ఎన్ కౌంటర్, అనంతర పరిణామాలలో మన అవ్యవస్థ

దేశంలో మావోయిస్టులు లేకుండా చేసే లక్ష్యంతో పదిహేడు నెలలుగా సాగుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా ఛత్తీస్ గడ్ నారాయణపూర్ జిల్లా గుండె కోట్ లో మే 21న జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావుతో సహా 28 మంది చనిపోయారు. ఈ ఎన్ కౌంటర్, దాని తర్వాత వారం రోజులుగా జరుగుతున్నా పరిణామాలు మన వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో, అసలు అవ్యవస్థే వ్యవస్థగా భ్రమలు కల్పిస్తున్నదో చూపుతున్నాయి. ఇది దేశం మొత్తానికీ, పొరుగు రాష్ట్రాలకూ సంబంధించిన వ్యవహారం అనిపించవచ్చు గాని ఈ ఘటనలో ఇద్దరు ఉన్నత విద్యావంతులైన తెలంగాణ బిడ్డలు అసువులు బాశారు. ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు బిడ్డలు మరణించారు. అలాగే విప్లవకారుల గురించి దేశంలో ఎక్కడ ఏమి జరిగినా దాని ప్రతిస్పందనలు, ప్రకంపనలు, పర్యవసానాలు తెలంగాణలో కూడా ఉంటాయి. అంతేకాదు, ఇక్కడ మరణాలు, మరణానంతరం మనిషి పట్ల వ్యవహరించవలసిన తీరు అనే నాగరికతా అంశాలు ఇమిడి ఉన్నాయి గనుక తప్పనిసరిగా ఇది తెలంగాణార్థంలో చర్చించవలసిన విషయమే.

ఈ ఎన్ కౌంటర్ ఘటన మన వ్యవస్థను, అవ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఎన్నో సూచనలు వదులుతున్నది. ఈ ఘటన మన పాలకుల కార్పొరేట్ దాస్యానికి తిరుగులేని రుజువులు ప్రకటిస్తున్నది. ఈ ఘటన ప్రభుత్వం ప్రజలను ఎంత ఎక్కువగా వంచించడానికి, అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నదో చూపుతున్నది. ఈ ఘటన మతాన్నీ,  సంప్రదాయాన్నీ, సనాతన ధర్మాన్నీ పాటిస్తున్నామని చెప్పేవారికి కనీసమైన మత, సాంప్రదాయిక, ధార్మిక భావనలు ఎట్లా లోపించాయో చూపుతున్నది. ఈ ఘటన అధికార పీఠాల మీద ఉన్నవారు విధ్యుక్తధర్మం ప్రకారం తటస్థంగా ఉండవలసి ఉండగా ఎంతగా వ్యక్తిగత కక్షలతో, కార్పణ్యాలతో ప్రవర్తిస్తున్నారో చూపుతున్నది. ఈ ఘటన విప్లవోద్యమం గురించి కొందరు ప్రచారం చేస్తున్న అపోహలను, అబద్ధాలను పటాపంచలు చేస్తున్నది.

సరిగ్గా ఈ ఎన్ కౌంటర్ వార్త వచ్చిన రోజే కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో రెండు వేల మూడు వందల ఎకరాలలో ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లు నరికివేసి, అక్కడి ఇనుప ఖనిజం తవ్వి తీసి, శుద్ధి చేసే కర్మాగారం స్థాపించుకోవడానికి ఒక కార్పొరేట్ కంపెనీకి అనుమతి ఇచ్చిందనే వార్త వచ్చింది. ఒక ఇంగ్లిష్ దినపత్రిక ఈ రెండు వార్తలకూ మధ్య సంబంధం చెప్పడానికా అన్నట్టుగా పక్కపక్కనే వేసింది. అంటే భారత ప్రభుత్వం తన ఆశ్రితులైన (లేక నిజమైన యజమానులో?!) కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశ సంపదలు కట్టబెట్టే మహా యజ్ఞాన్ని నిర్లజ్జగా కొనసాగించదలచుకున్నదనీ, ఆ యజ్ఞానికి అడ్డు తగులుతున్న ఆదివాసులనూ, మావోయిస్టులనూ హత మార్చదలచుకున్నదనీ ఈ ఘటన ప్రత్యేకంగా, ఆపరేషన్ కగార్ మొత్తంగా చూపుతున్నాయి. ఇలా మనుషులను మట్టుపెట్టే నీటిలో రాజ్యాంగాన్నీ,  చట్టాలనూ, ప్రజాస్వామ్యాన్నీ,  మానవతనూ కూడా ఉక్కుపాదంతో నలిపేయదలచుకున్నదని కూడా  ఈ ఘటన చూపుతున్నది. కాల్పుల విరమణ ప్రకటించి, చర్చలకు పిలుపునిచ్చిన పార్టీ అగ్రనాయకుడు దొరికితే ఆ అవకాశాన్ని చర్చలకు వాడుకోకుండా, తుదముట్టించడమే పనిగా పెట్టుకున్నదంటే ఈ ప్రభుత్వానికి కార్పొరేట్ల సేవ తప్ప మరొక ఆలోచనే లేదని స్పష్టమవుతున్నది.

సరిగ్గా ఈ ఎన్ కౌంటర్ వార్త వచ్చిన రోజే కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో రెండు వేల మూడు వందల ఎకరాలలో ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లు నరికివేసి, అక్కడి ఇనుప ఖనిజం తవ్వి తీసి, శుద్ధి చేసే కర్మాగారం స్థాపించుకోవడానికి ఒక కార్పొరేట్ కంపెనీకి అనుమతి ఇచ్చిందనే వార్త వచ్చింది. ఒక ఇంగ్లిష్ దినపత్రిక ఈ రెండు వార్తలకూ మధ్య సంబంధం చెప్పడానికా అన్నట్టుగా పక్కపక్కనే వేసింది. అంటే భారత ప్రభుత్వం తన ఆశ్రితులైన (లేక నిజమైన యజమానులో?!) కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశ సంపదలు కట్టబెట్టే మహా యజ్ఞాన్ని నిర్లజ్జగా కొనసా గించదలచుకున్నదనీ, ఆ యజ్ఞానికి అడ్డు తగులుతున్న ఆదివాసులనూ, మావోయిస్టులనూ హతమార్చదలచుకున్నదనీ ఈ ఘటన ప్రత్యేకంగా, ఆపరేషన్ కగార్ మొత్తంగా చూపుతున్నాయి.

రెండు నెలల ముందే ఒకవైపు మారణకాండ జరుపుతూనే ఛత్తీస్ గడ్ లోని బైలదిల్లా గనులను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి లాక్కొని ఆర్సెలార్ మిత్తల్ అనే ప్రైవేటు కార్పొరేట్ కు అప్పగించారు. 2026 మార్చ్31 నాటికి మావోయిస్టు రహిత భారతదేశం తయారుచేస్తామనే ప్రగల్భాలైనా, ఆపరేషన్ కగార్ మారణ కాండ అయినా పాలకుల కార్పొరేట్ దాస్యానికి, దేశ సంపదను దేశ ప్రజలకు అందకుండా దొంగిలించి, కార్పొరేట్లకు పంపిణీ చేయడానికి మారుపేర్లు మాత్రమే అని తాజా ఎన్ కౌంటర్ ద్వారా మరొకసారి రుజువవుతున్నది.

ఇక ఈ ఘటనలో ప్రభుత్వం చెప్పిన, చెపుతున్న అబద్ధాలకు లెక్కలేదు. మొట్టమొదట ఈ ఎన్ కౌంటర్ కచ్చితంగా ఎక్కడ జరిగిందో చెప్పకుండా దాచిపెట్టారు. తర్వాత మృతుల పేర్లు విడుదల చేయడానికి జాప్యం చేశారు. మృతదేహాలు తెచ్చుకోవడానికి తెలంగాణ నుంచీ, ఆంధ్రప్రదేశ్ నుంచీ వెళ్లిన కుటుంబ సభ్యులను నాలుగు రోజుల పాటు రేపు మాపు అంటూ అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. కుటుంబ సభ్యులు మరణించిన దుఃఖంలో నిస్సహాయంగా ఉన్న వాళ్లను అక్కడ హాస్పిటల్  ముందు, పోలీసు స్టేషన్ల ముందు పడిగాపులు పడేలా చేసి, చివరికి మృతదేహాలు ఇవ్వబోమని చెప్పారు. ‘మృతదేహాలు ఇమ్మని చట్టబద్ధమైన హక్కుదార్లు ఎవరూ రాలేదు గనుక మేమే దహనం చేస్తున్నాము’ అని ఒక ఐపిఎస్ అధికారి పత్రికలవారికి లిఖిత పత్రం చదివి వినిపించాడు. అదే అధికారి ముందు మృతులలో కనీసం ఇద్దరి తండ్రులు, ముగ్గురి సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు నాలుగు రోజులుగా ఉండగా, స్థానిక పోలీసుల దగ్గరి నుంచి వారు తీసుకుపోయిన బంధుత్వ పత్రాలు, గుర్తింపు పత్రాలు, వారిని అనేక సార్లు ప్రశ్నించి రాసుకున్న వివరాలు ఉండగా ప్రభుత్వ అధికారులు ఇంత పచ్చి అబద్ధాలు ప్రకటించడం సంఘ్ పరివార్ పాలనకే చెల్లింది.

నిజానికి సంఘ్ పరివార్ తమకు మతం మీద, ధర్మం మీద, సంప్రదాయం మీద మిగిలినవారికెవరికీ లేనంత విశ్వాసం ఉందని చెప్పుకుంటుంది. మరి మరణించిన వారి పట్ల గౌరవం చూపాలని ప్రతి మతమూ చెపుతుంది. హిందూ మతం మరింత ఎక్కువగా చెపుతుంది. రామాయణంలో రావణుడు చనిపోయిన తర్వాత స్వయంగా రాముడే ‘మరణంతో వైరం అంతమవుతుంది. నా విధ్యుక్త ధర్మం నిర్వర్తించాను గాని నీ సోదరుడు నీకెంతో, నాకూ అంతే. అంతిమ సంస్కారాలు నిర్వహించు’ అని విభీషణుడితో అన్నాడని వాల్మీకి రాశాడు.

ఎవరైనా చనిపోగానే వారితో ఘర్షణ అంతా రద్దయిపోతుందనీ, వారికి చివరి నమస్కారం పెట్టడానికి, వారిని కడసారి చూపు చూడడానికి వెళ్లాలని మనలో ప్రతి ఒక్కరమూ అనుకుంటాం. దారిన వెళుతున్నప్పుడు తెలియని వ్యక్తి మృతదేహపు ఊరేగింపు ఎదురు వచ్చినా ఒక క్షణం గౌరవంగా ఆగుతాం. నమస్కారం పెడతాం. పూలు చల్లుతాం, పూలదండ వేస్తాం. తెలిసినవారైతే ఊరేగింపులో పాల్గొంటాం, పాడెకు భుజం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. దహనమైతే చితి మీద ఒక కర్ర పెడతాం. ఖననం అయితే పిడికెడు మట్టి చల్లుతాం. ఇదీ మతంతో సంబంధం లేకుండా, నాస్తికులైనా సరే పాటించే అంతిమ సంస్కార మర్యాద. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే సంఘ్ పరివార్ ప్రభుత్వానికి ఈ సంస్కారం లేదని ఛత్తీస్ గడ్ ప్రభుత్వం, పోలీసులు, వారిని నడిపిన అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం చూపుకున్నారు. నంబళ్ల కేశవరావు సోదరులు రాజకీయాలు ఉన్నవారేమీ కాదు. వారు, వారి కుటుంబ సభ్యులు ఒకటికి రెండు సార్లు తమ హిందూ ధర్మం ప్రకారం, తమ పూర్వీకులను దహనం చేసిన దగ్గర, తమ గోత్రీకులందరూ కలిసి దహనం చేసుకుంటామని, అంత్యక్రియలు జరుపుకుంటామని అడిగారు. అయినా సరే సంఘ్ పరివార్ ప్రభుత్వం ఈ మతాచారాల అంతిమ సంస్కారాన్ని కూడా ఒప్పుకోలేదు.

రామాయణంలో ఏమున్నదో అలా ఉంచి, ఎవరైనా చనిపోగానే వారితో ఘర్షణ అంతా రద్దయిపోతుందనీ, వారికి చివరి నమస్కారం పెట్టడానికి, వారిని కడసారి చూపు చూడడానికి వెళ్లాలని మనలో ప్రతి ఒక్కరమూ అనుకుంటాం. దారిన వెళుతున్నప్పుడు తెలియని వ్యక్తి మృతదేహపు ఊరేగింపు ఎదురు వచ్చినా ఒక క్షణం గౌరవంగా ఆగుతాం. నమస్కారం పెడతాం. పూలు చల్లుతాం, పూలదండ వేస్తాం. తెలిసినవారైతే ఊరేగింపులో పాల్గొంటాం, పాడెకు భుజం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. దహనమైతే చితి మీద ఒక కర్ర పెడతాం. ఖననం అయితే పిడికెడు మట్టి చల్లుతాం. ఇదీ మతంతో సంబంధం లేకుండా, నాస్తికులైనా సరే పాటించే అంతిమ సంస్కార మర్యాద. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే సంఘ్ పరివార్ ప్రభుత్వానికి ఈ సంస్కారం లేదని ఛత్తీస్ గడ్ ప్రభుత్వం, పోలీసులు, వారిని నడిపిన అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం చూపుకున్నారు. నంబళ్ల కేశవరావు సోదరులు రాజకీయాలు ఉన్నవారేమీ కాదు. వారు, వారి కుటుంబ సభ్యులు ఒకటికి రెండు సార్లు తమ హిందూ ధర్మం ప్రకారం, తమ పూర్వీకులను దహనం చేసిన దగ్గర, తమ గోత్రీకులందరూ కలిసి దహనం చేసుకుంటామని, అంత్యక్రియలు జరుపుకుంటామని అడిగారు. అయినా సరే సంఘ్ పరివార్ ప్రభుత్వం ఈ మతాచారాల అంతిమ సంస్కారాన్ని కూడా ఒప్పుకోలేదు.

ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ్యుడు అచ్చన్నాయుడు కూడా మృతదేహాలు తమ తమ ఊళ్లకు రాకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది. గత కొన్ని దశాబ్దాలుగా విప్లవోద్యమం వైపు నుంచి జరిగిన సాయుధ చర్యలన్నిటికీ కేశవరావే బాధ్యుడన్నట్టుగా పోలీసులు చేసిన ప్రచారంతో, చంద్రబాబు నాయుడు తన మీద జరిగిన అలిపిరి దాడికీ, అచ్చన్నాయుడు తన అన్న ఎర్రన్నాయుడు మీద జరిగిన సింగుపురం దాడికీ కేశవరావే కారణమని అనుమానిస్తున్నట్టుంది. ఒకవేళ అది నిజమైనా, అధికారిక పదవిలో ఉన్నవారు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వీలు లేదు.

ఇదంతా నంబళ్ల కేశవ రావు తల్లి భారతమ్మ తన కొడుకు మృతదేహానికి గౌరవప్రదమైన అంత్యక్రియలు జరపడానికి తనకు అప్పగించాలి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత జరిగింది. అసలు ఒక తల్లి అలా న్యాయస్థానాన్ని అడగవలసి రావడమే దుర్మార్గం అంటే, ఆ కోర్టు ముందర ‘పోస్ట్ మార్టం జరుగుతున్నది. కాగానే కుటుంబ సభ్యులకు ఇస్తాము’ అని ఛత్తీస్ గడ్ అడ్వకేట్ జనరల్ చెప్పిన తర్వాత కూడా మృతదేహాలను ఇవ్వలేదంటే మన ప్రభుత్వాలకు, అధికారులకు మాటకు నిలబడే పట్టింపు మాత్రమే కాదు, మానవసహజమైన ఉద్వేగాలు, సత్య నిష్ఠ, రాజ్యాంగం పట్ల గౌరవం కూడా లేవని అర్థమవుతున్నది.

ఇక ఇటీవలి కాలంలో విప్లవోద్యమం ఎవరినీ ఆకర్షించడం లేదనీ, ముఖ్యంగా విద్యావంతులు అటువైపే చూడడం లేదనీ, విప్లవోద్యమం అడవి ప్రాంతాలకు, ఆదివాసులకు కుదించుకు పోయిందనీ కొందరు మేధావులు ప్రవచిస్తున్న రోజులల్లో గుండె కోట్ ఎన్ కౌంటర్ తెలుగు రాష్ట్రాల నుంచి గత పది సంవత్సరాలలో విప్లవోద్యమం లోకి వెళ్లిన విద్యావంతులను చూపింది. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన 28 మందిలో 23 మంది ఆదివాసులే. కాని మిగిలిన అయిదుగురిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు, ఇద్దరు తెలంగాణకు చెందినవాళ్లు.

ఇక ఇటీవలి కాలంలో విప్లవోద్యమం ఎవరినీ ఆకర్షించడం లేదనీ, ముఖ్యంగా విద్యావంతులు అటువైపే చూడడం లేదనీ, విప్లవోద్యమం అడవి ప్రాంతాలకు, ఆదివాసులకు కుదించుకు పోయిందనీ కొందరు మేధావులు ప్రవచిస్తున్న రోజులల్లో గుండె కోట్ ఎన్ కౌంటర్ తెలుగు రాష్ట్రాల నుంచి గత పది సంవత్సరాలలో విప్లవోద్యమం లోకి వెళ్లిన విద్యావంతులను చూపింది. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన 28 మందిలో 23 మంది ఆదివాసులే. కాని మిగిలిన అయిదుగురిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు, ఇద్దరు తెలంగాణకు చెందినవాళ్లు.

తెలంగాణ నుంచి ఇద్దరిలో ఒకరు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేముల నర్వ గ్రామానికి చెందిన వన్నాడ విజయలక్ష్మి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం ఎ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి, ఎల్ ఎల్ బి చదువుతూ 2014లో అజ్ఞాతవాసానికి వెళ్లారు. విద్యార్థి దశలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆమె ఎంత చురుగ్గా పాల్గొన్నదో ఇప్పుడు ఎందరో తమ జ్ఞాపకాలు పంచుకుంటున్నారు. దండకారణ్య విప్లవోద్యమం లోకి వెళ్లాక తన తొలిరోజు అనుభవం గురించి ఆమె 2014 డిసెంబర్ లో రాసిన వ్యాసం వసంతమేఘం వెబ్ సైట్ మీద అచ్చయింది.

మరొకరు హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం చింతగట్టు ఎస్సీ కాలనీకి చెందిన బూర రాకేశ్. ఆయన 2016లో వరంగల్ సి కె ఎం కాలేజీలో ఎంసిఎ చదువుతూ అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన రాకేశ్ తండ్రి రిక్షా కార్మికుడు. తల్లి రోజుకూలీ. దళితులుగా అగ్రకులాలతో ఎన్నో అవమానాలకు గురయ్యారు, పోరాడారు. రాకేశ్ మేనమామ ఒకప్పుడు విప్లవ పార్టీ సానుభూతిపరుడుగా ఉండేవాడు. అది తెలిసిన పోలీసులు ఆయన  ద్వారా పార్టీ నాయకులకు విషాహారం తినిపించడానికి, విషం కలిపిన లడ్డూలు పంపించాలని ఒత్తిడి చేశారు. అటువంటి ద్రోహం చేయలేక, పోలీసుల ఒత్తిడికి భయపడి, తల్లిదండ్రులతో సహా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తండ్రి మరణించాడు, తల్లి చూపు పోయింది. ఆయన అతికష్టం మీద బతికాడు. ఇటువంటి దుర్భర జీవితం నుంచి, దళితుడుగా అస్పృశ్యత, అవమానాలు, పేదరికం, మేనమామ మీద పోలీసుల ఒత్తిడి—అన్నీ కలిసి రాకేశ్ ను ఉన్నత కంప్యూటర్ విద్యను, దానితో రాగల భద్రమైన ఉద్యోగ జీవితాన్ని కూడా వదిలి విప్లవోద్యమం వైపు వెళ్లేలా చేశాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి నంబళ్ల కేశవరావు వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో బి టెక్, ఎం టెక్ చదివి నలబై ఐదు సంవత్సరాలుగా విప్లవోద్యమంతో ఉన్నాడు. చీరాల సమీపంలోని జాండ్రపేటకు చెందిన సజ్జా నాగేశ్వర రావు పాలిటెక్నిక్ చదివి మూడున్నర దశాబ్దాల కిందనే విప్లవోద్యమంలోకి వెళ్లాడు. కర్నూలుకు చెందిన లలిత పదిహేను సంవత్సరాలుగా విప్లవోద్యమంతో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *