పేదల ప్రజలకు నిరంతరం అండగా ఉంటాం..
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ అని, పేదలు కొనుక్కున్న స్థలాలకు బిజేపి సంపూర్ణంగా అండగా ఉంటుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని, అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్‌లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. 149 ఎకరాల్లో ఇల్లు కట్టని వారి జాగాలను మళ్లీ మళ్లీ అమ్ముకున్నారు. తప్పు స్థలాలు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, స్థలాలు అమ్మిన బ్రోకర్లది.. వాళ్లని జైల్లో పెట్టాలి. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
చిన్న జిల్లాలు ఏర్పాటు చెస్తే పాలన సులభం అవుతుంది.. కలెక్టర్లు అందుబాటులో ఉంటారని అనుకున్నామని, కానీ కలెక్టర్లు దొరకడం లేదు. పోలీస్ కమిషనర్‌కు మనకు కలవడానికి సమయం ఉండదు. కానీ బ్రొకర్లను కలవడానికి మాత్రం సమయముంటుందని ఎద్దేవా చేశారు. నేను ఇక్కడికి వొస్తున్నట్లు మంత్రికి, పోలీసులకు చెప్పి వొచ్చారనని, కానీ తాను ఇక్కడ ఉండగా కూడా వారి గుండాలు బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఎంపీకి చెప్తారా మీ సంగతి చెప్తామంటూ స్థానికులను బెదిరిచారని తెలిపారు. పోలీసులు ఎవరికి మద్దతు తెలుపుతున్నట్లు. ఇక్కడ మీకు గౌరవం లేకుండా పోయిందని అన్నారు.
బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రాళ్ళు పట్టుకొని బెదిరించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పేదల ఖాలీ స్థలాలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలు చేస్తున్నారు.పేదలపై దౌర్జన్యం చేస్తున్నారు. అరుంధతి నగర్ బాలాజీ నగర్ జవహర్ నగర్ లో ఇలానే చేస్తే నేనే స్వయంగా వెళ్లి వొచ్చాను. 40 గజాలు 60 గజాలు ఇల్లు కట్టుకుంటున్న పేదలు. అధికారులు వొచ్చి కూలగొట్టి పోతున్నారు. దీనిపై రెవెన్యూ మంత్రి, కలెక్టర్, సిపితో మాట్లాడాను. ఈ కాలనీలో నివాసముంటున్న వారిని కొంతమంది కబ్జా దారులు గుండాలను బెదిరిస్తున్నారు. పేదలు ఇల్లు కట్టుకుంటే గుండాలు కూలగొడుతున్నారు. అధికారులు, పోలీసులు వారికి మద్దతు తెలుపుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కాగా ఎంపీ వెంట విక్రం రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు




