మాధురి పాలాజి
ఒక క్వీర్ అలైగా, నేను చూసిన పెద్దలోటు మనసాహిత్యంలో క్వీర్ అనుభవాలు, ప్రేమలు, పరాయితనం– ఇవి చాలావరకు పూర్తిగా గౌరవించబడకుండా ఉండిపోవడం. నా చుట్టూ ఉన్న క్వీర్ మిత్రుల్ని చూస్తూ, వాళ్లభావాల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో– ఒకప్రశ్న నన్ను వెంటాడింది: మన తెలుగుసాహిత్యం వారికి ఏమిచ్చింది? వారికి నేనిలా నిలబడినట్టు, అదికూడా నిలబడ్డదా? కొన్ని పాతకవితలలో, ముసుగులో లింగతారతమ్యాలు, ఆత్మీయ బంధాలు కనిపించాయి.
కానీ అవి చాలావరకు పేరు లేకుండా మిగిలిపోయాయి. ఆ శూన్యాన్ని నెమ్మదిగా కొంతమంది రచయితలు నింపడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో వనజ తక్కళ్లపల్లి, పావలా శ్యామలలాంటి రచయితలు ప్రేమను, లైంగికతను, స్వేచ్ఛను అద్భుతంగా చిత్రించారు. ఇప్పటికీ తెలుగుసాహిత్యంలో క్వీర్ ప్రతినిధ్యం పూర్తిగా సాధించలేదని తెలుసు.
కానీ ఈ మార్పు సాగుతోంది. ఒక అలైగా, నా బాధ్యత ఏమిటంటే కేవలం మద్దతుగా ఉండటం మాత్రమే కాదు, అక్షరాల వేదికల్లో కూడా ఆ గొంతుల్ని వినిపించేలా చేయడం. క్వీర్ అనుభవాలు కూడా సాహిత్య విశాల సముద్రంలో చోటు దక్కించుకోవాలన్నదే నా ఆకాంక్ష. ఈ ప్రయాణంలో పాఠకురాలిగా, మిత్రురాలిగా, మద్దతుదారుగా భాగం కావడం గర్వంగా ఉంది.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల