మైలారం గుట్ట సమస్య మనందరిదీ!

నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు కొందరు జనవరి 5 ఆదివారం నాడు హైదరాబాద్‌ ‌వచ్చారు. తమ జీవన్మరణ సమస్య మీద పదిహేను సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ, కనీసం ఆరు సంవత్సరాలుగా మరింత తీవ్రమై, రెండు నెలలుగా తమ బతుకులకు ఆటంకంగా పరిణమించిన ఆ సమస్యను ప్రజల దృష్టికి తేవడానికి హైదరాబాద్‌ ‌వచ్చారు. సమస్యను న్యాయంగా పరిష్కరించవలసిన ప్రభుత్వ సంస్థలూ, విభాగాలూ, రాజకీయ పక్షాలూ ఆ సమస్యను పరిష్కరించని స్థితిలో తమ గోడు పౌర సమాజానికైనా, ప్రచార మాధ్యమాలకైనా వినిపిద్దామని వాళ్లు నూట అరవై కిలో మీటర్లు ప్రయాణం చేసి పట్నం చేరారు.
మైలారంలో ఒక గుట్ట ఉంది.

దాదాపు 120 ఎకరాల్లో వ్యాపించిన గుట్ట. గ్రామీణ సమాజాల గురించి తెలిసినవాళ్లకు గ్రామీణ ప్రజా జీవితంలో గుట్ట ఎంతటి జీవనాధారమో, ఎంత విడదీయరాని భాగమో తెలుస్తుంది. మైలారం గుట్టను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లిగా భావిస్తారు. ఆ గుట్ట మీద చిట్టడివిలోని చెట్ల నుంచి, పచ్చదనం నుంచి చుట్టూరా నాలుగైదు  గ్రామాలకు ప్రాణవాయువు అందుతుంది. ఆ గ్రామాల పశువులనూ, మేకలనూ మేతకు ఆ గుట్ట మీదికే తీసుకువస్తారు. మనుషులకు అవసరమైన వంటచెరకు, పండ్ల చెట్లు, ఔషధ వృక్షాలు, చిన్న చిన్న జంతువులు, పక్షులు వంటివెన్నో ఆ గుట్ట మీద ఉన్నాయి. ఆ గుట్ట, దాని మీద చెట్టూ చేమా నేలా స్పాంజి లాగా ఆపి ఉంచిన నీరు అప్పుడప్పుడు ఊటలు పారుతూ చుట్టుపక్కల చెరువుకూ, కుంటలకూ, భూగర్భ జల వనరులకూ నీరు అందిస్తాయి. ఆ చెరువుల్లో, కుంటల్లో దొరికే మత్స్యసంపద మీద ఆధారపడిన సమూహాలున్నాయి.

ఇలా భౌతిక సంపదగా మాత్రమే కాదు, ప్రత్యేకించి ఈ గుట్ట మీద శివాలయం, చెన్నకేశవస్వామి ఆలయం, వేంకటేశ్వర స్వామి ఆలయం, గ్రామ దేవతల ఆలయాలు స్థాని కులకు ఉపశమనం కలిగి స్తాయి. గుట్ట మీద ఉన్న లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఏడాదికొకసారి జరిగే ఉత్స వాలను ఆ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున జరుపు కుం టారు. మైలారం గ్రామానికి ఆనుకునే ఈ గుట్ట ఉన్నం దువల్ల కొందరు గ్రామస్తులు గుట్ట అంచున కూడా ఇళ్లు కట్టుకున్నారు. మూడు న్నరవేలకు మించిన మైలారం జనాభా, చుట్టుపక్కల మరొక ఐదారు వేల జనాభా గల గ్రామాలకు ఈ గుట్ట ఒక ప్రధానమైన అస్తిత్వ చిహ్నం, జీవనాధారం. ఈ గుట్ట మీద కొంత భాగాన్ని ఉపయోగించుకుని గత ప్రభుత్వం లక్షల రూపాయల వ్యయంతో పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం వంటి సౌకర్యాలు కూడా నిర్మించింది. ఈ గుట్టను ఆనుకుని రు. 4,500 కోట్ల ఖర్చుతో ఉమా మహేశ్వర రిజర్వాయర్‌ ‌నిర్మించే ప్రయత్నాలు కూడా జరుగు తున్నాయి. ఒక్క మాటలో చెప్పా లంటే అక్కడి జన జీవితంలోనూ, ఉత్పత్తిలోనూ, అభి వృద్ధిలోనూ, మానవ సం బంధా లలోనూ ఆ గుట్టకు ఒక కీలకస్థానం ఉంది.

కాని ఇంత ప్రధానమైన గుట్టను ఇప్పుడు ప్రభుత్వ మద్దతుతో సాగుతున్న కార్పొరేట్‌ ‌దోపిడీ ధ్వంసం చేయబోతున్నది. మైలారం గ్రామ ఉనికిని చెరిపెయ్యబోతున్నది.
అందుకు కారణం ఈ గుట్టకు ఇప్పటివరకూ మనం చెప్పుకున్న ప్రాకృతిక, సహజ, మానవ అవసరాలను తీర్చే లక్షణాలు మాత్రమే కాదు, ఈ గుట్టల్లో క్వార్టజ్, ‌ఫెల్డ్ ‌స్పార్‌ అనే రెండు విలువైన ఖనిజాలు ఉన్నాయి. అవి ఆధునిక పారిశ్రామికోత్పత్తులకు, గృహ అవసరాలకు ఉపయోగకరమైనవి. ఆ ఖనిజాలు, ఆ ఖనిజాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌ ‌లో చాలా గిరాకీ ఉన్నవి. సరిగ్గా అరబ్‌ ‌ప్రజల కాళ్ల కింద నేలలో ఉన్న చమురు నిల్వల లాగా, మధ్య భారత దండకారణ్యంలో ఆదివాసుల జల్‌, ‌జంగల్‌, ‌జమీన్‌ ‌గర్భంలో దాగిన విలువైన ఖనిజ వనరుల లాగా, మైలారం ప్రజల గుట్టలో కూడా విలువైన ఖనిజం ఉంది. అదే వాళ్ల బతుకుల మీద గొడ్డలి వేటు అవుతున్నది.

‘‘ఈ గుట్ట మీద తవ్వకాలు జరిపేందుకు దాదాపు ఇరవై ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2009 లో అప్పటి తహసీల్దారు తవ్వకానికి అభ్యంతరం లేదని పత్రం ఇచ్చారని తెలుస్తున్నది. నిజానికి ఒక గ్రామంలో, గ్రామం పరిసరాల్లో, అటవీ ప్రాంతంలో మైనింగ్‌ ‌జరపడానికి అనుమతులు, పరీక్షలు, బహిరంగ ప్రజా విచారణలు వంటి ఎన్నో ఆటంకాలు, ఆంక్షలు, పరిమితులు ఉంటాయి. ప్రపంచీకరణ విధానాల తర్వాత ఆ పరిమితులను, ఆంక్షలను క్రమక్రమంగా తగ్గిస్తూ రావడం జరిగింది. మోదీ ప్రభుత్వ పాలనా కాలంలో దాదాపుగా ప్రజోపయోగ నిబంధనాలన్నిటినీ ఎత్తివేశారు. దేశంలోని ఖనిజ వనరులన్నిటినీ కార్పొరేట్లకు కట్టబెట్టే దుర్మార్గ విధానాలు మొదలయ్యాయి.’’

మైలారం గుట్ట మీది నుంచి ఏడాదికి 70,000 టన్నుల క్వార్టజ్, ‌ఫెల్డ్ ‌స్పార్‌ ‌తవ్వి అమ్ముకోవడానికి ఒక కాంట్రాక్టర్‌ ‌కు ప్రభుత్వం దాదాపు గుట్టలోని సగభాగాన్ని లీజుకు అప్పగించింది. అది 25 కోట్ల రూపాయల పెట్టుబడితో మొదలైన వ్యాపారం అంటున్నారు. ఈ లీజు 14 సంవత్సరాల కోసం అని ప్రభుత్వ పత్రాలు అంటున్నాయి గాని, ఇరవై సంవత్సరాల వరకూ కొనసాగుతుందని ఒక కథనం ఉంది. అలాగే ఈ లీజు గుట్టలో సగ భాగానికన్నా తక్కువకు మాత్రమే అని ప్రభుత్వ పత్రాలు అంటున్నాయి గాని, దేశ వ్యాప్తంగా ఇటువంటి గనుల లీజుల్లో అధికారికంగా లీజుకు తీసుకున్న ప్రాంతాన్ని దాటి రెట్టింపు, మూడు రెట్లు, ఎన్నో రెట్లు ఎక్కువ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరిపినట్టు లెక్కలేనన్ని దాఖలాలు ఉన్నాయి. అంటే పేరుకు 25 కోట్ల రూపాయల పెట్టుబడి (అది కూడా ఆ పారిశ్రామిక, వ్యాపార వేత్త పెట్టేది కాకపోవచ్చు, బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనాన్ని రుణంగా తీసుకుని చివరికి ఎగ్గొట్టనూ వచ్చు) తో ఆ కంపెనీ 250 కోట్లో, 2500 కోట్లో సంపాదించడానికి సాగుతున్న బందిపోటు దొంగతనం ఇది.

ఈ బందిపోటులో నిర్ణయాధికారం, అజమాయిషీ, నియంత్రణాధికారం ఉన్న రాజకీయ నాయకులకూ, అధికారులకూ ముడుపుల రూపంలో వాటాలు దక్కుతాయి.
ఆ దొంగతనపు రాజకీయార్థిక వ్యవహారాలను కాసేపు పక్కనపెట్టి, తక్షణమే చూస్తే, ఈ తవ్వకాల్లో పేలుళ్లు జరుపుతున్నారు గనుక, భారీ వాహనాలు, లారీలు, జేసీబీలు, డ్రిల్లింగ్‌ ‌మిషన్‌లు తిరుగుతున్నాయి గనుక రోడ్లు మట్టికొట్టుకుపోతున్నాయి. గ్రామానికి ఇటీవలనే వేసిన బీటీ రోడ్డు బీటలు వారుతున్నది. మైనింగ్‌ ‌తో ఎగస్తున్న దుమ్ము, ధూళి వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం వాటిల్లుతున్నది. గత రెండు నెలలుగా రాత్రీ పగలూ మైనింగ్‌ ‌పనులు జరుగుతుండడంతో ఊరు అల్లకల్లోలంగా ఉంది. డ్రిల్లింగు మిషన్‌ల శబ్దాలకు చంటి పిల్లలు నిద్రలోనే ఉలిక్కిపడుతున్నారు. మైనింగ్‌ ‌జరుగుతున్నదనే పేరుతో గ్రామస్తులను అటువైపు రాకుండా భయపెడుతున్నారు. వ్యవసాయ పనుల కోసం వెళుతున్నవారిని, మైనింగ్‌ ‌ను వ్యతిరేకిస్తున్నవారిని వేధించడానికి కేసులు పెడుతున్నారు. ఇప్పటికి ఏడుగురి మీద కేసులు నమోదయ్యాయని, ఒకరిని జైలుకూడా పంపారని గ్రామస్తులు చెపుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు సరిగదా, కాంట్రాక్టర్‌ ‌కే రక్షణ కల్పిస్తున్నారు.

దీర్ఘకాలికంగా చూస్తే, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గుట్ట ఆనవాలు లేకుండా పోతుంది. దానితో పాటే దాని మీద ఉన్న పక్షి, జంతు జాతులు పోతాయి. వృక్ష జాతులు పోతాయి. గుట్టే పోతుంది గనుక నీటిని నిలువ ఉంచే వనరు పోతుంది. చుట్టూ చెరువులు, కుంటలు పోతాయి. కడతామని ప్రణాళిక వేసిన రిజర్వాయర్‌ ‌కట్టాక బీటలు వారి పనికి రాకుండా పోవడమో, అసలు కట్టాలనే ఆలోచనే విరమిం చుకోవడమో జరుగుతుంది. ఇన్ని జరిగినాక మైలారం అనే గ్రామం ఉంటుందా? ఆ గ్రామస్తులందరూ తమ వ్యవసాయాలూ వృత్తులూ జీవనోపాధులూ పోగొట్టుకుని, పొట్ట చేత పట్టుకుని నగరాల్లో అడ్డాకూలీలుగా మారుతారా? అంటే ఒక చిన్న గుట్ట, ఒక చిన్న గ్రామం సంగతి మనకెందుకు అని మనం కడుపులో చల్ల కదలకుండా కూచోవచ్చు గాని, ఇది ఎంత పెద్ద జీవన విధ్వంసమో చూస్తు న్నామా? ఈ జీవన విధ్వ ంసానికి పునాది అయిన ఒక ప్రత్యేక అభివృద్ధి నమూనా ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ, కేంద్ర ప్రభుత్వాన్నీ, అన్ని పాలక పార్టీల రాజకీయ నాయకత్వాన్నీ మాయా జాలంలా కమ్ము కుని ఉంది గనుక అసలు మౌలిక రాజకీయార్థిక విషయాలు ఆలోచి ంచవలసి ఉంది. ఈ గుట్ట మీద తవ్వకాలు జరిపేందుకు దాదాపు ఇరవై ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

‘‘పాలకులూ, ప్రభుత్వ శాఖలూ, ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌సంస్థలూ ఒక్క మైలారం లోనే కాదు, దేశమంతా ఇట్లాగే ఉన్నారు. కొన్ని చోట్ల ప్రజలు ఈ విధానాలను ప్రతిఘటించి చిన్నవో పెద్దవో పోరాటాలు చేస్తున్నారు. మైలారంలో కూడా గ్రామస్తులంతా ఒక్కట్కె గుట్ట తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ‘మైలారం గుట్ట పరిరక్షణ పోరాట కమిటీ’గా సంఘటితమయ్యారు. ఆ కమిటీ చెపుతున్న ప్రకారం, ‘‘గుట్టను ధ్వంసం చేసి అందులోని విలువైన ఖనిజాన్ని తరలిస్తున్న కాంట్రాక్టరు పోలీసులను దింపి హింసకు పాల్పడుతున్నాడు. గ్రామ యువకులను, పెద్దలను విచక్షణారహితంగా అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మలయ్యారు. ఊరిలో పోలీసు క్యాంపు వెలసింది. మహిళలు, పిల్లలు, వ్యవసాయ కూలీలు భయభ్రాంతులకు గురవుతున్నారు.’’

2009 లో అప్పటి తహసీల్దారు తవ్వకానికి అభ్యంతరం లేదని పత్రం ఇచ్చారని తెలుస్తున్నది. నిజానికి ఒక గ్రామంలో, గ్రామం పరిసరాల్లో, అటవీ ప్రాంతంలో మైనింగ్‌ ‌జరపడానికి అనుమతులు, పరీక్షలు, బహిరంగ ప్రజా విచారణలు వంటి ఎన్నో ఆటంకాలు, ఆంక్షలు, పరిమితులు ఉంటాయి. ప్రపంచీకరణ విధానాల తర్వాత ఆ పరిమితులను, ఆంక్షలను క్రమక్రమంగా తగ్గిస్తూ రావడం జరిగింది. మోదీ ప్రభుత్వ పాలనా కాలంలో దాదాపుగా ప్రజోపయోగ నిబంధనాలన్నిటినీ ఎత్తివేశారు. దేశంలోని ఖనిజ వనరులన్నిటినీ కార్పొరేట్లకు కట్టబెట్టే దుర్మార్గ విధానాలు మొదలయ్యాయి. మైలారం గుట్ట మైనింగ్‌ ‌కు సంబంధించి కూడా దొరుకుతున్న ఆధారాల ప్రకారం, పర్యావరణ అనుమతులు ఇవ్వాలని 2017 నవంబర్‌ 17‌న కంపెనీ పెట్టుకున్న దరఖాస్తును, తెలంగాణ రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు ప్రాధికార సంస్థ 2018 ఏప్రిల్‌ 12‌న జరిగిన సమావేశంలో తిరస్కరించింది. కంపెనీ చేయదలచుకున్న మైనింగ్‌ ‌జనావాసాల సమీపంలో ఉందని, పర్యావరణ ప్రభావం ప్రతికూలంగా ఉండబోతుందని, అందువల్ల తవ్వకాలకు పర్యావరణ అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

కాని పదిహేను రోజులు తిరగకుండానే కథ పూర్తిగా మలుపు తిరిగింది. కారణాలేమిటో ఎవరైనా ఊహించగలరు. ప్రతికూల ప్రభావాలు లేకుండా చర్యలు తీసుకుంటానని, కనుక అనుమతి నిరాకరణను సమీక్షించాలని కంపెనీ ఏప్రిల్‌ 16‌న ఉత్తరం రాసింది. ఏప్రిల్‌ 26‌న ప్రాధికార సంస్థ కొన్ని షరతులు విధిస్తూ తవ్వకాలు జరుపుకోవచ్చునని ఆమోదం తెలిపింది. ‘కుదరదు’ అని చెప్పిన పద్నాలుగు రోజుల లోపే ‘కుదురుతుంది’ అనే అనుమతి ఎలా వచ్చిందనేది ఒక నిగూఢ రహస్యం అయితే, ఆ పత్రంలో రాసిన షరతులు పాటిస్తున్నారా లేదా ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడం మరొక బహిరంగ వంచన. వాయు కాలుష్యం కింద తొమ్మిది షరతులు, జల కాలుష్యం కింద ఐదు షరతులు, వ్యర్థ పదార్థాల తొలగింపు కింద ఐదు షరతులు, ఇరవై ఐదు సాధారణ షరతులు ఆ పత్రంలో నమోదు చేశారు. ఈ అనుమతి పత్రం వచ్చి సరిగ్గా ఏడు సంవత్సరాలు కావస్తున్నది.

గ్రామస్తుల ప్రతిఘటన మధ్య మైనింగ్‌ ‌కూడా మొదలయింది. కాని ఒక్కటంటే ఒక్క షరతును కూడా కంపెనీ, కాంట్రాక్టర్‌ ‌పాటించలేదు. అయినా అధికారిక నియంత్రణా సంస్థలు ఏమీ పట్టించుకోవడం లేదు. కింది నుంచి పైదాకా ముడుపులు అందితే చాలు ప్రజల భద్రతా,  పర్యావరణ రక్షణా, భవిష్యత్‌ ‌తరాలకు సహజ వనరులను సవ్యంగా వారసత్వంగా అందించవలసిన అవసరం వంటి వాటన్నిటినీ తుంగలో తొక్కే అధికారవర్గ సామాజిక విలువలు రాజ్యం చేస్తున్నాయి. పాలకులూ, ప్రభుత్వ శాఖలూ, ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌సంస్థలూ ఒక్క మైలారం లోనే కాదు, దేశమంతా ఇట్లాగే ఉన్నారు. కొన్ని చోట్ల ప్రజలు ఈ విధానాలను ప్రతిఘటించి చిన్నవో పెద్దవో పోరాటాలు చేస్తున్నారు. మైలారంలో కూడా గ్రామస్తులంతా ఒక్కట్కె గుట్ట తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ‘మైలారం గుట్ట పరిరక్షణ పోరాట కమిటీ’గా సంఘటితమయ్యారు. ఆ కమిటీ చెపుతున్న ప్రకారం, ‘‘గుట్టను ధ్వంసం చేసి అందులోని విలువైన ఖనిజాన్ని తరలిస్తున్న కాం ట్రాక్టరు పోలీసులను దింపి హింసకు పాల్ప డుతున్నాడు. గ్రామ యువకులను, పెద్దలను విచక్షణారహితంగా అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మలయ్యారు. ఊరిలో పోలీసు క్యాంపు వెలసింది. మహిళలు, పిల్లలు, వ్యవసాయ కూలీలు భయభ్రాంతులకు గురవుతున్నారు.’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *