ఇబ్బందులు ఎన్నొచ్చినా హామీలు అమలు చేస్తాం

  • నియోజకవర్గాన్ని అబివృద్ధి పథంలో నిలుపుతాం
  • రూ. 657 కోట్లతో ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు
  • కొత్త‌గూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి క్తొతగూడెంను అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చి హామీలను అమలు చేసి తీరుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. రూ 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ ‌లైటింగ్‌ ‌ప్రారంభించిన మంత్రి పొంగులేటి జిల్లా పర్యటన సందర్భంగా సుజాతనగర్‌ ‌మండలంలోని వేపలగడ్డ గ్రామం నుంచి బృందావనం వరకు ఆర్‌అం‌డ్‌బి నిధులతో రూ 2 కోట్ల వ్యయంతో మూడు కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్‌ ‌లైటింగ్‌ను ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందు ఉందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామన్నారు. కొత్తగూడెం రామచంద్ర కళాశాలలో సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైఫిల్‌ ‌షూటింగ్‌  ‌కేంద్రాన్ని ప్రారంభించారు.

తర్వాత నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జనవరి 3న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పథ‌కంలో భాగంగా రూ 657 కోట్ల ఖర్చుతో అన్ని  పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించామని, గత ప్రభుత్వం హాస్టల్‌ ‌పిల్లలకు ఇవ్వని మౌలిక వసతులు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్ ‌లో 200 శాతం కాస్పొటిక్‌ ‌చార్జీలు పెంచామని స్పష్టం చేశారు. జిల్లాలో రామవరం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని, అందుకు కొత్తగూడెం రుద్రంపూర్‌ ‌ప్రాంతంలోని సింగరేణి, అటవీ, ప్రవేట్‌ ‌భూములను కపులకుని ఆరు నెలల్లో కొత్తగూడెంలో ఎయిర్‌ ‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి కొత్తగూడెం ప్రాంతంలో అన్ని రకాల మౌలిక వనరులను ఏర్పాటు చేస్తాను. కొత్తగూడెంలో ఇండోర్‌ ‌స్పోర్టస్ ‌స్టేడియం కోసం కృషి చేస్తామన్నారు. సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఆడబిడ్డకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న పేద విద్యార్థులకు కనీసం భోజనం పెట్టలేని పరిస్థితి ఉండేదని, ఇందిరమ్మ రాజ్యంలో నేడు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగం విస్తృత అభివృద్ధి చేయాలనే జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌ ‌ప్రత్యేక చొరవతో ఈ ఏరు పండగను రూపొందించామన్నారు. ఈ పండుగను జనవరి 9న వైకుంఠ ఏకాదశి శుభదినం సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం సందర్భంగా నిర్వహిస్తారని తెలిపారు. ఏరు అనేది ఈ జిల్లాలో మాట్లాడే గిరిజన భాషలో నీరు అని అర్థం. ఈ పేరు గోదావరి నది, ఘాట్ల చుట్టూ నిర్వహించే వేడుకలను ప్రతిబింబించేందుకు ఎంపిక చేశారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌ ఆలోచనలో భాగంగా ఈ పండుగ భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఆలయం, గోదావరి నది, బోటింగ్‌, ‌కనకగిరి శిఖరం, గిరిజన గ్రామ అనుభవం, కిన్నెరసాని డ్యామ్‌, ‌జింకల పార్కు వంటి పర్యాటక ప్రదేశాలపై దృష్టిని సారించేందుకు ప్రత్యేకత ఉంటుందన్నారు.

అనంతరం పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలో రూ1 కోటి 70లక్షలతో హై లెవెల్‌ ‌బ్రిడ్జికి మంత్రి శంకుస్థాపన చేశారు. పాల్వంచ బైపాస్‌ ‌రోడ్డుకు కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి సీతారాంపట్నం నుండి పాండురంగాపురం గ్రామం వరకు రూ 10 కోట్ల వ్యయంతో పాండురంగాపురం బ్రిడ్జి వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా నూతన సంవత్సరంలో కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగు పెడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎంపి రామసహాయం రఘురామ రెడ్డిలకు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్‌ ‌సెంటర్లో భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అంబేడ్కర్‌ ‌విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌ ,ఐటీడీఏ పీవో రాహుల్‌ ఇతర శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆళ్ళ మరళీ, నాగేంద్రత్రివేది, కెకె శ్రీను, ఐఎన్‌టియూసి ఏరియా వైస్‌ ‌ప్రసిడెంట్‌ ‌రజాక్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *