2019-20 మధ్య తెలుగు సాహిత్యంలో ఇప్పటివరకూ వచ్చిన క్వీర్ కథలు పోగుచేసి అచ్చువేసే పనిని తలకెత్తుకున్నాను. కాని అవన్నీ కలిపినా మొత్తంగా 20 కథలు కూడా దాటలేదు. తొలిదశలో ఎక్కువగా ఊహలు, అపోహలతో రాసిన కథలే ఉన్నాయి. చైతన్య పింగళి, హరిత, మానస ఎండ్లూరి రాసేవరకూ పెద్దగా క్వీర్ సెంట్రిక్ కథలు లేవు. అంతకు ముందువి క్వీర్ గొంతుకలతో కాక “othering” గొంతుకతోనే ఉన్నాయి.
పోగుచేసిన కథలన్నీ ఒకచోట చేర్చాక ‘రచన ముద్రబోయిన’ను చదివి అభిప్రాయం చెప్పమని అడిగితే- అవి పెద్దగా క్వీర్ వ్యక్తుల జీవితాలమీద లేవని, జనాంతికంగా ఊహించుకుని రాసినవే కాని వారిని గురించి కొత్త విషయాలు తెలియజేసేవిగా లేవని చెప్పారు.
దానితో వాటిని ప్రచురించడం విరమించుకున్నాను. కాని వెంటనే క్వీర్ వ్యక్తుల కోసం ఒక ఆన్లైన్ కథా వర్కషాప్ నిర్వహించాము. క్వీర్ వ్యక్తుల జీవితంలో ఉండే సంక్షోభం వలన, ప్రధాన స్రవంతిలో ఉన్న రచయితలకు క్వీర్ వ్యక్తులకు మధ్య సంబంధాలు పెంచే అనుకూలమైన వాతావరణం కొరవడడం, అన్నింటికన్నా ముఖ్యంగా క్వీర్ వ్యక్తుల జీవితాన్ని పాఠకుల ముందు పరిచేందుకు సరైన పదసంపద లేకపోవడం వలన తెలుగులో ఇంకా క్వీర్ సాహిత్య ప్రభంజనం మొదలవలేదనిపిస్తోంది. దీనికొరకు ఇంకా ఎన్నో సమావేశాలు, స్నేహాలు, వెసులుబాట్లు రావలసి ఉంది.






ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల