‘పాలల్లో నీళ్ళు బాగా కలిపేస్తున్నావ్?’ చికాకు పడుతూ అంది వో యిల్లాలు.
‘మా గేదెకూడా నీళ్ళు తాగుతుంది,’ చెప్పాడు పాలవాడు.
‘మరీ యెక్కువ నీళ్ళు తాగేస్తోంది,’ అంది యిల్లాలు.
‘ఎండాకాలం కదండీ?’ అన్నాడు పాలవాడు.
‘మీ గేదెకి గడ్డి వుంచట్లేదా?’ యిల్లాలు తగ్గలేదు.
‘అందరూ నానా గడ్డీ కరుస్తుంటే, పశువులకి గడ్డెక్కడ దొరుకుతుందీ?’ పాలవాడూ తగ్గలేదు.
‘సర్లే, నీతో నాకు వాదనెందుకు గాని మా యింట్లో నీళ్ళున్నాయి, నే కలుపుకుంటాను’ చెపుతూ వుండగానే, ‘మీకెందుకు శ్రమ?’ అని నవ్వాడు పాలవాడు.
‘నువ్వు నీళ్ళు కలిపితే నాకు లాసు’ నవ్వలేదు యిల్లాలు.
‘పెద్ద లాసు కాదు’ అన్నాడు పాలవాడు.‘ఎందుక్కాదు?’ అడిగింది యిల్లాలు.
‘లీటరు పాలు అరవై, లీటరు నీళ్ళు యిరవై, లెక్కేయండి’ నీళ్ళు వొత్తినే రావడం లేదని వాపోయాడు పాలవాడు.
-బమ్మిడి జగదీశ్వరరావు





