నగర వాసులకు సీఎం రేవంత్‌ ‌తీపి కబురు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వం నగర వాసులకు తీపి కబురు చెప్పింది. మెట్రో రైలు పొడిగింపులో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్‌ ‌కల నెరవేరబోతోంది. హైదరాబాద్‌ ‌నార్త్ ‌సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ప్యారడైజ్‌- ‌మేడ్చల్‌ (23 ‌కిలోటర్లు), జేబీఎస్‌-‌శార్‌పేట్‌ (22 ‌కిలోటర్లు) మెట్రో కారిడార్ల డీపీఆర్‌ల తయారీకి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చారు. వెంటనే డీపీఆర్‌లను సిద్ధం చేసి మెట్రో రైల్‌ ‌ఫేజ్‌-2 ’‌బి’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎం‌డీ ఎన్వీఎస్‌ ‌రెడ్డిని ఆదేశించారు.

పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌, ‌హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎం‌డీ ఎన్వీఎస్‌ ‌రెడ్డితో ఈ రెండు కారిడార్ల డీపీఆర్‌ ‌తయారీ విషయంపై చర్చించి ఈ మేరకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్యారడైజ్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌నుంచి తాడ్‌బండ్‌, ‌బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కిల్‌, ‌కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్‌ఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ ‌దుగా మేడ్చల్‌ ‌వరకు దాదాపు 23 కిలోటర్ల కారిడార్‌ ఉం‌టుంది. జేబీఎస్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌నుంచి విక్రమ్‌పురి, కారా?నా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్‌, ‌బొల్లారం, హకీంపేట్‌, ‌తూముకుంట, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ ‌దుగా శార్‌పేట్‌కు 22 కిలోటర్ల మేర ఈ కారిడార్‌ ‌విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ.. సీఎంకు వివరించారు.

మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్‌ ‌సమస్యలపై, ఈ కారిడార్ల రూట్‌ ‌మ్యాప్‌లపై తనకు మంచి అవగాహన ఉందని సీఎం ప్రస్తావించారు. రూట్‌ ‌మ్యాప్‌ ‌విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలు తీసుకోవాలని మెట్రో ఎండీని సీఎం ఆదేశించారు. డీపీఆర్‌ ‌తయారీని 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్టు మెట్రో ఎండీ తెలిపారు. మెట్రో ఫేజ్‌-2 ’ఏ’ ‌భాగం మాదిరిగానే ’బి’ భాగాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ ‌వెంచర్‌ ‌ప్రాజెక్టుగా రూపొందించాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని.. ఈ మేరకు వెంటనే డీపీఆర్‌, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ ‌రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *