పల్లవి చరణమున్న మాత్రాన
పాట విశ్వ ప్రీతము కాబోదు
తప్పిదాల కొలత నుండి
తప్పించుకునే తిప్పలే వాగ్దానాలు
రాబంధుల రాజ్యములో
పావురానికీ ఇచ్చిన వాగ్దానాలే
రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలు
వాగ్దానాల వరద
నిండిన మ్యానిఫెస్టో
నీటి పై రాతలు
అద్దము పై గీతలు
రాక్షసుల వాగ్దానాలెప్పుడు
ప్రజా రాజ్యాన్నీ ఇవ్వలేదు
వాగ్దానాల ఓదార్పు
కాదు దిశా సూచీ
మాటల
మాయాజాలముతో నేత
ఓటరు మెదడు లో
భ్రంతిని నింపేస్తాడు
కల్తీ వాక్కులను
జనం ఎక్కువ సేపు
నిలువ ఉంచుకోలేరు
విరేచనాల మందు తో
తుది తీర్పునిస్తారు
డా. ఐ. చిదానందం
చరవాణి – 8801444335





