటి సుగుణాలను వారసత్వంగా పొందారు.1880 ప్రారంభంలో లుధియానాలోని మిషన్ చదువు తున్నప్పుడు ఆరోగ్యం సహకరించ పోయినప్పటికీ పాఠశాల స్థాయి నుంచే చదవడం, రాయడం, మాట్లాడటంపై మక్కువ పెంచుకోవడమే గాక ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పై ఆసక్తి చూపిస్తూ నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు.
గొప్ప వాగ్ధాటి కలిగిన వారు:
1886లో హిసార్‌కు వెళ్లి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. చురామణితో కలిసి హిసార్ బార్ కౌన్సిల్ వ్యవస్థాపక సభ్యుడు అయ్యారు. ఆర్యసమాజ్ హిసార్ జిల్లా శాఖను కూడా స్థాపించారు స్వాతంత్య్రం పొందడానికి భారతదేశ రాజకీయ విధానాన్ని రూపొందించడానికి జర్నలిజంను అభ్య సించారు. ది ట్రిబ్యూన్‌తో సహా అనేక వార్తాపత్రికలకు రెగ్యులర్ కంట్రిబ్యూటర్. 1886లో లాహోర్‌లోని జాతీయవాద దయానంద ఆంగ్లో-వేద పాఠశాలను స్థాపించడానికి మహాత్మా హంసరాజ్‌కి సహాయం చేశారు. 1905 లో భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ దేశంపై ఆయనలో ఉన్న అంకితమైన చిత్తశుద్ధి, నిస్వార్థ కార్యకర్తను గుర్తించి, భారత ప్రజల రాజకీయ సమస్యలను బ్రిటిష్ ప్రజల ముందు ఉంచే ఉద్దేశ్యంతో ప్రతినిధులలో ఒకరిగా ఎంపిక చేసింది.
గోపాల కృష్ణ గోఖలేతో కలిసి ఇంగ్లాండులోని వివిధ ప్రాంతాలలో రాజకీయ ప్రచారాన్ని నిర్వహించి భారతదేశం శ్రమిస్తున్న సహనం లేని బ్యూరోక్రాటిక్ ప్రభుత్వ దురాచారాలను బ్రిటిషర్ల దృష్టికి తీసుకువచ్చారు. గొప్ప వాక్చాతుర్యంతో వాస్తవాలు, గణాంకాలతో ‘సగం ఆకలితో అలమటిస్తున్న, సగం చనిపోతున్న భారత ప్రజల’ లక్ష్యాన్ని సమర్థించారు. ఆయన మాటలు ‘ఆంగ్లేయుల’పై విపరీతమైన ముద్ర వేశాయి. ఆ తర్వాత అమెరికాకు కూడా వెళ్లి అక్కడ అనేక విద్యా సంస్థల పనితీరును స్వయంగా చూశారు.
పంజాబ్ కేసరి:
స్వదేశీ ఉద్యమం ఊపందుకోవడంతో రాయ్ తన హృదయాన్ని, ఆత్మను అందులో ఉంచి స్వదేశీ సందే శాన్ని బోధించారు. పంజాబ్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందారు. ఇది అప్పటి బ్యూ రోక్రసీకి కోపం తెప్పి ంచింది. బ్రిటిష్, ఆంగ్లో ఇండియన్ ప్రెస్ చేత ‘విప్లవ కారుడు’గా పరిగ ణించబడ్డారు. పంజాబ్ వలస చట్టం, నీటిపారుదల రేట్లు పెంపుదలని వ్యతి రేకించాడు. ప్రభుత్వ దుర్మార్గాలను బయటపెట్టిన వార్తాపత్రిక ‘పంజాబీ’ పై విచారణ, పంజాబీల మనోభావాలను రేకెత్తించింది. ప్రభుత్వం ఎంతగానో భయపడి 1907 మే 9న లాలా లజపతిరాయ్‌ని అరెస్టు చేసి మాండలే కోటలో ఉంచింది.
విదేశీ యానం:
బ్రిటీష్ ప్రభుత్వం విదేశాలలో మన జాతీయవాద ఉద్యమానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు చేస్తున్నందున, ఏప్రిల్ 1914లో దేశ స్వాతంత్య్రం కోసం తనను తాను అంకితం చేసుకోవడానికి న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి ఇంగ్లండ్‌కు వెళ్లారు. అమెరికాలో కూడా చురుగ్గా ఉన్న బ్రిటీష్ ఏజెంట్లు చేపట్టిన ప్రచారాన్ని అతను ప్రతిఘటించడం ప్రారంభించారు.
సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ:
1920 కలకత్తా ప్రత్యేక సెషన్‌లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1921లో లాభాపేక్షలేని సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ అనే సంక్షేమ సంస్థను స్థాపించారు. కుల వ్యవస్థ, స్త్రీల స్థానం, అంటరానితనంతో హిందూ సమాజం తన స్వంత పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రా యపడ్డారు. కులం లేదా లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వేదాలను చదవ డానికి, నేర్చు కోవడానికి అనుమ తించాలని విశ్వ సించారు. 1920 సెప్టెం బరులో కల కత్తాలో జరిగిన కాం గ్రెస్ ప్రత్యేక సమా వేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వంతో సహాయ నిరాకరణ తీర్మానాన్ని ఆయన నాయకత్వంలోనే కాంగ్రెస్ ఆమోదించింది. 1921లో అరెస్టయి ఏడాది జైలు శిక్ష అనుభవించారు. 1926 జనవరిలో పండిట్ మోతీలాల్ నెహ్రూ ప్రోద్బలంతో లాలా లజపతిరాయ్ స్వరాజ్ పార్టీలో చేరి దాని ఉపనేతగా ఎన్నికయ్యారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి:
లాల్ బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ వేత్త, సామాజిక కార్యకర్త, రచయిత, పాత్రికేయుడు, వక్త. శక్తివంతమైన సంఘ సేవకుడు. చాలా ఉదారమైన పరోపకారి. ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే వ్యక్తి. 1896, 1899-1900, 1907-08 లో కరువులు,1905లో కాంగ్రాలో సంభవించిన భూకంపం సమయంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను విముక్తం చేయడంలో దేశ ప్రజలకు సేవచేయడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అలుపెరగని సేవచేసారు. లాలాజీ సెంట్రల్ హోమ్, సెంట్రల్ స్కూల్ నిర్మాణం కోసం లాహోర్ లో పెద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. 1908లో లాలాజీ సమీకరించిన కరువు నిధిలో కొంత భాగాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించారు.
కొన్ని ప్రాథమిక పాఠశాలలను కూడా ఈ నిధి నుండి వారి ప్రయోజనం కోసం నిర్వహించారు. ఒక సామాజిక కార్యకర్తగా అస్పృశ్యత, స్త్రీల అభ్యున్నతికి సంబంధించి గొప్ప సామాజిక, ఆర్థిక సిద్ధాంతకర్త. కరవు సహాయక నిర్వాహకుడిగా, కార్మికుడిగా ఆయన పోరాట పటిమ దాదాపు ప్రతి కార్యకలాపంలోనూ తన ప్రభావాన్ని చూపింది. నిరుపేద పిల్లల కోసం అనాథాశ్రమాలు ఏర్పాటు చేసిన ఆయన పథకం అధికారుల నుంచి కూడా ప్రశంసలు, గుర్తింపు పొందింది. ఈ విషయంలో లాలాజీ తన సమకాలీకులందరి కంటే సంఘ సంస్కర్తగా ఉన్నత పీఠంపై నిలబడ్డారు.
సంఘసంస్కర్త:
ఒక సంఘసంస్కర్తగా ఆయన అంటరానితనం నిర్మూలనకు కృషి చేసే దశలో ఆర్యసమాజ్ ప్రారంభించిన ఉద్యమానికి బలమైన మద్దతు ఇచ్చారు. మహాత్మాగాంధీ హరిజన సేవక్ సంఫ్‌ు ఆధ్వర్యంలో ఈ రంగంలో తన పనిని ప్రారంభించినప్పుడు, సమస్యను మరింత మెరుగ్గా ఎత్తిచూపడంతో ఆయన ఈ సంస్థలో పనిచేయడం ప్రారంభించారు. ప్రపంచంలోని ఇతర ముఖ్యమైన ఉద్యమాల మాదిరిగానే ఈ సంఘసంస్కరణ కూడా జాతీయ ఆమోదం పొందడానికి గొప్ప పోరాటం చేయాల్సి ఉందని ఆయన ప్రకటించారు.
రచయితగా:
రచయితగా కలం పట్టి విభిన్న అంశాలపై రచనలు చేసి.తన సమకాలీనులలో గొప్ప ముద్రను సృష్టించారు.1895 నుండి 1900 కాలంలో మజ్జినీ, గరీబాల్డి, శివాజీ, స్వామి దయానంద్ జీవిత చరిత్ర పుస్తకాలు రాశారు.
మరణం:
సైమన్ కమిషన్ 30 అక్టోబర్, 1928న లాహోర్‌ను సందర్శించినప్పుడు, దానికి వ్యతిరేకంగా నిరసనగా లజపత్ రాయ్ అహింసాయుతమైన మార్చ్‌కి నాయకత్వం వహించారు. పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్ నిరసనకారులపై లాఠీ ఛార్జ్ చేయించడమే కాకుండా రాయ్‌పై వ్యక్తిగతంగా దాడి చేశాడు. తన గాయాల నుండి పూర్తిగా కోలుకోలేక 17 నవంబర్ 1928 న మరణించారు.
జనక మోహన రావు దుంగ
8247045230





