‘‘తెలంగాణలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసవాద రాజకీయ సంస్కృతికి చరమగీతం పాడి నూతన రాజకీయ సంస్కృతికి అంకురార్పణ చేయడంలో తెలంగాణ పౌర సమాజం పాత్ర వెలకట్టలేనిది. కానీ తెలంగాణ ప్రజల పోరాటాలకనుగుణంగా బారాస పార్టీ తన రాజకీయ సంస్కృతిని కొనసాగించలేకపోయింది. అదే పౌర సమాజం దశాబ్ద కాలపు అకృత్యాలు, ఆగడాలను, విధ్వంసాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచడంలో 2023 ఎన్నికల సందర్భంలో పట్నం నుంచి పల్లె దాకా ముఖ్య భూమికను పోషించింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలు పోగా ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 6 మాత్రమే. కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నైరాశ్యంలో ఉన్నది. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజాక్షేత్రంలో ఉన్న సంఘటనలు చాలా అరుదు. పదేళ్ల లో ప్రజలు విసిగి వేసారి పోయి ఉన్నారు. ప్రజలకు అండగా నిలబడాల్సిన రాజకీయ పార్టీలు వాటి పాత్రను అవి నిర్వహించలేకపోయాయి.’’
దశాబ్ద కాలపు నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఏడాది పూర్తయింది. గత పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ పౌర సమాజం అనేక రకాల చేదు అనుభవాలను చవిచూశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులను, ఇసుక మాఫియాకు అడ్డు తగిలిన నేరెళ్ల బాధితుల పై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ, చర్లగూడెం రిజర్వాయర్ భూని ర్వాసితులపై ప్రయోగించిన లాఠీ చార్జీలు, ఆచార్య కోదండరామ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టిన తీరు, గద్దర్ పట్ల వ్యవహరించిన తీరు, మంద కృష్ణ మాదిగ అరెస్ట్, విమలక్క అరెస్ట్, తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడులు, వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి అనేకమంది హక్కుల గొంతుకలపై ప్రయోగించిన నిర్భంధం, అనేక పౌర సమాజ సంస్థలపై నిషేధం, నిర్భంధం, అధికార పార్టీ నేతల ఆగడాలు, దోపిడీ పాలన, అనాటి అధికార పార్టీ చేతులలో పోలీసు వ్యవస్థ అతి జోక్యం, ధర్నా చౌక్ ఎత్తివేత, న్యాయవాదుల హత్య, వ్యక్తి కేంద్రంగా జరిగిన నియంతృత్వ నిర్ణయాలు, ప్రజల విజ్ఞప్తులకు చోటు లేని పాలన ఇంకా అనేక అనేక దురాగతాలు బిఆర్‌ఎస్ పార్టీని ప్రజలు అధికారానికి దూరం చేశాయి. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఒక విశ్లేషణ చేయాల్సిన బాధ్యత.. బాధ్యత గల ప్రజా సంఘంగా తెలంగాణ విద్యావంతుల వేదికపై ఉన్నది. తెరాస పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బారాసగా మారినప్పుడు కూడా రెండేళ్ల పాలనపై, మూడేళ్ల పాలనపై ఈ విధంగా ప్రతి సంవత్సరం తెలంగాణ విద్యావంతుల వేదిక ఆనాడు ఆ ప్రభుత్వ వైఫల్యాలను తెలంగాణ సమాజం ముందు ఉంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై కూడా ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని భావించి తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నది.
గత పాలన తప్పులను ఎత్తిచూపింది పౌర సమాజమే..
ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఒక సజీవమైన పౌర సమాజం క్రియాశీలక భూమిక పోషిస్తూ వస్తోంది. తెలంగాణ పౌరసమాజ సంస్థలకు ఉన్న ఏకైక లక్ష్యం.. ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తూ ప్రజల హక్కుల రక్షణ కోసం నిరంతరం శ్రమించడమే.. తెలంగాణలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసవాద రాజకీయ సంస్కృతికి చరమగీతం పాడి నూతన రాజకీయ సంస్కృతికి అంకురార్పణ చేయడంలో తెలంగాణ పౌర సమాజం పాత్ర వెలకట్టలేనిది. కానీ తెలంగాణ ప్రజల పోరాటాల కనుగుణంగా బారాస పార్టీ తన రాజకీయ సంస్కృతిని కొనసాగి ంచలేకపోయింది. అదే పౌర సమాజం దశాబ్ద కాలపు అకృత్యాలు, ఆగడాలను, విధ్వంసాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచడంలో 2023 ఎన్నికల సందర్భంలో పట్నం నుంచి పల్లె దాకా ముఖ్య భూమికను పోషించింది.
అప్పటికి కాంగ్రెస్ పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలు పోగా ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 6 మాత్రమే. కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నైరాశ్యంలో ఉన్నది. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజాక్షేత్రంలో ఉన్న సంఘటనలు చాలా అరుదు. పదేళ్ల లో ప్రజలు విసిగి వేసారి పోయి ఉన్నారు. ప్రజలకు అండగా నిలబడాల్సిన రాజకీయ పార్టీలు వాటి పాత్రను అవి నిర్వహించలేకపోయాయి. మెరుగైన పాత్రను పోషించింది ప్రజాసంఘాలు మాత్రమే.. ప్రజా సంఘాలు అయితే అనేక ఆటుపోటులు ఎదుర్కొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కంటే ఎక్కు వగా భరి ంచ రాని నిర్బ ంధాలను బ óరిం చాయి. ఈ కసి ప్రజా సంఘాలను పల్లెపల్లెకు నడిపించింది. ప్రజా సం ఘాల పనితీరుతోనే మతతత్వ బిజెపిని, ఉద్యమ పార్టీగా అధికారంలోకి వొచ్చిన తె(భా)రాస ను పక్కకు నెట్టి నిలువరించగలిగింది. ఈ సందర్భంలో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌కు అధికారం దక్కింద నేది వాస్తవం.
అర్థిక పరిస్థితులు తెలిసిందే కదా.!
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలను గుప్పించింది. 5 డిక్లరేషన్లతో, 37 అంశాలతో కూడిన 42 పేజీల మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచింది. ఎట్టకేలకు అధికారంలోకి వొచ్చినది. ఇక చేయాల్సింది ఆరు గ్యారెంటీలు, ఏడో గ్యారెంటీ అయిన అయినా ప్రజాస్వామ్య పునరుద్ధరణ. ఏడొ గ్యారెంటీ తప్ప ఇచ్చిన హామీలు అన్ని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో ముడిపడి ఉన్నవి. కాంగ్రెస్ పార్టీకి అప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసనేది వాస్తవం. అనాటికి ఆరు లక్షల కోట్లో, ఏడు లక్షల కోట్లో అప్పుల్లో తెలంగాణ మునిగిందనేది కూడా తెలంగాణ సమాజం ముందున్న వాస్తవికమైన లెక్కలే. కాంగ్రెస్ పార్టీ హామీలు కూడా వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోను రూపొందించుకొని ప్రజల ముందుకు పోయింది. ఆ వాస్తవాలు తెలిసి కూడా ప్రతీసారి అప్పుల ప్రస్తావన తెస్తూ ఇచ్చిన హామీలను వాటి చుట్టే తిప్పడం సరైన విధానం కాదు.
మాటల్లో వేగం.. అభివృద్ధిలో లేదు..
కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన తొలి నాళ్లలో ప్రభుత్వ పనితీరు కొంత ఆశాజనకంగా అనిపించింది. కానీ రానురాను వేస్తున్న అడుగులు, ఇచ్చిన హమీల అమలుకు తీవ్రమైన వ్యత్యాసం కనపడుతూ వొస్తోంది.గత పాలకులు చేసిన అప్పులను, తప్పులను లేవనెత్తుతూ వొస్తున్నారే తప్ప సరిదిద్దుతున్నట్లు కనపడటం లేదని పౌర సమాజం బలంగా అభిప్రాయపడుతుంది. ఈ ఏడాది పాలనలో లోతుగా వెళ్లి అధ్యయనం చేసి చూస్తే అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్లాలనే ఆలోచనా విధానం ప్రభుత్వ పెద్దల మాటల్లో కనపడుతుంది. కానీ నిర్మాణాత్మకమైన ఆచరణ కనపడడం లేదు. గత పాలకులకు సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలువలేదు. వీళ్లు కూడా అదే విధమైన నమూనాను అనుసరిస్తున్నారు. ప్రజల కేంద్రంగా అభివృద్ధి నమూనాను రూపొందించడం లేదు. విదేశాల నుంచి వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్నారు. కానీ తెలం గాణలో సం పదను సృషి ్టస్తామని చెప్పి నవారు ఇంత వరకు అటువైపు అడుగులు కూడా వేయ లేదు. పాత ఆదా య మార్గాల మీద ఆధారపడి మాత్రమే పాల నను కొనసా గిస్తు న్నారు. ప్రజల ఆకాం క్షలకు అను గుణ మైన ఆలోచనల కంటే పాలకుల వ్యక్తి గతమైన ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్య మిస్తు న్నారనే ముద్ర ఈ ప్రభుత్వంపై పడుతున్నది.
ప్రజలు కోరుకున్న అభివృద్ధి ఇదేనా. !
కొంత నూతనత్వాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో కొన్ని భిన్నమైన పనులకు కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో హైడ్రా ఒకటి. ఇది ప్రజలకు ఉపయోగకరమైనే సంస్థే. ఇటువంటి సంస్థలు నెలకొల్పుతున్నప్పుడు ప్రజలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవల్సి ఉండాల్సింది. కానీ స్పష్టమైన విధి విధానాలు రూపొందిం చకుండానే ప్రభుత్వం వ్యవహరించిన దుందుడుకు విధానం కొంత నష్టాన్ని కలిగించింది. మూసీని సుందరీకరించడం అనేది కూడా ప్రజారోగ్యరీత్యా ఆహ్వానించాల్సిందే. కానీ ప్రభుత్వం వేసిన అడుగు కొంత వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. మూసీ వెంట ఉన్న అనేక కంపెనీలు నదిలోకి విష పదార్థాలను విడుదల చేస్తున్నాయి. ముందుగా ఆ కంపెనీలను నియంత్రించకుండా ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డిపిఆర్) రూపొందిం చకుండా లక్ష కోట్లు కావాలనడం.. పాత పాలనా విధానాలను మరింత వేగవంతం గా కొనసాగి ంచడంలో భాగమే తప్ప మరొకటి కాదు. ఇలాంటి తొందరపాటు చర్యలు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనం. పరిశ్రమల విషయానికొస్తే ప్రభుత్వం తమకు ఆదాయం వొచ్చే ఫార్మా కంపెనీల గురించి మాత్రమే ఆలోచన చేస్తుంది. విషపూరితమైన కంపెనీలను అభివృద్ధి చెందిన దేశాలే త్యజిస్తుంటే ప్రజలకు ఎలాంటి పరిశ్రమల అవసరమో కూడా ఆలోచించడం లేదు. ఆ వైపుగా అధ్యయనం కూడా చేయడం లేదు. లాభాల కోసం మాత్రమే ఫార్మా కంపె నీల వైపు అడుగులు వేస్తో ంది.
ప్రజల ముక్తకంఠంతో వ్యతిరే కిస్తున్నప్పటికీ వేల ఎకరాల భూములను సేకరిస్తున్నారు. ప్యూఛర్ సిటీ అనే కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. 50 వేల ఎకరాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఏం నిర్మిస్తారో, ఎవరికిస్తారో, ఏం చేస్తారో, ఎవరి ప్రయోజనం కోసం అనేది ప్రజలకు విడమర్చి చెప్పడం లేదు. భూమిని సేకరించడం మొత్తానికి కార్పొరేట్ శక్తులకు వంత పాడుతూ వ్యవసాయంపై ఆధారపడి ప్రజలను వ్యవసాయ రంగానికి దూరం చేస్తూ వొస్తున్నారు. వ్యవసాయ భూములను కంపెనీలకు ఇవ్వకుండా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ప్రజానుకూలమైన పరిశ్రమలు తీసుకువస్తే భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరి హారం చెల్లించాలి. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక రకాల సమీక్షలు జరిపి తీసుకొచ్చిన 2013 భూ సేకరణ చట్టాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయకుండా కేసిఆర్ తీసుకొచ్చిన భూ సేకరణ చట్టాన్ని యథాతథంగా అమలు చేయడం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధం.
అనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పట్టించుకోక పోవడం విడ్డూరం.ట్రిపుల్ ఆర్ విషయంలో ముఖ్యమంత్రి తో సహా దిల్లీ చుట్టూ ప్రదక్షి ణలు చేస్తున్నారు. ఎట్టకేలకు టెండర్లు ఆహ్వానించారు. హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందాల్సిందే. కానీ విధ్వంసమైన తెలంగాణ మారుమూల ప్రాంతాల గురించి ఆలోచన చేయకుండా హైదరాబాద్ చుట్టూ ఉరుకులు పరుగులు పెట్టడం వికేంద్రీకరణ అభివృద్ధి నమునాకు విరుద్ధం. రియల్ ఎస్టేట్ విషయం అనేది ఒక మాఫియా.ఇది ప్రభుత్వానికి కొంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నప్పటికి దీని స్వభావం, ఆలోచవిధానం కూడా సామాన్య ప్రజలకు ఉపయేగపడేది ఏమీ లేదు. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతికి సంబంధించిన చిహ్నాల్లో మార్పులు తీసుకురావాలని యత్నించారు. కానీ ప్రజల మన్ననలను పొందలేకపోయారు. పెట్టుబడులపై, కాంట్రాక్టులపై పెట్టిన శ్రద్ధ కృష్ణా నది జలాల పంపకాల విషయంలో పెట్టడం లేదు.
ప్రజల ఆకాంక్షల వైపు దారులు పడాలి
ఈ ఏడాది పాలన మొత్తం కూడా గత పాలనా విధానాలపై విమర్శతో పాటు,హైదరాబాద్ చుట్టే తిప్పారు. గతంలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను కూడా ఇదే తంతును కొనసాగించారు. జిల్లాల అభివృద్ధి పై, జిల్లాలలో ఆదాయాన్ని సృష్టించే మార్గాలపై శ్రద్ద పెట్టడం లేదు. ప్రజల ఆదాయం పెరుగుదలకు దోహద చేసే విధంగా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే విజన్ కనబడటం లేదు. పాలనలోను ప్రజలను భాగస్వాములు చేసినప్పుడే పాలనకు అర్థం ఏర్పడుతుంది. ఏడాది పాలన పూర్తయినా విద్యాశాఖ, కార్మిక శాఖ, హోంశాఖ లాంటి కీలక మంత్రి పదవులు భర్తీ చేయలేదు. సంపూర్ణమైన పాలన ప్రజలకు అందించే దిశగా ప్రజా అభివృద్ధి నమునా వైపు కనీసం అడుగులు పడడం లేదు.ఆ వైపుగా సమీక్ష చేసుకొని ప్రభుత్వం ముందుకు సాగినప్పుడు గతానికి, వర్తమానానికి వ్యత్యాసం కనపడే అవకాశం లేకపోలేదు.
` పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక, 9441661192





