నేనెప్పుడూ ఊహించనైనా లేదు
ఒక్క చిరునవ్వు
హృదయాన్ని కదిలిస్తుందని
కన్నీళ్లను రెండు పాయలుగా
ప్రవహింప జేస్తుందని
యోధుని వదనంపై వువ్వులా
వికసిస్తుందని
రక్తం కంటె ప్రకాశంగా
కత్తికంటె పదనుగా ఉంటుందని
చావువల్ల కూడా చిరునవ్వు
పెదవులపై చెరగదు
వర్గశత్రు నాశనం కోసం
బలియైపోయిన తృప్తి
వెలిగిస్తున్నది ఆ నవ్వును
తాటిపాముల రామాచారి