యుద్ధాన్ని నిలప‌గ‌లిగేది చ‌మురు ధ‌ర‌లు మాత్ర‌మే!

“ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే. ఈ యుద్ధంలో సహేతుకత ఎంత అనేదాన్ని నేను ప్రశ్నించడం లేదు. కాకపోతే ఇంతటి ఘోర తప్పిదం (స్కూల్‌పై దాడి) జరిగిన తర్వాత ఈ యుద్ధాన్ని ఎందుకు ముగించలేదనేదే నా ప్రశ్న. మూడు క్షిపణులతో 100 మంది అమాయకులైన స్కూల్ పిల్లలను హతమార్చి, “అపారనష్టం” అని పేర్కొంటున్న ఈ ప్రపంచం జీవించడానికి ఎంతమేర అర్హమైనదనే ప్రశ్న ఉత్పన్నతమవుతుంది. ఇది కూడా “నిర్లిప్త హేతుబద్ధ దృక్పథం” మాత్రమే..”

– మను జోసెఫ్
జర్నలిస్ట్, నవలిస్ట్ ,
‘డిఆక్యుపైడ్’ నెట్ ఫ్లిక్స్ సిరీస్ నిర్మాత
‘ ది మింట్ ‘ సౌజన్యంతో

ఇరాన్ పిల్లల కంటే తోమహాక్ క్షిపణి ఎత్తు నాలుగురెట్లు ఎక్కువ! ఇది 400 కిలోల వార్‌హెడ్‌ను మోసుకొని గంటకు రెండువేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భూమికి 30 నుంచి 50 మీటర్ల ఎత్తున సమాంతరం గా ప్రయాణించగలదు. దీనికి తాను ఛేదించాల్సిన లక్ష్యం ఏదో స్పష్టంగా తెలుసు. అయితే మార్గమధ్యంలో లక్ష్యాన్ని మార్చే వెసులుబాటుండటం ఈ క్షిపణి ప్రత్యేకత. ఫిబ్రవరి 28న అమెరికా ప్రయోగించిన తోమహాక్ క్షిపణి దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలోని షాజరేహ్ తయ్యబా బాలికల ప్రాథమిక పాఠశాలపై పడింది. ఈ క్షిపణి విలువ మిలియన్ డాలర్లు. ఈ పాఠశాలపై పడిన అత్యంత ఖర్చుతో కూడిన క్షిపణి కూడా ఇదే. మొదటి క్షిపణి దాడిలో కొందరు పిల్లలు, టీచర్లు మరణించడగా కొందరు గాయపడి ప్రాణాలతో ఉన్నారు . మిగిలినవారు గాయపడిన వారిని హాస్పిటల్ తరలిచేందుకు సహాయ కార్యక్రమాలు చేపడుతుండగానే మరో తోమహాక్ క్షిపణి స్కూల్‌పై దాడిచేసింది. ఫలితంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నవారు, గాయపడిన వారు అంతా మరణించారు. ఇదొక “డబుల్ టాప్‌”! అంటారు. తర్వాత మూడోది కూడా దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్ అందించిన సమాచారం ప్రకారం ఈ దాడిలో 175 మంది మరణించగా వీరిలో చాలా మంది పాఠశాల విద్యార్థినులు. తర్వాత ప్రసారమైన వీడియోల్లో, స్కూలు శిథిలాలను తొలగిస్తుండగా పిల్లల తల్లిదండ్రుల రోదనలు మిన్నుముట్టిన సంఘటనలు స్పష్టంగా కనిపించాయి.

మొట్టమొదట ఈ సంఘటనపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇది ఇరాన్ ప్రయోగించిన క్షిపణేనని, గురితప్పి తమ స్కూల్‌పైనే పడి పేలి పిల్లల మరణాలకు కారణమైందని ఆరోపించారు. యు.ఎస్. సైన్యం తన ప్రాథమిక నివేదికలో ఈ క్షిపణి పొరపాటున స్కూల్‌పై పడిందని వివరణ ఇచ్చింది. నిజానికి ఈ స్కూల్, ఇరాన్ సైనిక భవనాలకు అతి సమీపంలో ఉంది . “ఈ స్కూల్ భవనం కూడా ఒకప్పుడు సైనిక భవన నిర్మాణమే. అయితే దీన్ని స్కూల్‌గా మార్చినప్పటికీ, ప్రయోగించిన తోమహాక్ క్షిపణిలో పాత డేటాయే ఉండటం ఈ దాడికి కారణమని” యు.ఎస్. సైన్యం వివరణ ఇచ్చింది. ఈ విషాదం తర్వాత కూడా యుద్ధం కొనసాగుతోంది. ఈ స్కూల్లో ఏం జరిగిందన్న అంశాన్ని పట్టించుకోవడం మానేసేంత కాఠిన్య హృదయంతో ఈ ప్రపచం ఉంది. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంత స్థాయి వాస్తవికతలో ఉన్న ప్రపంచానికి ఈ సంఘటన పెద్ద ప్రాధాన్యమైనదిగా కనిపించకపోవడం విషాదం. ఈ ప్రపంచానికి ఎంతగా పట్టింపు లేకపోయినా, పొరపాటున ఒక స్కూల్‌పై బాంబింగ్ జరిగినప్పుడు “అయ్యో” అని ఒక నిట్టూర్పు విడిచి ముందుకు సాగిపోయేంతటి పట్టింపులేని ధోరణి తగదు. ఎంతకాదన్నా నైతికత అనే ఆదర్శాన్ని ఎప్పుడూ మరువకూడదు. తన సైన్యం పొరపాట్లను అమెరికా ఒప్పుకుంటుంది కానీ, అందుకు క్షమాపణ చెప్పే అలవాటు దానికి లేదు. ఎంతటి వాస్తవిక ప్రపంచమైనా స్కూల్‌కు హాజరైన వందకు పైగా పిల్లలను చంపేసిన తర్వాత కూడా ఈ యుద్ధాన్ని కొనసాగించే నైతికత ఎంతమాత్రం లేదన్నది అక్షర సత్యం.

ఈ యుద్ధంలో ప్రమాదవశాత్తు బాంబింగ్ చేయడం వల్ల అమాయకులైన పిల్లలు మరణించిన ఈ సంఘటన ఎందుకు కీలకమైందనే ప్రశ్నకు మనం ఎందుకు హేతుబద్ధతను ఆపాదించడంలేదు? ట్రంప్ నేటి యుగానికి సంబంధించి ఒక కార్యవాదానికి ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన నైతిక విలువల ఉనికిని ఖండించడు. కానీ తన చుట్టూ ఉన్న మేధావులకు వ్యతిరేకం కాని తనదైన శైలి విలువలను సృష్టిస్తాడు! ట్రంప్‌కు అత్యంత సన్నిహిత సలహాదారు స్టీఫెన్ మిల్లర్ మాట్లాడుతూ తమ సిద్ధాంతాన్ని చాలా కూల్‌గా చెప్పారు. “మనం బలవంతుడిదే రాజ్యమనే ప్రపంచంలో జీవిస్తున్నాం. ప్రపంచం ఆవిర్భవించిన దగ్గరి నుంచీ ఇవే చట్టాలు నడుస్తున్నాయి. ఈ నిబంధనలను కాదని ముందుకు పోవడం సాధ్యం కాదు”. ఈ సరికొత్త ప్రపంచంలోని మధ్యతరగతి, ధనిక వర్గాల గురించిన ప్రస్తావన ఆయన వ్యాఖ్యల్లో ఉంది . ప్రతి వ్యక్తి తనను తాను “వాస్తవిక ధోరణి” కలిగిన వాడిగా పరిగణించడమే కాకుండా, ఏదో ఒకనాడు ఆకస్మికంగా “ఆత్మజ్ఞానం” కలుగుతుందన్న భావనలో ఉండిపోతున్నారు. మిల్లర్ ఇంకా కొనసాగిస్తూ, “బలవంతుడు, బలహీనమైన వారి భద్రతను చూడాలన్న ఆలోచన జంతువులకు ఉండదు. ఇది మొదట్నుంచీ ఉన్నదే”. ఈ ఆదర్శవాదం చాలా కఠినమైంది. దీని ప్రతిపాదకులు పరీక్ష దశలో వంచకులుగా అవహేళనకు గురయ్యారు.

హితాహిత పట్టింపులేని వారు చేసే యుద్ధాలన్నీ ఏమాత్రం ఆలోచించకుండా చేస్తున్నవని అర్థం కాదు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం చూస్తే ఆలోచనా రహితంగా చేసేది కాదనేది స్పష్టం. వీరి ఆలోచనలోని హేతుబద్ధతను ఒక్కసారి అవలోకిస్తే, అమెరికా, ఇజ్రాయిల్ నాయకులు నిర్వహించిన ఈ 12 రోజుల యుద్ధంలో, కేవలం ఇరాన్‌ను అణ్వ‌స్త్రదేశం కాకుండా నిరోధించే లక్ష్యమే కనిపిస్తుంది. మరి అణ్వాయుధాలను తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇరాన్ ఎందుకున్నది? దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ గతంలో అన్న మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. “ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలను కలిగివుంటే, బహుశా అమెరికా`ఇజ్రాయిల్‌లు దాడిచేసి ఉండేవి కావు”. 2023 అక్టోబర్ నెలలో ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడులు చేసి 1200 మందిని హతమార్చి, 250 మందిని బందీలుగా పట్టుకున్నందుకు ప్రతీకారంగా, ఆ సంస్థకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నందుకు ఇరాన్‌పై ఈ దాడులు నిర్వహించేవారు. అయితే హమాస్ దాడుల తర్వాత గాజాపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 70వేల మంది మరణించారు.

వీరిలో అత్యధిక సంఖ్యాకులు మహిళలు, పిల్లలే! అందువల్ల ఇది ఆలోచన లేకుండా చేస్తున్న యుద్ధం కాదు. ఇప్పుడు గాజాలో నివసించని ప్రజల సానుభూతిని పొందాలని ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది. అందుకనే ఈసారి గతంలో ఎన్నడూ లేని రీతిలో గాజాలో విజయం సాధించింది. ఇదే సమయంలో ఈ ఉగ్రవాదులకు స్పాన్సరర్‌గా ఉన్న ఇరాన్ ను నాశనం చేయాలని సంకల్పించింది. ఈ దృక్కోణంలో ఆలోచించినప్పుడు అమెరికా-ఇజ్రాయిల్ దేశాలు ఆలోచనా రహితంగా ఈ యుద్ధాన్ని చేస్తున్నాయనుకోవడం పొరబాటు. ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే. ఈ యుద్ధంలో సహేతుకత ఎంత అనేదాన్ని నేను ప్రశ్నించడం లేదు. కాకపోతే ఇంతటి ఘోర తప్పిదం (స్కూల్‌పై దాడి) జరిగిన తర్వాత ఈ యుద్ధాన్ని ఎందుకు ముగించలేదనేదే నా ప్రశ్న. మూడు క్షిపణులతో 100 మంది అమాయకులైన స్కూల్ పిల్లలను హత మార్చి, “అపారనష్టం” అని పేర్కొంటున్న ఈ ప్రపంచం జీవించడానికి ఎంతమేర అర్హమైనదనే ప్రశ్న ఉత్పన్నతమవుతుంది. ఇది కూడా “నిర్లిప్త హేతుబద్ధ దృక్పథం” మాత్రమే.

ఈ భావోద్వేగానికి సంబంధించిన ఈ అంశానికి ప్రతిగా మరో వాదన కూడా వినిపించవచ్చు. “ఒకవేళ స్కూల్‌పై దాడి జరిగిన కారణంగా ఈ యుద్ధాన్ని నిలుపు చేసినట్లయితే, దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని దుష్పరిపాలక ప్రభుత్వాలు కూడా ఇటువంటి స్కూళ్లను అడ్డం పెట్టుకొని తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయి”. గతంలో సైనిక భవనాన్ని స్కూల్‌గా మార్చేయడం వల్ల ఈ దాడి ప్రమాదవశాత్తు జరిగిందని యు.ఎస్. సైన్యం ఇస్తున్న వివరణలో లోపం ఉన్నదనిపిస్తుంది. కేవలం ఈ దాడిని ముందుగా డిజైన్ చేసిన విధంగా చేసి ఉండవచ్చు. శత్రువు పిల్లలు లేదా మహిళలను తమకు రక్షణగా ముందు నిలపవచ్చు. అటువంటప్పుడు వారిపై కాల్పులు జరపలేరు. అందువల్ల హేతుబద్ధంగా ఆలోచించేవారు దీన్ని ఎదుర్కొనేందుకు మరో మార్గాన్ని అన్వేషించాలి. ఇప్పుడు వందమంది స్కూల్ పిల్లలు మరణించినందువల్ల ఈ యుద్ధం ఆగబోదు. పెరిగే చమురు ధర మాత్రమే దీన్ని నిలువరించలగలదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *