ఉపాధి హామీ బ‌కాయిల‌ను చెల్లించండి

  • గ్రామ‌స్థాయి ఉద్యోగుల‌కూ నెల‌నెలా వేత‌నాలు ఇవ్వాలి..
  • ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు..
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 :  జాతీయ ఉపాధిహామీ పథకం కింద పెండింగ్ లో ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలను ప్రతీ నెలా ఎప్పటికప్పుడు చెల్లించాలని చెప్పారు.  గురువారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షస‌మావేశం నిర్వ‌హించారు.

ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు గ్రామ స్థాయి ఉద్యోగులకూ జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ‎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *